చదివిన డిగ్రీకి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కి ఏ సంబంధం లేకపోయినా ఏఐ ఉద్యోగం సాధించగలమా? ఏఐ అంటే ఏదో రాకెట్ సైన్స్ ఏమో.. దానిని నేర్చుకోవడం, ఉద్యోగం కొట్టడం మనవల్ల అయ్యే పనేనా? ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఏఐ ఉద్యోగం వస్తుందా? - ఇవీ చాలా మంది విద్యార్థుల్లో, నాన్-ఐటీ ఉద్యోగుల్లో ఉన్న ప్రశ్నలు. చాలా మంది ఏఐ టూల్స్ నేర్చుకోవాలని ఆశపడుతున్నా.. అనేక సందేహాలతో వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం, ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా ఏఐ ఉద్యోగం సాధించేందుకు ఉన్న అవకాశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి అడుగు.. నిర్ణయం ఎటువైపు
ఏఐ రంగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే కాకుండా, కోడింగ్ అవసరం లేని అనేక ఉద్యోగాలున్నాయి. మొదట మీ ఆసక్తిని బట్టి ఒక మార్గాన్ని ఎంచుకోండి. తక్కువ సమయంలో కెరీర్ ప్రారంభించడానికి ఈ రోల్స్ ఎంచుకోవచ్చు.
ప్రాంప్ట్ ఇంజనీర్ (Prompt Engineer): ChatGPT, Claude వంటి AI టూల్స్ నుండి ఖచ్చితమైన సమాధానాలు రాబట్టేలా సరైన ప్రశ్నలు (Prompts) తయారు చేయడం. దీనికి మంచి కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ ఉండాలి.
AI డేటా అనోటేటర్ / ఇవాల్యుయేటర్ (Data Annotator): ఏఐ మోడల్స్ నేర్చుకోవడానికి అవసరమైన డేటాను (టెక్స్ట్, ఇమేజ్, ఆడియో) లేబ్లింగ్ చేయడం మరియు ఏఐ ఇచ్చే సమాధానాల నాణ్యతను పరీక్షించడం.
AI కంటెంట్ మోడరేటర్ (Content Moderator): ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ సురక్షితంగా, నైతికంగా ఉందో లేదో రివ్యూ చేయడం.
ప్రాథమిక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లు (Build Skills)
ఎంచుకున్న మార్గాన్ని బట్టి రోజువారీగా నేర్చుకోవడం ప్రారంభించండి. మీరు సాఫ్ట్‌వేర్ వైపు అంటే టెక్నికల్ సైడ్.. వెళ్లాలనుకుంటే ఈ టెక్నాలజీలు నేర్చుకోవాల్సిందే.
ప్రోగ్రామింగ్ & లైబ్రరీలు: పైథాన్ (Python)ను పూర్తిగా నేర్చుకోవాలి. దానితో పాటు డేటా విశ్లేషణ కోసం NumPy, Pandas మరియు విజువలైజేషన్ కోసం Matplotlib, Seaborn నేర్చుకోవాలి.
మెషిన్ లెర్నింగ్ బేసిక్స్: Scikit-Learn లైబ్రరీని ఉపయోగించి లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్ వంటి బేసిక్ ఆల్గారిథమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి.
డీప్ లెర్నింగ్ & LLM: నేటి ఆధునిక ఏఐ టూల్స్ వెనుక ఉన్న Deep Learning (TensorFlow లేదా PyTorch) మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) పై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
నాన్-టెక్నికల్ వైపు వెళ్తే: ChatGPT, Claude వంటి టూల్స్ ద్వారా ఉత్తమ ఫలితాలను ఎలా రాబట్టాలో (Prompt Engineering) తెలుసుకోండి.
ఉచిత సర్టిఫికేషన్లు: Google AI Essentials లేదా Microsoft AI-900 వంటి ఫౌండేషన్ కోర్సులను పూర్తి చేసి మీ రెస్యూమేను బలోపేతం చేసుకోండి.
ఫ్రీలాన్స్‌తో పాటు లైవ్ ఎక్స్‌పీరియన్స్
ఈ కింది వెబ్‌సైట్‌లు లైవ్ ప్రాజెక్ట్‌లపై పని చేసే అవకాశం కల్పిస్తూ గంటల చొప్పున డాలర్లలో చెల్లిస్తాయి. వీటికి ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు.
DataAnnotation.tech: ఏఐ చాట్‌బాట్‌లను ట్రైన్ చేయడానికి, కోడింగ్/నాన్-కోడింగ్ టాస్క్‌లను ఎవాల్యుయేట్ చేయడానికి బెస్ట్ ప్లాట్‌ఫారమ్.
Outlier.ai & Mindrift: ఇవి కూడా ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం గ్లోబల్ లెవెల్లో ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటాయి.
Remotasks: బేసిక్ ఇమేజ్ అనోటేషన్ మరియు టెక్స్ట్ టాస్క్‌లతో కెరీర్ ప్రారంభించడానికి సులభమైన వేదిక.
రెజ్యూమే, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ (Proof of Work)
సర్టిఫికెట్ల కంటే మీరు చేసిన పనులే ఉద్యోగాన్ని తెచ్చిపెడతాయి. అనుభవం లేనప్పుడు కంపెనీలు మీ ప్రాజెక్ట్‌లను చూసే ఉద్యోగాలు ఇస్తాయి.
క్రియేట్ చాట్‌బాట్: ఒక చిన్న చాట్‌బాట్ డెమో, ఏదైనా డేటా అనలిటిక్స్ డాష్‌బోర్డ్, లేదా మీ సొంత ప్రాంప్ట్ లైబ్రరీని (Prompt Library) క్రియేట్ చేయండి.
GitHub ప్రొఫైల్: మీరు చేసిన ప్రతి చిన్న కోడింగ్ ప్రాజెక్ట్ లేదా మీరు రాసిన బెస్ట్ ప్రాంప్ట్‌ల కలెక్షన్‌ను GitHub లో భద్రపరచండి.
Kaggle పోటీలు: డేటా సైన్స్ రంగానికి చెందిన Kaggle వెబ్‌సైట్‌లో ఉచిత పోటీలలో పాల్గొని, మీ ర్యాంకును రెస్యూమేలో యాడ్ చేయండి.
ఇంపాక్ట్ రెజ్యూమే: మీ రెజ్యూమేలో కేవలం "నేర్చుకున్నాను" అని కాకుండా, ఏఐ టూల్స్ వాడి ఒక పనిని ఇంత వేగంగా చేశాను అని సంఖ్యలతో చూపించండి.
నెట్‌వర్కింగ్ మరియు ఉద్యోగ అన్వేషణ
LinkedIn డైలీ పోస్టింగ్: LinkedIn ప్రొఫైల్‌ను ప్రొఫెషనల్‌గా మార్చుకోండి. మీరు రోజువారీగా నేర్చుకుంటున్న విషయాలను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయండి. ఇది రిక్రూటర్ల దృష్టిని ఆకర్షిస్తుంది.
కోల్డ్ ఈమెయిలింగ్ (Cold Emailing): ఏఐ స్టార్టప్ కంపెనీల ఫౌండర్లకు, హెచ్ ఆర్‌లకు లింక్డ్‌ఇన్‌లో మెసేజ్ చేస్తూ, వాళ్ల ఏఐ ప్రొడక్ట్స్‌పై ఉచితంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి లేదా ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం అడగండి.
హ్యాకథాన్స్ (Hackathons): Devpost వంటి వెబ్‌సైట్లలో జరిగే ఏఐ హ్యాకథాన్‌లలో పాల్గొనడం ద్వారా టీమ్ వర్క్ అలవడటమే కాకుండా కంపెనీల డైరెక్ట్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
"AI+X" ఫార్ములాను వాడండి
మీకు కోడింగ్ రాకపోయినా, మీ మునుపటి చదువు లేదా వేరే రంగంలో ఉన్న అనుభవాన్ని ఏఐకి జోడించవచ్చు. దీనినే "AI + Domain" అంటారు.
మార్కెటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే: AI Marketing Specialist గా మారండి (HubSpot, Jasper వంటి ఏఐ టూల్స్ వాడడం).
ఫైనాన్స్ / కామర్స్ ఉంటే: AI Financial Analyst (ఏఐ టూల్స్ ద్వారా స్టాక్ మార్కెట్ లేదా అకౌంటింగ్ డేటా విశ్లేషించడం).
హెచ్ఆర్ / అడ్మిన్ ఉంటే: AI Recruiter (రెజ్యూమేలను స్క్రీనింగ్ చేసే ఏఐ సాఫ్ట్‌వేర్‌లను ఆపరేట్ చేయడం).
ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్
Hugging Face: ఇది ఏఐ రంగానికి ఫేస్‌బుక్ లాంటిది. ఇక్కడ ఉచితంగా అకౌంట్ తెరిచి, ఇతరులు చేసిన ఏఐ మోడల్స్‌ను టెస్ట్ చేయండి, వాటిపై రివ్యూలు రాయండి.
GitHub Issues: ప్రముఖ ఏఐ టూల్స్ (ఉదాహరణకు LangChain, AutoGPT) లలో చిన్న చిన్న లోపాలు (Bugs) ఉంటే, వాటిని సరిచేయడానికి ప్రయత్నించండి. ఇది మీ రెస్యూమే బరువును విపరీతంగా పెంచుతుంది.
ఇంటర్న్‌షిప్స్, షాడోయింగ్
AI స్టార్టప్‌లను టార్గెట్ చేయండి: Wellfound (గతంలో AngelList), Y Combinator Job Board వంటి సైట్లలో చిన్న ఏఐ స్టార్టప్స్ ఉంటాయి. వీరు ఉచితంగా లేదా తక్కువ స్టైఫండ్‌తో ఫ్రెషర్లను చేర్చుకుని పని నేర్పిస్తారు.
షాడోయింగ్: లింక్డ్‌ఇన్‌లో ఉన్న ఏఐ మేనేజర్లను సంప్రదించి, "నేను మీ ప్రాజెక్ట్‌ను గమనిస్తూ ఉచితంగా సాయం చేస్తాను" అని అడగండి.
రెజ్యూమే.. మీ ప్రతిభకు అద్దం
ప్రొఫెషనల్ సమ్మరీ: రెజ్యూమే పైన ఉండే ఈ 2-3 లైన్లు రిక్రూటర్ దృష్టిని ఆకర్షించాలి. "నేను ఫ్రెషర్‌ని, నాకు ఉద్యోగం కావాలి" అని కాకుండా మీ నైపుణ్యాన్ని హైలైట్ చేయండి.
ప్రాజెక్ట్‌ల విభాగం - ముఖ్యం: మీకు కంపెనీ అనుభవం లేదు కాబట్టి, మీరు సొంతంగా చేసిన ప్రాజెక్ట్‌లనే మీ అనుభవంగా రెజ్యూమే చూపించాలి. ప్రతి ప్రాజెక్ట్‌ను STAR (Situation, Task, Action, Result) పద్ధతిలో రాయండి.
కీ-సెక్షన్.. నైపుణ్యాల విభాగం: రెజ్యూమేలో సాధారణ పదాలు కాకుండా, ప్రస్తుతం ఏఐ కంపెనీలు వెతుకుతున్న కీ-వర్డ్స్ (Keywords) పెట్టాలి. మీకున్న నాలెడ్జ్ బట్టి వీటిని విడదీసి రాయండి.
AI-Driven ఎక్స్పీరియన్స్: మీరు గతంలో నాన్-టెక్నికల్ పనులు (ఉదాహరణకు: కస్టమర్ సపోర్ట్, కంటెంట్ రైటింగ్, లేదా సేల్స్) చేసి ఉంటే, అక్కడ ఏఐ టూల్స్ ఎలా వాడారో రాయండి.
సర్టిఫికేషన్లు & ఆన్‌లైన్ ప్రెజెన్స్: కోర్స్ ఎరా లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో చేసిన Google AI Essentials, Microsoft Azure AI Fundamentals, లేదా DeepLearning.AI సర్టిఫికేట్లను స్పష్టంగా రాయండి. మీ LinkedIn మరియు GitHub (కోడింగ్ ఉంటే) ప్రొఫైల్ లింకులను రెస్యూమే హెడ్డర్‌లోనే క్లిక్ చేసేలా (Hyperlink) పెట్టండి.
అన్ని ఉద్యోగాలకు ఒకే రెజ్యూమ్ వద్దు: ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్ కి రెజ్యూమే పంపేటప్పుడు ప్రాంప్ట్స్ గురించి, డేటా అనలిస్ట్ జాబ్ కి రెజ్యూమే పంపేటప్పుడు డేటా విశ్లేషణ ప్రాజెక్ట్స్ గురించి హైలైట్ చేయండి.
ఇంటర్వ్యూల్లో గెలిపించే స్మార్ట్ వ్యూహాలు
"రివర్స్ ఇంటర్వ్యూ" హ్యాక్: అనుభవం లేనప్పుడు కంపెనీలు మిమ్మల్ని అడిగే ప్రశ్నల కంటే, మీరు కంపెనీని అడిగే ప్రశ్నలు మీ ప్రతిభను చూపిస్తాయి. "రాబోయే 6 నెలల్లో మీ కంపెనీ ఏ కొత్త ఏఐ టూల్స్ లేదా ఫీచర్లను బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తోంది?" ఇటువంటి ప్రశ్నలు మీకు సబ్జెక్ట్ పట్ల ఎంత లోతైన ఆసక్తి ఉందో తెలియజేస్తాయి.
"నువ్వే ఒక ఏఐ" లా ఆలోచించు: ఏఐ ఉద్యోగాల ఇంటర్వ్యూలలో టెక్నికల్ ప్రశ్నల కంటే సమస్యను పరిష్కరించే విధానాన్ని ఎక్కువగా చూస్తారు. మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు, ఒక ఏఐ మోడల్ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తుందో స్టెప్-బై-స్టెప్ వివరించండి.
ఈమెయిల్స్ అండ్ పాడ్‌కాస్ట్: ఏఐ రంగంలో రోజూ ఏదో ఒక మార్పు వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు అప్‌డేటెడ్‌గా ఉన్నారని నిరూపించుకోండి. TLDR AI, The Batch (by Andrew Ng) వంటి ఉచిత ఈమెయిల్ న్యూస్‌లెటర్స్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాడ్ కాస్ట్‌లను వింటూ ఉండండి.
డిగ్రీ లేదా ముందస్తు అనుభవంతో సంబంధం లేకుండా ఏఐ రంగం అందరికీ సమాన అవకాశాలను ఇస్తోంది. సరైన రోడ్‌మ్యాప్‌ను పాటిస్తూ స్మార్ట్‌గా ప్రిపేర్ అవ్వండి, ఏఐ విప్లవంలో మీ కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకోండి.
ai jobs no experience ai job jobs in ai without coding software engineer jobs ai impact on jobs ai testing jobs how to get job in ai ai engineer job ai job market btech students non-it employees ai job without experience ai engineer jobs