వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మానిటైజేషన్ రూల్స్లో యూట్యూబ్ కొన్ని మార్పులు తెచ్చింది. ఇప్పటికే యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నవారు, ఇకపై సంపాదించాలనుకునేవారు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి.
ఐదేళ్ల క్రితం యూట్యూబ్ తన ఫ్లాట్ఫాంలో ఎవరైనా వీడియోలు షేర్ చేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించడానికి అవకాశం కల్పించింది. దీనికి ముందుగా మీరు సైన్ అప్ కావాలి. తర్వాత ఒక ఛానల్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత దానిలో వీడియోలు అప్లోడ్ చేస్తుండాలి. ఆ వీడియోలకు వచ్చిన వ్యూస్ (అంటే ఎంత మంది ఆ వీడియో చూశారు అనే దాన్ని) బట్టి మీకు యూట్యూబ్ కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇలా అందరికీ వీడియోలు పెట్టే అవకాశం ఇవ్వడం, వాటికి డబ్బులు కూడా వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యూట్యూబ్లో తమ వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు ఇలా వీడియోలు ఎక్కువైపోవడం యూట్యూబ్కి తలనొప్పిగా మారింది. అందుకూ రూల్స్ కఠినం చేసింది.
ఇవీ కొత్త రూల్స్
* వీడియో కంటెంట్ను మానిటైజ్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్కు ఇకపై 10 వేల లైఫ్ టైమ్ వ్యూస్ తప్పనిసరిగా ఉండాలి. అంటే ఆ ఛానల్ను ఇప్పటివరకు కనీసం 10 వేల మంది చూసి ఉండాలి. అంటే అన్ని వ్యూస్ వచ్చిన ఛానల్సే రేస్లో నిలబడతాయి. కాబట్టి పక్కవాళ్ల కంటెంట్ కొట్టేసి, మూవీ క్లిప్స్ యాడ్ చేసేసి యూట్యూబ్ ఛానల్స్ నడపాలనుకునేవాళ్లకు అడ్డుకట్ట పడుతుంది.
* 10 వేల వ్యూస్ వచ్చాకే ఆ ఛానల్ను మానిటైజేషన్కు యూట్యూబ్ లెక్కలోకి తీసుకుంటుంది. ఆ ఛానల్, అందులో అప్లోడ్ చేసే వీడియోలు తమ పాలసీకి అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది. అప్పుడే ఆ ఛానల్ వీడియోలకు డిస్ప్లే చేసుకోవడానికి యాడ్స్ ఇచ్చి, వచ్చిన ఆదాయంలో కొంత భాగం ఇస్తుంది.
* ప్రస్తుతానికి యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాం కింద ఎవరయినా అప్లయి చేసుకుని వాళ్ల వీడియోలు ఓ ఛానల్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ రానున్న రోజుల్లో కొత్త అప్లికేషన్లను రివ్యూ చేయాలని యూట్యూబ్ నిర్ణయించింది. అంటే అప్పటికే ఆ ఛానల్కి 10వేల లైఫ్టైమ్ వ్యూస్ ఉండాలి. కాబట్టి ఒరిజినల్ కంటెంట్ ఉన్నవాళ్లకు, స్టఫ్ ఉన్న వీడియోలు పెట్టేవాళ్లకే యూట్యూబ్తో సంపాదించడం సాధ్యమవుతుందని యూట్యూబ్ అంటోంది.
* యూట్యూబ్లో ఎవరైనా వ్యక్తి లేదా ఛానల్ వేరే వాళ్ల కంటెంట్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదా టెక్స్ట్ను కాపీ చేసి వాడుకుంటే కంప్లయింట్ చేయొచ్చు. ఇందుకోసం ఈ కంప్లయింట్ ప్రాసెస్ను కూడా యూట్యూబ్ ఈజీ చేసింది.
YouTube Monetization New Rules YouTube Monetization యూటà±à°¯à±‚బౠ దà±à°µà°¾à°°à°¾ సంపాద‌న‌ యూటà±à°¯à±‚బౠదà±à°µà°¾à°°à°¾ సంపాదించ‌డానికి కొతà±à°¤ రూలà±à°¸à±â€Œ యూటà±à°¯à±‚బౠమానిటైజేష‌నౠరూలà±à°¸à±â€Œ Â