ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

ప్రపంచంలో కొన్ని రకాల వైరస్ లు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని మీకు తెలుసా. ఈ వైరస్ ల ద్వారా కొన్ని కోట్ల నష్టాలను కంపెనీలు చవిచూశాయి. కంప్యూటర్లలోకి చొరబడిన ఈ వైరస్ లు ఫైల్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా సిస్టమ్స్ లోకి ప్రవేశించి మొత్తం ఆర్థికరంగాన్ని కుదేలు చేశాయి. అలాంటి ఆరు వైరస్ లను మీకందిస్తున్నాం చూడండి. 
ILoveYou
ఐ లవ్ యూ వైరస్ ఈమెయిల్, ఫైల్ షేరింగ్ నెట్ వర్క్స్ ద్వారా సిస్టమ్ లోకి వ్యాపించింది. తద్వారా 5లక్షలకు పైగా సిస్టమ్స్ లోకి వైరస్ వ్యాపించగా తొలివారంలో 5.5 బిలియన్ డాలర్లు ఎఫెక్ట్ కాగా.. మొత్తం 15 బిలియన్లు డాలర్లు (రూ.15వందల కోట్లు) వరకు నష్టం వాటిల్లినట్టు నివేదిక గుర్తించింది. 
MyDoom
ఈ ప్రాణాంతక వైరస్ ద్వారా రష్యా ఈ-మెయిల్ స్పామర్స్ custom-built ప్రొగ్రామ్ ను క్రియేట్ చేశారు. అత్యంత వేగంగా వైరస్ స్ప్రెడ్ చేయగల వైరసు బగ్స్ లో ఇది ఒకటి. దీని కారణంగా 38 బిలియన్లు డాలర్లు (రూ.38వందల కోట్లు) నష్టం వాటిలినట్టు అంచనా. 
SoBig
ఇదొక ట్రోజన్ వైరస్. ఈమెయిల్స్ ద్వారా వైరల్ స్పామ్ లా సర్పేడ్ అవుతుంది. చిన్న పరిమాణంలో ఉండే ఈ బగ్.. కంప్యూటర్ సిస్టమ్ లోని ఫైల్స్ ను కాపీ చేసి ఇతరులకు ఈమెయిల్ చేస్తుంది. తద్వారా కంప్యూటర్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ డ్యామేజ్ అవుతుంది. ఈ మాల్ వేర్ వైరస్ కారణంగా వందల వేల PCలు ఎఫెక్ట్ కాగా.. 37 బిలియన్ల డాలర్లు (రూ.37వందల కోట్లు) నష్టానికి దారితీసింది. 
WannCry
వన్నా క్రై రాన్సమ్ వేర్ క్రిప్టో వామ్ బగ్.. సిస్టమ్ లపై బ్యాక్ డోర్ నుంచి కూడా ఎటాక్ చేస్తుంది. వన్నా క్రై వైరస్  కారణంగా 150దేశాల్లో 2లక్షలకు పైగా కంప్యూటర్లు ఎఫెక్ట్ అయ్యాయి. ఇంగ్లాండ్ లోని నేషనల్ హెల్త్ సర్వీసు సిస్టమ్స్ లో ఎఫెక్ట్ కావడంతో 100 మిలియన్ డాలర్లు (రూ.10 కోట్లు) వరకు నష్టం వాటిల్లింది. సంస్థకు సంబంధించిన మొత్తం సిస్టమ్స్ తో కలిపితే 4 బిలియన్ల డాలర్లు (రూ.4వందల కోట్లు) వరకు నష్టం జరిగినట్టు అంచనా. 
DarkTequila
ఇదో అధునాతన వైరస్. ఒకసారి ఎఫెక్ట్ అయితే.. తప్పించుకోవడం కష్టమే. లాటిన్ అమెరికాలోని యూజర్లే లక్ష్యంగా ఈ వైరస్ ద్వారా ఎటాక్ చేస్తుంటారు. డార్క్ టెక్విల్లా వైరస్.. బ్యాంకు క్రెడిన్షియల్స్, కార్పొరేట్ డేటా, ఆన్ లైన్, ఆఫ్ లైన్ డేటాను హ్యాక్ చేస్తుంది. దీనికారణంగా చాలామంది యూజర్లు మిలియన్ల డాలర్లు నష్టపోయారు. 
BlackEnergy
ఈ వైరస్ ను రెండు రకాలుగా సిస్టమ్స్ ను బ్రేక్ చేస్తుంది. ఆధునాతన రూట్ కిట్/ప్రాసెస్-ఇంజెక్షన్ టెక్నిక్స్, రొబస్ట్ ఎన్ క్రిప్షన్, మాడ్యులర్ అర్కిటెక్చర్ తో లోడై ఉంటుంది. దీన్నే ‘డ్రాపర్’ అని కూడా అంటారు. బ్లాక్ ఎనర్జీ వైరస్ ను ఎక్కువగా సైబర్ ఎటాక్ కు వాడుతుంటారు. 2015 డిసెంబర్ లో ఉక్రేయిన్ లో భారీ స్థాయిలో బ్లాకౌట్ కు కారణమైంది.

న్యూస్ టెక్నాలజీ మొబైల్స్ వైరస్ హ్యాకింగ్ ఐలవ్ యూ మైడూమ్ సోబిగ్ వన్నాక్రై డార్క్ టెక్విల్లా బ్లాక్ ఎనర్జీ