ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

పాస్‌పోర్ట్‌.. భార‌త పౌరుల‌కు త‌ప్ప‌ని స‌రిగా కావాల్సిన డాక్యుమెంట్‌.. ముఖ్యంగా విదేశాల‌కు వెళ్లే వాళ్ల‌కు ఈ గుర్తింపు కార్డు చాలా అవ‌స‌రం. అయితే చాలామందికి పాస్‌పోర్ట్ ఎలా పొందాలో తెలియ‌దు. కొంత‌మంది ద‌ళారుల ద్వారా వెళ్లి మోసాల‌కు గురి అవుతుంటారు. ఆన్‌లైన్‌లో కూడా పాస్‌పోర్ట్‌కు సంబంధించి సైట్లు చాలా ఉన్నాయి. కానీ వాటిలో అఫిషియ‌ల్‌గా ఉన్న‌వి త‌క్కువ‌గా అన్ అఫీషియ‌ల్‌గా వ్య‌వ‌హారాలు న‌డిపించేవి ఎక్కువ‌. మ‌రి పాస్‌పోర్ట్ విష‌యంలో మీరు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన కొన్ని వెబ్‌సైట్లు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం!

ఇండియాపాస్‌పోర్ట్.ఓఆర్‌జీ
గూగుల్‌లో పాస్‌పోర్టు పొంద‌డం ఎలా అని కొడితే చాలు మీ ముందుకు వంద‌ల కొద్దీ వెబ్‌సైట్లు వ‌చ్చి ప‌డ‌తాయి. ర‌కర‌కాల ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌న‌ల్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తాయి. వీటిలో జెన్యున్ సైట్ల ద్వారా మ‌నం వివ‌రాలు సెర్చ్ చేస్తే ఫ‌ర్వాలేదు కానీ కొన్ని న‌కిలీ సైట్ల‌తోనే చిక్కులు ఉంటాయి. వాటిలో మొద‌టిది ఇండియాపాస్‌పోర్ట్‌.ఓఆర్‌జీ సైట్. ఈ సైట్‌ను యూజ్ చేసి మోసానికి గురైన‌వాళ్లు చాలామంది ఉన్నారు. మ‌నం ఇచ్చిన వ్య‌క్తిత స‌మాచారం దుర్వినియోగం అయిపోయింది. 

ఆన్‌లైన్‌పాస్‌పోర్ట్ఇండియా.కామ్‌
పాస్‌పోర్ట్‌ల విష‌యంలో బురిడీ కొట్టించే మ‌రో సైట్  ఆన్‌లైన్‌పాస్‌పోర్ట్ఇండియా.కామ్‌. ఈ సైట్ ఓపెన్ చేయ‌గానే మీకు వివ‌రాలు అన్ని క‌నిపిస్తూ ఉంటాయి. అంతా బాగానే ఉంటుంది కానీ లోప‌లికి వెళ్లే స‌రికి ఇది న‌కిలీ అని తెలిసిపోతుంది.  అన్ని ప్ర‌భుత్వ ఫీజుల‌తో క‌లిసి రూ.2500 క‌డితే చాలు అన్న‌ట్లు ప్యాకేజీలు ఉంటాయి. వీటిని చూసి టెంప్ట్ అయిన‌వాళ్లు డ‌బ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సైట్‌కు వివ‌రాలు ఉండ‌వు, ఓన‌ర్ ఎవ‌రో తెలియ‌దు. మ‌న డ‌బ్బులు మాత్రం గాల్లోకి వెళిపోతాయి.

పాస్‌పోర్ట్ఇండియాపోర్ట‌ల్‌.ఇన్‌
మ‌న‌ల్ని మోసం చేసేందుకు పుట్టిన మ‌రో సైట్ పాస్‌పోర్ట్ఇండియాపోర్ట‌ల్‌.ఇన్‌. ఇందులో మ‌న వివ‌రాలు ఇచ్చి డ‌బ్బులు క‌ట్టామంటే మీ ప‌ని అయిపోయిన‌ట్లే. మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాలు ట్రేస్ చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి మ‌న డ‌బ్బ‌లు లాగ‌డం వ‌ర‌కు అన్ని జ‌రిగిపోతాయి. దీంతో పాటు పాస్‌పోర్ట్‌-సేవ‌.ఇన్, పాస్‌పోర్ట్‌-ఇండియా.ఇన్ కూడా ఇలాంటి సైట్ల కోవ‌కే వ‌స్తాయి. 

Don't use passport websites government