జ్యూస్జాకింగ్.. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ వంటి డివైజ్లు ఛార్జింగ్ పెడితే మీ పాస్వర్డ్లు, డేటా కొట్టేసి మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసే కొత్త రకం చోరీ. దీని గురించి మనం ఇటీవలే చెప్పుకున్నాం. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకయిన ఎస్బీఐ తన కస్టమర్లకు జ్యూస్ జాకింగ్ గురించి అలర్ట్ ఇచ్చింది. పండగల సీజన్ ముందున్న వేళ ఎక్కువ మంది వెకేషన్లకు, సొంతూళ్లకు వెళ్లడం చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఛార్జింగ్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ పెట్టొద్దని ఎస్బీఐ హెచ్చరిస్తోంది.
ఏమిటీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు?
ఎంత ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా గానీ ఛార్జింగ్ లేకపోతే వేస్టే. అందుకే పెద్ద పెద్ద మాల్స్లో, షాపింగ్ కాంప్లెక్స్ల్లో, పబ్లిక్తో ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేస్ల్లో ఒక ఛార్జింగ్ డాక్ పెట్టి దానికి యూఎస్బీ కేబుల్ తగిలించి ఉంచుతున్నారు. వీటినే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అని పిలుస్తున్నారు. ఇండియాలో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కూడా బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో మనం ఛార్జర్ తీసుకెళ్లకపోయినా ఫోన్ లేదా ల్యాపీ లేదా ట్యాబ్ వంటి వాటిని నేరుగా అక్కడున్న యూఎస్బీకి తగిలించి ఛార్జ్ చేసుకోవచ్చు.
అయితే ఈ యూఎస్బీ కేబుల్లో మాల్వేర్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంచే సైబర్ నేరగాళ్లు ఉన్నారు. ఇది తెలియక మనం ఆ డేటా కేబుల్తో మన డివైజ్ను ఛార్జ్ చేసుకుంటే దాన్ని ఆ మాల్వేర్ హ్యాక్ చేస్తుంది. దానిలో ఉన్న డేటాను యాక్సెస్ చేస్తుంది. మన పాస్వర్డ్లు తెలుసుకుని మన బ్యాంక్ అకౌంట్లను కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో మీ డివైస్ను ఛార్జ్ చేసుకునేటప్పుడు ఇలాంటి జ్యూస్ జాకింగ్ ప్రమాదం పొంచి ఉందని ఎస్బీఐ తన కస్టమర్లను తాజాగా హెచ్చరించింది.
ఎలా అడ్డుకోవాలి?
జ్యూస్ జాకింగ్ను నివారించడానికి ఎస్బీఐ కొన్ని ముందు జాగ్రత్త చర్యలను సూచించింది. అవేమిటంటే
* ఇలా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో చార్జింగ్ పెట్టుకోవాలంటే మాత్రం బాగా ఆలోచించుకోవాలని ఎస్బీఐ హెచ్చరిస్తోంది.
* ఇంట్లోనో, ఆఫీస్లో ఉండగానే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి.
* మీరు బయటికెళ్లినప్పుడు ఛార్జింగ్ అయిపోతే వాడుకోవడానికి వీలుగా పవర్ బ్యాంక్ను వెంట తీసుకెళ్లండి.
* మీ సొంత ఛార్జర్, కేబుల్ తీసుకెళ్లడం అన్నింటికంటే మంచి ఆప్షన్. వీలైన చోట దానితో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
పబà±à°²à°¿à°•ౠఛారà±à°œà°¿à°‚à°—à± à°¸à±à°Ÿà±‡à°·â€Œà°¨à±à°²à± à°œà±à°¯à±à°¸à± జాకింగౠఎసà±â€Œà°¬à±€à° à°œà±à°¯à±‚à°¸à±â€Œà°œà°¾à°•ింగౠఅల‌రà±à°Ÿà±â€Œ సైబ‌రౠకà±à°°à±ˆà°®à±â€Œ  public Charging stations Juice jacking  SBI warns juice jacking Cyber crime