ట్రూకాలర్ వాడేవారు జాగ్రత్తపడండి, మీ డేటా హ్యాక్ అవుతోంది

మీరు True Caller వాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త. మీ పర్సనల్ డేటా డేంజర్ లో ఉండొచ్చు. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారట. ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు గురి కావడంతో యూజర్లను ఆందోళను గురిచేస్తోంది. డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్  పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌లో దొరుకుతోంది.

 ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్... ఇలా మొత్తం డేటా ఎవరైనా పొందొచ్చు. ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులది కావచ్చని సమాచారం. దీనికి ప్రధాన కారణం ట్రూకాలర్ యూజర్లలో 60-70 శాతం అంటే 14 కోట్ల మంది ఇండియన్ యూజర్ల కావడం. 

ట్రూ కాలర్ మొబైల్ యాప్ బేసిడ్ గ్లోబల్ యూజర్లు 140 మిలియన్లు (14 కోట్లు) మంది ఉండగా.. డార్క్ వెబ్ లో యూజర్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారం అత్యధికంగా 25వేల యూరోలు (రూ.19.45 లక్షలు)గా సేల్ చేస్తున్నట్టు గుర్తించింది. వారిలో ఇండియన్ యూజర్లకు చెందిన పర్సనల్ డేటా 60 నుంచి 70 శాతం 2వేలు యూరోలు (రూ.1.55 లక్షలు) వరకు అమ్మకానికి ఉన్నట్టు నివేదిక తెలిపింది.  ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు సంబంధించి ముందుగా స్వీడన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెలుగులోకి తెచ్చింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అనధికారంగా కాపీ చేస్తున్నట్టు గుర్తించింది.

కోట్లాది మంది యూజర్ల డేటా లీక్ వ్యవహారంపై ట్రూకాలర్ స్పందించింది. ట్రూకాలర్ యూజర్ల డేటా లీక్‌ కాలేదని ఖండించింది. కొందరు యూజర్లు తమ అకౌంట్లను దుర్వినియోగం చేస్తున్నారని ట్రూకాలర్ వాదన. డేటా లీక్ వ్యవహారం సంచలనం రేపుతుండటంతో క్షుణ్ణంగా విచారణ జరిపామని, డేటా లీక్‌కు సంబంధించిన ఆధారాలు లభించలేదని ట్రూకాలర్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. శాంపిల్ డేటా ట్రూకాలర్ డేటాతో మ్యాచ్ కాలేదని వెల్లడించారు. యూజర్ల డేటా తమ సర్వర్లలో సురక్షితంగా ఉందని, యూజర్ల ప్రైవసీకి ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రూకాలర్ వాదన ఇలా ఉంటే, భారీస్థాయిలో డేటా లీకైందని సైబర్ నిపుణులు నమ్ముతున్నారు .

న్యూస్ టెక్నాలజీ ట్రూకాలర్ డేటా డేటా సెల్లింగ్ పర్సనల్ డాటా డార్క్ వెబ్ కంపెనీ