దొంగిలించిన వాహ‌నాల‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్ముతున్న విధానం ఇదే.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

ఓఎల్ఎక్స్.. పాత సామానులు అమ్మే లేదా కొనే ఆన్‌లైన్ షాప్‌.. దీనిలో మ‌న‌కు కావాల్సిన అన్ని ర‌కాల వ‌స్తువులూ దొర‌కుతాయి.  అయితే వాటిలో మోసం లేదా? అమ్మేవాళ్ల‌కు సంబంధించిన‌వేనే అనే అనుమానం అంద‌రికి వ‌స్తుంది. కానీ ఆ అనుమానం చాలా వ‌ర‌కు నిజ‌మే. ముఖ్యంగా వాహ‌నాలు కొనే వాళ్లు క‌చ్చితంగా అనుమానించాల్సిన విష‌య‌మిది. ఎందుకంటే ఎక్కువ‌శాతం దొంగిలించిన వాహ‌నాల‌ను ఇలా ఓఎల్ ఎక్స్‌లో అమ్మేస్తున్నార‌ట‌. మ‌రి అలాంటి వాహ‌నాల‌ను ఎలా అమ్ముతున్నారో చూద్దామా..

సుల‌భంగా మోసం
ఇటీవ‌ల ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఓఎల్ ఎక్స్ భారీ ఫ్రాడ్ జ‌రిగింది. న‌కిలీ ఆధార్ కార్డ్స్, డాక్యుమెంట్లు సృష్టించి ఈ సైట్లో వాహ‌నాల‌ను అమ్మేశారు. పోలీసులు ఆల‌స్యంగా ఈ మోసాన్ని క‌నుగొన్నారు. అప్ప‌టికే చాలామంది ఈ మోసంలో ప‌డిపోయారు. ఓఎల్ ఎక్స్‌లో ఎలాంటి క్రాస్ చెకింగ్స్ లేక‌పోవ‌డంతో మోస‌గాళ్ల‌కు ఇది అడ్డాగా మారింది. ఏదో ఒక వాహ‌నం పెట్టేయ‌డం దాన్ని త‌క్కువ రేటుకు చూప‌డం ద్వారా వినియోగ‌దారులను ఆక‌ర్షించిన మోస‌గాళ్లు.. బేరం రాగానే న‌కిలీ డాక్యుమెంట్ల సాయంతో వీటిని అమ్మేసేవాళ్లు. అయితే అస‌లు వాహ‌న దారులు పోలీస్ కంప్లైట్స్ ఇవ్వ‌డం ఈ వాహ‌నాల‌పై అనుమానం క‌లిగి ఆరా తీస్తే కొనుక్కున్న‌వాళ్ల‌కు తాము మోసపోయామ‌ని అర్ధం అవుతుంది. ఇందుకోసం పోలీసులు ఓఎల్ ఎక్స్ సంస్థ‌కు నోటీసులు కూడా జారీ చేశారు. 

ఇలాంటి కేసులెన్నో..
1. 2019 మేలో పుణెలో ఒక పెద్దావిడ రూ.450000 వేలు న‌ష్ట‌పోయింది. తాను కొనుగోలు చేసింది ఒక వ‌స్తువైతే ఈ సైట్ ఇంకో వ‌స్తువు పంపింద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. క‌స్ట‌మ‌ర్‌కేర్‌కు కాల్ చేసిన రెస్పాన్స్ లేద‌ని ఆరోపించింది. తాము పంపిన డ‌బ్బు ఓఎల్ ఎక్స్‌కు కాక ప‌శ్చిమ బెంగాల్‌,  గుజ‌రాత్‌కు సంబంధించిన ఒక అకౌంట్‌కు వెళ్లిన‌ట్లు తెలిసింది.

2. 2019 మేలోనే ఒకాయ‌న రూ.1 ల‌క్ష కోల్పోయాడు. ఈ సైట్లో రౌండ్ ట్రిప్ ఎయిర్ టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆయ‌న‌కు ఒక కాల్ వ‌చ్చింది. బ్యాగేజ్ వివ‌రాలు మెన్ష‌న్ చేయ‌లేదంటూ కాల్ వ‌చ్చింది. బుకింగ్ వివ‌రాలు, బ్యాంక్ వివ‌రాలు చెప్పాల‌ని అడిగారు. వ‌ర్క్ ప‌ర్ప‌స్ అనే యాప్ డౌన్‌లోడ్ చేయాల‌ని కోరారు. అలాగే చేయ‌గా.. స‌ద‌రు వ్య‌క్తి అకౌంట్ నుంచి 10 వేల రూపాయిలు ఆరుసార్లు డ్రా చేసి ఉడాయించారు.

Fraudsters selling stolen vehicles OLX fake Aadhaar cards