డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్లు వచ్చాక డబ్బులు చేత్తో పట్టుకెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కార్డ్ స్వైప్ చేసి కావాల్సింది కొనుక్కోవడం ఎంత సులువు.. వాటిని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడమూ అంతే సులువుగా మారిపోయింది. అందుకే ఏ టీవీ, పేపర్ చూసినా.. ఏ న్యూస్, టెక్నాలజీ వెబ్సైట్ చూసినా ఆన్లైన్ ఫ్రాడ్ న్యూస్ కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్గా దేశ రాజధానికి సమీపంలోని నోయిడాలో ఓ మహిళ బిజినెస్ పని మీద ప్యారిస్ వెళ్లారు. అక్కడ మెట్రోలో ప్రయాణిస్తుండగా ఆమె హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులు ఎవరో కొట్టేశారు. అది ఆమె తెలుసుకునేలోపు దాని ద్వారా ఏకంగా లక్షా యాభై వేల రూపాయల ట్రాన్సాక్షన్ చేసిపారేశారు.
ఇదీ ఫ్రాడ్
నోయిడాకు చెందిన నేహా చంద్ర ఒక కంపెనీలో పీఆర్ ఎగ్జిక్యూటివ్. బిజినెస్ పనిమీద ప్యారిస్ వెళ్లి అక్కడ మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఆమె కార్డులు ఎవరో కొట్టేశారు. దాని ద్వారా 52,500.. 44,545... 52,450 చొప్పున మొత్తం మూడు ట్రాన్సాక్షన్లు క్షణాల్లో చేసేశారు. ప్యారిస్లోని అషాంతి అనే వ్యాపారి వద్ద ఈ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు మొబైల్కు మెసేజ్లు వచ్చాక నేహాకు విషయం తెలిసింది.
ఎలా జరిగింది?
ఇండియాలో ఇష్యూ అయిన డెబిట్, క్రెడిట్ కార్డులను మనం విదేశాల్లో వాడుకోవాలంటే బ్యాంక్కు సమాచారమివ్వాలి. ఆ తర్వాత కొంత లిమిట్ వరకు ఓటీపీ అక్కర్లేకుండానే వాటితో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇది తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు నేహా కార్డు కొట్టేశారు. కార్డ్ నెంబర్, సీవీవీ నెంబర్ ఉపయోగించి పిన్ నెంబర్ రీసెట్ చేశారు. ఎలాగూ ఓటీపీ అవసరం లేదు కాబట్టి ఆ కార్డుతో మూడు ట్రాన్సాక్షన్ల ద్వారా 1.55 లక్షలు కొట్టేశారు.
మరి ఇప్పుడేం చేశారు?
ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇలాంటివి జరిగినప్పుడు 12 గంటల్లోగా బ్యాంకుకు కంప్లయింట్ చేయాలి. ఇందుకోసం ప్యారిస్లో కేస్ పెట్టి ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ ఫ్రెంచ్లో ఉందని ఇంగ్లీష్లో కావాలని బ్యాంక్ అడుగుతోందని నేహా అసంతృప్తిగా చెప్పారు. దీనికి 8వేలు ఖర్చయిందన్నారు. పోయిన తన డబ్బును రికవరీ చేయలేదని, మళ్లీ ఇంకా తనతో ఖర్చు పెట్టిస్తున్నారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై ఫైర్ అవుతున్నారు.
సైబ‌రౠకà±à°°à±ˆà°®à±â€Œ à°ªà±à°¯à°¾à°°à°¿à°¸à± మెటà±à°°à±‹à°²à±‹ చోరీ నోయిడా మ‌హిళ‌ హెచà±â€Œà°¡à±€à°Žà°«à±â€Œà°¸à±€ కారà±à°¡à± à°¨à±à°‚à°šà°¿ రూ.1.50 ల‌కà±à°·â€Œà°²à± చోరీ