బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

గ్లోబల్ వైడ్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

ఓఎంజీ కేబుల్‌గా పిలవబడే ఆపిల్‌ యూఎస్‌బీ లైటెనింగ్‌ కేబుల్‌ సాధారణ చార్జింగ్‌ కేబుల్‌లానే కనిపించిన్నప్పటికీ దాంతో..ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్‌ చేశారనుకోండి..అది వెంటనే వైఫై రేంజ్‌లో మీకు తెలియకుండానే మీ డివైస్‌లోని హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగలుగుతాయని సదరు హ్యాకర్‌ వివరించారు. ఈ చార్జింగ్‌ కేబుల్‌లో ఉండే కమాండ్స్‌, స్కిప్ట్స్‌, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ హ్యాకర్‌ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడని తెలిపారు.

ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్‌ చేశారంటే అటాకర్‌ ఆటోమెటిక్‌గా మీ కంప్యూటర్‌ను లాగాఫ్ చేయడం ఆ తర్వాత మీరు ఎంటర్‌ చేసే పాస్ వర్డ్‌ను కూడా తెలుసుకునే అవకాశం ఉందంటున్నాడు. అయితే, సదరు హ్యాకర్‌ చేస్తున్న ఆరోపణలపై ఆపిల్‌ సంస్థ ఇంకా  అధికారికంగా స్పందించలేదు. 

సైబర్‌ నేరాలు సైబర్‌ నేరగాళ్లు హ్యాకర్‌ ఆపిల్ యూఎస్‌బీ కేబుల్‌ ఛార్జింగ్ కేబుల్ కంప్యూటర్‌