సైబర్ నేరగాళ్ల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ చీటర్స్ ఉచ్చులోపడి చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది సైబర్ క్రైం ఉచ్చులో బిగుసుపోతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు వారి మాటలను నమ్మి నిండామునుగుతున్నారు. ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. యాప్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారానే సాగిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డిజిటల్ షాడోస్...ఒక కొత్త కుంభకోణాన్ని బయటపెట్టింది. సెక్స్ కి బానిసయిన వారిని టార్గెట్ చేస్తూ వారికి గాలం వేస్తున్నారు. ఈ క్రిమినెల్స్ ప్రధానంగా లింక్డ్ ఇన్ అకౌంట్ల ద్వారా తమ పనిని సాగిస్తున్నారు. అందులో ముఖ్యమైన అకౌంట్లను సెలక్ట్ చేసుకుని వారికి గాలం వేస్తున్నారు. డేంజర్ సైబర్ క్రైం గురించి పది నిజాలు మీకోసం....
* సెక్స్ కి బానిసయిన వారిని టార్గెట్ చేస్తూ వారికి గాలం వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వారి వీక్ నెస్ ని పసిగట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
*వారి ప్రొఫైల్ పాస్ వర్డ్ లను తెలుసుకుని...వారేం చేస్తున్నారో పసిగడుతున్నారు. మీరు అడల్ట్ కంటెంట్ చూశారు...మా దగ్గర మీ డేటా మొత్తం ఉందంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు.
*ఈ నేరగాళ్లు ప్రధానంగా లింక్డ్ ఇన్ ఖాతాల ద్వారా తమ పనిని ఈజీగా కానిస్తున్నారు. అందులోని ముఖ్యమైన ఖాతాలను ఎంచుకుని వారికి గాలం వేస్తున్నారు.
*పేరు ప్రఖ్యాతలు ఉన్నవారిని...మంచి హోదాలో ఉన్నవారిని కనిపెట్టి మరీ...బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ధనవంతులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బాధితుల్లో డాక్టర్లు, లాయర్లు ఉన్నారు.
* ఇక వీరి ఉచ్చులో చిక్కుకున్న వారిని బిట్ కాయిన్స్ ద్వారా పేమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
*అంతేకాదు...వీరు ఇంకో కొత్త ఎత్తుగడ కూడా వేస్తున్నారు. బ్లాక్ మెయిల్ ఎలా చేయాలన్న ఐడియాలను ఆన్ లైన్లో 10 డాలర్లకు విక్రయిస్తున్నారు.
*ఇలాంటి సైబర్ నేరాలకు ముఖ్యంగా మ్యారేజ్ అయినవారితో పరిచయం పెంచుకుని వారి నుండి అన్ని వివరాలను సేకరిస్తున్నారు. తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.
*వీటన్నింటి కంటే పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే....ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నవారికి భారీ స్థాయిలో జీతాలు కూడా ఇస్తున్నారట. దాదాపు 7.7కోట్లు జీతంగా చెల్లిస్తున్నారట.
*ఇక జులై 2018నుంచి ఫిబ్రవరి 2019వరకు గణాంకాలను పరిశీలించినట్లయితే వీరి భారీన 89వేల మంది పడ్డారట. మంచి హోదాలో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారట. వీరి నుంచి దాదాపుగా లక్షల కోట్లు వసూలు చేశారట.
లింకà±à°¡à± ఇనౠసెకà±à°¸à± టోరేషనà±à°¸à± సైబరౠనేరగాళà±à°²à± linked in sextortions Cyber criminals