పెగాసస్ స్పై వేర్.. ప్రపంచం వ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులకు టెర్రర్ పుట్టిస్తున్న వైరస్ ఇది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 1400 మంది సివిల్ రైట్స్ యాక్టివిస్టులు, లాయర్లు, జర్నలిస్టుల వాట్సప్‌లకు ఈ కొత్త వైరస్ పాకిందని రిపోర్టులు వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక లాయర్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారంట. మరి ఎవరాయన.. ఈ వైరస్ కలిగించిన నష్టం ఏంటి?
అన్నౌన్ ఇంటర్నేషనల్ నంబర్‌తో
బల్ల రవీంద్రనాథ్.. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఆయన. ఒక గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ నుంచి కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. కెనడా బేస్డ్ ల్యాబ్ సాయంతో ఒక సర్వేను నిర్వహిస్తున్నట్లు హ్యాకింగ్ మీద ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఈ మెసేజ్‌ల సారాంశం. కానీ దీన్ని లాయర్ పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయనకు మళ్లీ కొన్ని మెసేజ్ వచ్చాయి. అలాగే కొన్ని వాట్సప్ కాల్స్ కూడా వచ్చాయి. వాటిని కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అఫీషియల్ వాట్సప్ నుంచి ఈ న్యాయవాదికి మీ ఫోన్ హ్యాక్ అయిందనే న్యూస్ వచ్చింది. అప్పటికి కానీ ఆయనకు విషయం అర్ధం కాలేదు.
మేలోనే హెచ్చరించినా..
కొంతమంది బ్యూరోక్రాట్స్, లాయర్లు, జర్నలిస్టులు ఈ మాల్వేర్ బారిన పడే అవకాశం ఉందని ఈ ఏడాది మే నెలలోనే భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సున్నితమైన అంశాలను, రహస్య విషయాలను ఛేదించడం కోసం ఇజ్రాయిల్ కంపెనీ ఈ స్పై వేర్ని తయారు చేసిందని నిపుణులు అంటున్నారు. రవీంద్రనాథ్ మాత్రమే కాదు భారత్‌లో చాలామందికి ఈ కొత్త వైరస్ బారిన పడినా గుర్తించలేని పరిస్థితి ఉంది. ఎలాంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయద్దని.. అనవసరమైన వాటిని ఇగ్నోర్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
WHATSAPP SPYWARE HYDERABAD CIVIL RIGHTS ADVOCATE TARGETED