స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

మీరు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ వాడుతున్నారా, అయితే ఈ అలర్ట్ న్యూస్ మీకోసమే. మీరు మాట్లాడే మాటలను రహస్యంగా వింటున్నారు. ఎవరో తెలుసా.. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్కర్లు.. ఆశ్చర్యపోతున్నారా.. వార్త నిజమే. రహస్యంగా స్కైప్ యూజర్ల ప్రైవేటు కన్వరజేషన్స్ వారు వింటున్నారట. స్కైప్ యాప్ ట్రాన్స్ లేషన్ సర్వీసు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా యూజర్ల ఆడియో కాల్స్ వింటున్నట్టు Motherboard నుంచి ఓ కొత్త రిపోర్టు నివేదించింది.  

స్కైప్ ఆడియో రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, ఇంటర్నల్ డాక్యుమెంట్ల క్యాచీతో పాటు యాప్ యూజర్ల ఇంటిమేషన్ కన్వరజేషన్స్, వారి వ్యక్తిగత విషయాలైన రిలేషన్ షిప్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇతర ప్రైవేట్ చాట్స్ అన్నీ రహస్యంగా వింటున్నట్టు Motherboard వెల్లడించింది.ఒక యూజర్ చాట్ ప్లాట్ ఫాంలో ట్రాన్స్ లేట్ చేసుకోవాలనుకునే ఆడియో ఫోన్ కాల్స్ కంపెనీ విశ్లేషిస్తుందని, కానీ ఇలాంటి చాట్స్ ను విశ్లేషించేది మనుషులా లేక మిషన్లా అనేది వెల్లడించలేదని మైక్రోసాఫ్ట్ సొంత యాప్ స్కైప్ వెబ్ సైట్ తెలిపింది. 

కాగా 2015లో స్కైప్ ఈ ట్రాన్స్ లేటర్ సర్వీసును లాంచ్ చేసింది. ఈ సర్వీసు ద్వారా ఒక ఫోన్ లేదా ఒక వీడియో కాల్ చేసే సమయంలో రియల్ టైం ఆడియో ట్రాన్స్ లేషన్స్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. స్కైప్ యూజర్ల కన్వరేషన్స్ కలెక్ట్ చేసి మైక్రోసాఫ్ట్ ప్రొడక్టులు, సర్వీసులను ఇంప్రూవ్ చేసేందుకు సాయపడుతుంది. ట్రాన్స్ లేషన్స్, స్పీచ్ రికగ్ననైజేషన్ టెక్నాలజీ ద్వారా వ్యాఖ్యాలు, ఆటోమాటిక్ ట్రాన్స్ స్ర్కిప్టులను విశ్లేషిస్తుంది.

స్కైప్ ట్రాన్స్ లేషన్ సిస్టమ్ ద్వారా వర్కర్లు ఈజీగా యూజర్ల వాయిస్ కాల్స్ వింటున్నట్టు గుర్తించినట్టు మదర్ బోర్డు పేర్కొంది. అంతేకాదు కంపెనీ వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ Cortana ద్వారా యూజర్ల వాయిస్ వింటున్నట్టు తెలిపింది. యూజర్ల కన్వరజేషన్స్ రికార్డు చేసే కంపెనీల్లో సిలికాన్ వ్యాలీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఒకటి మాత్రమే కాదు మరెన్నో ఉన్నాయి. 2019 ఏప్రిల్ నెలలో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా కొన్ని సార్లు యూజర్ల ప్రైవేటు కన్వరజేషన్స్ వింటున్నట్టు రివీల్ అయింది. జూలైలో గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ Siri కూడా యూజర్లు వాయిస్ సీక్రెట్ గా వింటున్నట్టు తేలింది. ఆ తర్వాత గూగుల్, ఆపిల్ తమ సర్వీసుల్లో హ్యుమన్ ట్రాన్స్ క్రైబర్ల వాడకాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు సంయుక్తంగా ప్రకటించాయి.

న్యూస్ టెక్నాలజీ స్కైప్ మైక్రోసాఫ్ట్ స్కైప్ యూజర్లు స్కైప్ వెబ్ సైట్ మదర్ బోర్డు