ఇకపై అభ్యంతరకరమైన వాట్సాప్ మెసేజ్ లపై డాట్ కి ఇలా కంప్లేయింట్ ఇవ్వొచ్చు

వాట్సాప్ ద్వారా వేధింపులకు గురవౌతున్న బాధితులుకు ఇది ఊరటను కల్పించే వార్త. వాట్సాప్ లో ఎవరైన అభ్యంతరకరమైన మేసేజ్ పంపించినట్లయితే..వారిపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (డాట్). అసభ్య పదజాలంతో, అశ్లీల ఫోటోలతో ఎవరైనా మెసేజ్ లు షేర్ చేసినట్లయితే...వారికి చెక్ పెట్టేలా ఆదేశాలు జారి చేసింది డాట్. మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీ వాట్సాప్ కు వచ్చిన అసభ్య మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి డాట్ ఫిర్యాదు చేయడమే. 

మీ వాట్సాప్ కు మెసేజ్ చేసిన వ్యక్తి మొబైల్ నెంబర్ తో పాటు అభ్యంతరకర మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి ccaddn-dot@nic.inకు ఈ మెయిల్ పంపండి అంటూ డాట్ ఒక ప్రకటనలో వాట్సాప్ వినియోగదారులకు సూచించింది. జస్ట్ మీరు కంప్లెయింట్ చేస్తే చాలు...మిగతాదంతా డాట్ చూసుకుంటుంది. 
టెలికాం ఆపరేటర్లు, పోలీసుల సాయంతో....బెదిరింపులకు దిగుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాట్ కంట్రోలర్ కమ్యూనికేషన్ అధికారి ఆశిష్ జోషి ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు తమ వాట్సాప్ అకౌంట్ కు..గుర్తుతెలియని వ్యక్తుల నుంచి  అభ్యంతరకరమైన మెసేజ్ లు, బెదిరింపులతో మెసేజ్ లు పంపిస్తున్నట్లు డాట్ దృష్టికి వచ్చింది. దీంతో బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డాట్ ఆదేశాలు జారీ చేసింది. 

వాట్సాప్ నెట్ వర్క్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘిస్తే...కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఈ హెచ్చరికలను అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు సూచించింది. ఈ తరహా మెసేజ్ లను పంపిస్తున్న తమ కస్టమర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించింది. 

వాట్సాప్ మెసేజ్ కంప్లేయింట్ బెదిరింపులు డాట్. WhatsApp messages DoT complaint