బ్రాండ్లు, కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుని రివ్యూలు చేస్తున్నవారిని, ఫ్రీగా రివ్యూలు చేస్తున్న వారిని ఎలా గుర్తించాలి? డబ్బులు తీసుకుని అది వెల్లడించని రివ్యూయర్లపై చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే అంశాలపై వరుసగా ఆర్టికల్స్ ఇస్తున్నాం కదా! ఇందులో భాగంగా పెయిడ్ రివ్యూయర్లకు ఇతర దేశాల్లో అంటే అమెరికా, ఈయూ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎలాంటి చట్టపరమైన రూల్స్ ఉన్నాయి, అలాగే మనదేశంలో ఎలాంటి విధివిధానాలు ఉన్నాయనే విషయం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం!
అమెరికాలో కఠిన నిబంధనలు
అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సరికొత్త కన్స్యూమర్ రివ్యూస్ రూల్ అత్యంత కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అవేంటంటే..
తప్పనిసరిగా ప్రకటన: డబ్బు, ఉచిత గిఫ్ట్ కార్డ్‌లు, లేదా డిస్కౌంట్లు తీసుకుంటే.. రివ్యూయర్లు ఆ విషయాన్ని Sponsored, Incentivized, లేదా Paid Ad అని స్పష్టంగా, వినియోగదారునికి కనిపించేలా తప్పనిసరిగా చూపాలి.
కండిషనల్ రివార్డ్స్ నిషేధం: మాకు 5-స్టార్ రేటింగ్ ఇస్తేనే రివార్డ్ ఇస్తాము- అని షరతు పెట్టడం చట్టవిరుద్ధం. రివ్యూల కోసం ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు, కానీ అది పాజిటివ్ రివ్యూలకే అయి ఉండకూడదు. నెగటివ్ రివ్యూ ఇచ్చినా రివార్డ్ ఇవ్వాల్సిందే.
ఇన్సైడర్ రివ్యూల బ్యాన్: కంపెనీ అధికారులు, ఉద్యోగులు, లేదా వారి తక్షణ బంధువులు తాము ఆ కంపెనీకి చెందినవారమనే నిజాన్ని దాచిపెట్టి, సాధారణ వినియోగదారుల్లా పాజిటివ్ రివ్యూలు రాయడం నేరం.
ఫేక్ ఎంగేజ్మెంట్: ప్రొడక్ట్ లేదా సర్వీస్ నమ్మకత్వాన్ని పెంచడానికి బోట్స్ (Bots) లేదా ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్, వ్యూస్ కొనుగోలు చేయడం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.
భారీ సివిల్ జరిమానాలు: ఒక్కో ఉల్లంఘనకు (ప్రతి ఒక్క ఫేక్ రివ్యూకు లేదా అది రీచ్ అయిన విధానాన్ని బట్టి) గరిష్టంగా $53,088 (సుమారు ₹44 లక్షలు) వరకు సివిల్ పెనాల్టీ విధించే అధికారం FTCకి ఉంది.
బ్రిటన్‌లో DMCC యాక్ట్
బ్రిటన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టం వినియోగదారుల హక్కులకు మరియు డిజిటల్ మార్కెట్ పారదర్శకతకు పెద్ద పీట వేసింది.
పెయిడ్‌ను ఫ్రీగా చూపడం నిషేధం: ప్రయోజనాలు పొంది రాసే రివ్యూలను సాధారణ ఆర్గానిక్ రివ్యూలుగా చలామణి చేయడం పూర్తిగా నిషేధించారు.
నెగటివ్ రివ్యూల మేనేజ్మెంట్: కంపెనీలు తమ వెబ్సైట్లలో కేవలం పాజిటివ్ రివ్యూలను మాత్రమే ఉంచి, జెన్యూన్ కస్టమర్లు రాసిన నెగటివ్ రివ్యూలను డిలీట్ చేయడం లేదా దాచడం తీవ్రమైన నేరం.
టర్నోవర్‌పై భారీ జరిమానాలు: ఈ నిబంధనలను ఉల్లంఘించే పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారి గ్లోబల్ టర్నోవర్‌లో 10% వరకు లేదా గరిష్టంగా £300,000 యూరో (సుమారు ₹3.3 కోట్లు)ల వరకు జరిమానా విధించే చట్టపరమైన అధికారం బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) కి ఉంది.
ఈయూలో- ఒమ్నిబస్ డైరెక్టివ్
ఐరోపా సమాఖ్యలోని దేశాలన్నీ -ఒమ్నిబస్ డైరెక్టివ్- కింద కఠినమైన సాంకేతిక నిబంధనలను అమలు చేస్తున్నాయి.
వెరిఫికేషన్ విధానం బహిర్గతం: ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తన ప్లాట్‌ఫామ్‌పై రివ్యూలను చూపిస్తుంటే, ఆ రివ్యూలు రాసినవారు నిజంగానే ఆ వస్తువును కొన్నారు అని నిర్ధారించుకోవడానికి తాము ఎలాంటి చర్యలు (Verified Purchase చెకింగ్, ఆర్డర్ ఐడీ ధృవీకరణ) తీసుకుంటున్నామో కస్టమర్లకు స్పష్టంగా వివరించాలి.
సొంత రివ్యూ వెబ్సైట్ల నిషేధం: ఒక బ్రాండ్ లేదా కంపెనీ తనకు తానుగా ఒక స్వతంత్ర రివ్యూ వెబ్‌సైట్‌ను సృష్టించి, అది థర్డ్-పార్టీ సైట్ లాగా నమ్మిస్తూ తన సొంత ప్రొడక్టులకు రేటింగ్‌లు ఇచ్చుకోవడం నిషేధం.
సాంకేతిక నిఘా: ఫ్రాన్స్ వంటి దేశాల ప్రభుత్వాలు Polygraphe అనే అధునాతన అల్గారిథమ్ టూల్‌ను వాడుతు న్నాయి. ఇది రివ్యూల భాషా శైలి, పోస్టింగ్ టైమింగ్స్, ఐపీ అడ్రస్‌లను విశ్లేషించి పెయిడ్ నెట్‌వర్క్‌ను గుర్తిస్తుంది.
నెదర్లాండ్స్ 8.2కోట్ల జరిమానా: నెదర్లాండ్స్ కన్స్యూమర్ అథారిటీ (ACM) ఫేక్ రివ్యూలు అమ్మే ఏజెన్సీలపై ఒక్కో ఉల్లంఘనకు గరిష్టంగా €900,000 (సుమారు ₹8.2 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధిస్తోంది.
వెబ్సైట్ల బాధ్యత: అన్‌ఫెయిర్ కమర్షియల్ ప్రాక్టీసెస్ డైరెక్టివ్ నిబంధనల ప్రకారం ఇ-కామర్స్ సైట్లలో వచ్చే రివ్యూలు నిజమైన కొనుగోలుదారులు రాసినవేనా కాదా అని సరిచూడ్డానికి కఠిన నిబంధనలు చేపట్టాలి.
భ్రమ కలిగించే రేటింగ్‌లు: పెయిడ్ రివ్యూల ద్వారా ప్రొడక్ట్ స్టార్ రేటింగ్‌ను కృత్రిమంగా పెంచడం వినియోగ దారులను మోసం చేయడమే అవుతుంది, దీనిపై అక్కడి దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయి.
ఆస్ట్రేలియాలో ఏసీసీసీ
ప్రతిఫలం పారదర్శకం: ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ACCC) నిబంధనల ప్రకారం, వ్యాపారాలు తప్పుడు రివ్యూలను రాయడానికి ఎవరికైనా డబ్బులు చెల్లించడం లేదా ప్రోత్సహించడం చట్ట విరుద్ధం. ఒకవేళ రివ్యూలకు ప్రతిఫలం ఇస్తే, ఆ విషయాన్ని పారదర్శకంగా ప్రకటించాలి.
గూగుల్, అమెజాన్ సొంత పాలసీలు
ప్రభుత్వాల చట్టాల కంటే గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌ల పారదర్శకత కోసం లీగల్ చర్యలు తీసుకుంటున్నాయి.
గూగుల్ బిజినెస్ రూల్స్: Google Reviews Policy ప్రకారం... అసలు ఎలాంటి షరతులు లేకుండా రివ్యూ కోసం కస్టమర్‌కు చిన్న చాక్లెట్ లేదా కూపన్ ఆఫర్ చేసినా అది చట్టవిరుద్ధం.
మిలియన్ డాలర్ల సివిల్ దావాలు: అమెజాన్ మరియు గూగుల్ సంస్థలు కేవలం రివ్యూలను డిలీట్ చేయడమేగాక, అంతర్జాతీయంగా ఫేక్ రివ్యూలు అమ్మే బ్రోకర్ ఏజెన్సీలపై కోర్టులలో మిలియన్ డాలర్ల నష్టపరిహార దావాలు వేసి వారి నెట్‌వర్క్‌లను క్లోజ్ చేయిస్తున్నాయి.
మరి మనదేశంలో.. IS 19000:2022
మనదేశంలో వినియోగదారుల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ - IS 19000:2022 పేరిట ప్రత్యేక గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది.
ప్లాట్‌ఫామ్ బాధ్యత: జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మేక్మైట్రిప్ వంటి భారతీయ ప్లాట్‌ఫామ్‌లు ఫేక్ రివ్యూలను గుర్తించడానికి మరియు నిరోధించడానికి పటిష్టమైన అల్గారిథమ్స్ వాడటం తప్పనిసరి.
రివ్యూ అడ్మినిస్ట్రేటర్: ప్రతి కంపెనీ ఒక 'రివ్యూ అడ్మినిస్ట్రేటర్'ను నియమించాలి. వీరు ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రివ్యూల పారదర్శకతను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్-2019: భారతదేశంలో ఫేక్ లేదా పెయిడ్ రివ్యూల ద్వారా కస్టమర్లను మోసం చేస్తే అది అక్రమ వ్యాపార పద్ధతి కిందకు వస్తుంది. దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కి కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు, సదరు కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తారు.
అసలు ఎందుకీ చట్టాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల రక్షణ సంస్థలు మరియు ప్రభుత్వాలు ఈ నిబంధనలను ఇంత పట్టుదలగా అమలు చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి.
వినియోగదారుల నమ్మకాన్ని కాపాడటం: ఆన్లైన్ రేటింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోతే మొత్తం ఇ-కామర్స్ (e-Commerce) ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యత.
ఫేక్ రివ్యూల పరిశ్రమ: టెలిగ్రామ్, వాట్సాప్, డార్క్ వెబ్ వేదికగా రివ్యూ బ్రోకర్లు ఒక బ్లాక్ మార్కెట్ నడుపుతున్నా రు. కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని, నకిలీ అకౌంట్ల ద్వారా రాత్రికి రాత్రే రేటింగ్స్‌ను మార్చేస్తున్నారు.
అక్రమ పోటీని అరికట్టడం: నిజాయితీగా, నాణ్యమైన ప్రొడక్ట్స్ అందించే చిన్న వ్యాపారులు ఈ పెయిడ్ రివ్యూల వల్ల నష్టపోతున్నారు. డబ్బున్న కంపెనీలు ఫేక్ రివ్యూలను కొనుగోలు చేసి మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇది 'యాంటీ-ట్రస్ట్' (Antitrust) నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.
ఏ.ఐ. దుర్వినియోగం: జనరేటివ్ AI టూల్స్ అందుబాటులోకి వచ్చాక, మనుషులు రాసినట్లుగానే ఉండే వేలాది రివ్యూలను నిమిషాల్లో సృష్టిస్తున్నాయి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి కొత్త నియమాలు వచ్చాయి.
ఆరోగ్యం మరియు భద్రత: కాస్మెటిక్స్, మెడికల్ సప్లిమెంట్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో ఫేక్ రివ్యూలు చూసి కొనుగోలు చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతోంది.
అంతర్జాతీయంగా మారుతున్న చట్టాల ప్రకారం - పెయిడ్ రివ్యూలు రాయడం లేదా రాయించడం- అనేది కేవలం ఒక చిన్న ట్రిక్ కాదు, అది చట్టప్రకారం తీవ్రమైన ఆర్థిక నేరం (Financial Fraud). పారదర్శకత లేని ప్రతి రివ్యూ వ్యాపారాల మనుగడకే ముప్పుగా మారుతోంది.
Legal rules for paid reviewers International laws on fake reviews FTC final rule fake reviews Paid review regulations globally EU Omnibus Directive online reviews EU Omnibus Directive fake reviews enforcement UK DMCC act product reviews Penalties for buying fake reviews Deceptive marketing laws 2026 Influencer disclosure guidelines Is paying for reviews illegal