డబ్బులు తీసుకుని రివ్యూలు ఇస్తూ అది వెల్లడించని ఇన్ల్ఫూయ‌న్స‌ర్ల‌పై చట్టం ఏం చర్యలు తీసుకుంటుంది?

మనం సోషల్ మీడియాలో చూసే ప్రతి రివ్యూ నిజమేనా? మనకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఒక ప్రొడక్ట్ బాగుందని చెబితే కళ్ళు మూసుకుని నమ్మేస్తున్నామా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మీరు నమ్మే ఆ రివ్యూల వెనుక బ్రాండ్లతో కుదుర్చుకున్న‌ రహస్య (ఉచిత బ‌హుమ‌తులు, హోట‌ల్ స్టే మొద‌లైన‌వి), పెయిడ్ ఒప్పందాలు ఉండవచ్చు. ఇలా పెయిడ్ పార్ట్‌నర్‌షిప్ అనే విషయాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కొంత‌మంది ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్ల‌ ఆట కట్టించడానికి భారత ప్రభుత్వం కఠినమైన చట్టపరమైన అస్త్రాలు సిద్ధం చేసింది. ఎన్న‌డూ లేని విధంగా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ల‌పై ఈ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కార‌ణాలేంటో ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం!

ASCI Rules ఏం చెబుతున్నాయి
అడ్వ‌ర్టైజింగ్ స్టాండ‌ర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) నిబంధనల ప్రకారం.. కేవలం ఒక చిన్న క్యాప్షన్ కింద పెయిడ్ పార్ట్‌న‌ర్‌షిప్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తే సరిపోదు. వీడియో రకాన్ని బట్టి స్పష్టమైన రూల్స్ ఉన్నాయి:
నిడివి బ‌ట్టి ట్యాగ్ డిస్ల్పే టైమ్‌
15 సెకన్లు లేదా త‌క్కువ వీడియోల‌కు: కనీసం 3 సెకన్ల పాటు స్క్రీన్‌పై 'Paid Partnership' లేదా 'Ad' అనే ట్యాగ్ స్పష్టంగా కనిపించాలి.
15 సెకన్ల నుంచి 2 నిమిషాలలోపు: వీడియో మొత్తం నిడివిలో కనీసం 1/3 వంతు సమయం ఆ ట్యాగ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవ్వాలి.
2 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే: బ్రాండ్ గురించి మాట్లాడే లేదా ప్రొడక్ట్ ఫీచర్స్ చూపించే మొత్తం సమయం (Entire Duration) ఆ లేబుల్ స్క్రీన్‌పై ఉండాలి.
లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు: లైవ్ మొదట్లో మరియు ముగింపులో ప్రమోషన్ అని నోటితో స్పష్టంగా ప్రకటించడంతో పాటు లైవ్ స్క్రీన్‌పై టెక్స్ట్‌ను నిరంతరం డిస్‌ప్లే చేయాలి.


మెటీరియల్ కనెక్షన్స్‌ బ‌య‌ట పెట్టాల్సిందే
చాలా మంది "మేము బ్రాండ్ దగ్గర క్యాష్ తీసుకోలేదు, కేవలం గిఫ్ట్ మాత్రమే పంపారు" అని చెబుతుంటారు. కానీ చట్టం ప్రకారం "మెటీరియల్ కనెక్షన్" (Material Connection) ఉన్న ప్రతిదీ పెయిడ్ ప్రమోషన్‌లోకే వస్తుంది.
- కంపెనీలు పంపే ఫ్రీ ప్రొడక్ట్స్ (Barter/Gifting).
- ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ఇచ్చే ఉచిత హోటల్ స్టేలు లేదా ట్రావెల్ టికెట్లు.
- బ్రాండ్లలో ఉండే బంధుత్వాలు (ఉదాహరణకు సదరు కంపెనీ ఓనర్.. ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ బంధువు లేదా స్నేహితుడు కావడం).
- అఫిలియేట్ లింక్స్ ద్వారా వచ్చే కమిషన్లు ఇవ‌న్నీ ఈ మెటీరియ‌ల్ క‌లెక్ష‌న్‌లోకే వ‌స్తాయి.

ఇద్ద‌రిపైనా చర్య‌లు త‌ప్ప‌వు: ఒక ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ ప్రమోషన్ ట్యాగ్ పెట్టకుండా మోసం చేస్తే చ‌ట్ట‌ప్ర‌కారం ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌తో పాటు స‌ద‌రు బ్రాండ్ లేదా కంపెనీపైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వు
డిస్ల్కోజ‌ర్ రూల్స్ త‌ప్ప‌నిస‌రి: కంటెంట్ లైవ్ వెళ్లే ముందే అందులో డిస్ల్కోజ‌ర్‌ రూల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన కనీస బాధ్యత బ్రాండ్‌కు ఉంటుంది.
నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే జ‌రిమానా: ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీలపై కూడా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) భారీ జరిమానాలు విధిస్తుంది.

ఏఐ ఇన్‌ఫ్లూయెన్స‌ర్స్‌కూ సేమ్ రూల్స్‌: ప్రస్తుతం కంప్యూటర్ జనరేటెడ్ లేదా AI క్రియేటెడ్ డిజిటల్ అవతార్స్ (Virtual Influencers) కూడా సోషల్ మీడియాలో బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాయి. వారు కూడా అది పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ అని చూపించాలి.
ఆ విష‌యం స్ఫష్టంగా చెప్పాలి: తాము నిజమైన మనుషులం కాదని, "AI Generated" లేదా "Virtual Character" అనే విషయాన్ని కూడా ప్రేక్షకులకు స్పష్టంగా తెలియజేయాలి.

సుమోటోగా తీసుకుని నోటీసులు: నిబంధనలు ఉల్లంఘిస్తూ ట్యాగ్‌లు లేకుండా పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నట్లు గుర్తిస్తే, ఎవరి ఫిర్యాదుతో సంబంధం లేకుండానే CCPA (Central Consumer Protection Authority) ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, బ్రాండ్లకు సుమోటో (Suo Motu)గా నోటీసులు జారీ చేస్తోంది.
కామెంట్లు డిలీట్ చేయకూడ‌దు బాస్: ఒక ప్రొడక్ట్ బాగాలేదని లేదా అది పెయిడ్ ప్రమోషన్ అని ఎవరైనా యూజర్ కామెంట్ సెక్షన్ లో నిజాలు రాస్తే, వాటిని డిలీట్ చేయడాన్ని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు.
ఈ-కామ‌ర్స్ గైడ్‌లైన్స్ ఏం చెబుతున్నాయి: కస్టమర్ల నెగెటివ్ రివ్యూలను లేదా రేటింగ్‌లను ఉద్దేశపూర్వకంగా దాచడం, డిలీట్ చేయడం లేదా ఫేక్ పాజిటివ్ కామెంట్లు పెట్టించడం (Review Manipulation) వంటి పద్ధతులకు పాల్పడితే ఈ-కామర్స్ గైడ్‌లైన్స్ కింద భారీ జరిమానాలు విధిస్తారు.
ప్ర‌క‌ట‌న ఏ భాష‌లోనో.. ట్యాగ్ అదే భాష‌లో..: ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు తమ పోస్ట్ లేదా వీడియో ఏ భాషలో చేస్తున్నారో, ఆ ప్రకటన (Disclosure) ట్యాగ్ కూడా అదే భాషలో ఉండాలి. ఇది ఇంగ్లీష్ రాని సాధారణ ప్రజలు మోసపోకుండా కాపాడటానికి తెచ్చిన రూల్.
విదేశాల్లోని ఇన్‌ఫ్లూయెన్స‌ర్ల‌కీ రూల్స్: దుబాయ్, అమెరికా లేదా ఇతర దేశాలలో ఉన్న ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు కూడా భారతీయ వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) పూర్తిగా వర్తిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారతదేశంలో వారిపై లీగల్ చర్యలు తీసుకుంటారు.


వినియోగ‌దారుల ర‌క్ష‌ణ‌ చట్టాలేం చెబుతున్నాయి
కేంద్ర వినియోగదారుల రక్షణ శాఖ (Department of Consumer Affairs) విడుదల చేసిన “ఎండార్స్‌మెంట్స్ నో-హౌస్!” (Endorsements Know-hows!) మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 (Consumer Protection Act, 2019) పరిధిలో కింది చర్యలు ఉంటాయి.
భారీ జరిమానాలు: నిబంధనలను ఉల్లంఘించి పెయిడ్ పార్ట్‌నర్‌షిప్ అని వెల్లడించకుండా తప్పుదోవ పట్టించే ప్రకటనలు లేదా రివ్యూలు ఇస్తే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ జరిమానాలు విధిస్తుంది.
మొదటిసారి తప్పు చేస్తే: సదరు ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్‌కు గరిష్టంగా ₹10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
మళ్లీ చేస్తే: గరిష్టంగా ₹50 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లపై నిషేధం: నిబంధనలు పాటించని ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్లు భవిష్యత్తులో ఎలాంటి ఉత్పత్తులను లేదా సేవలను ప్రమోట్ చేయకుండా 1 నుంచి మూడేళ్ల‌ వరకు నిషేధం (Ban) విధించ‌చ్చు.
సోషల్ మీడియా ఖాతాల సస్పెన్షన్: తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి పదే పదే తప్పులు చేసే ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్ల సోషల్ మీడియా ఖాతాలను 6 నెలల నుంచి రెండేళ్ల వరకు సస్పెండ్ చేయాల్సిందిగా ఆ ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వం ఆదేశించవచ్చు.
ఐదేళ్లు జైలు శిక్ష: తప్పుదోవ పట్టించే ప్రకటనల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతే, కోర్టుల ద్వారా సదరు వ్యక్తులకు లేదా బాధ్యులకు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా చట్టంలో ఉంది.

గ్యాడ్జెట్ రివ్యూల‌కూ పెయిడ్ ట్యాగ్: ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు కొంద‌రు గ్యాడ్జెట్ రివ్యూలు, మొబైల్ రివ్యూలు చేసినందుకు భారీగా డ‌బ్బు తీసుకుంటున్నారు.

ట్యాగ్ వేయ‌క‌పోతే అంతే..: వినియోగదారుల రక్షణ చట్టం, ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, దీనిని ఒక కమర్షియల్ డీల్‌గా పరిగణించాలి. #PaidPartnership లేదా #Sponsored అని వెల్లడించడం చట్టపరంగా తప్పనిసరి, లేకపోతే వారు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పాటించాల్సిన నిబంధ‌న‌లేంటి
స్పష్టంగా ట్యాగ్‌లు క‌నిపించాలి: బ్రాండ్ల నుంచి డబ్బు, గిప్ట్‌లు, ఫ్రీ ట్రిప్స్ లేదా ఎలాంటి ప్రయోజనాలు పొందినా, తమ పోస్ట్‌లు/వీడియోలపై #ad, #sponsored, #paidpartnership, #collaboration వంటి ట్యాగులను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలి.
స్వయంగా వాడి రివ్యూ చెప్పాలి: ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూ ఇచ్చే ముందు ఇన్‌ఫ్యూయ‌న్స‌ర్లు దాన్ని స్వయంగా వాడి ఉండాలి. బ్రాండ్లు ఇచ్చిన తప్పుడు సమాచారం నిజమని నమ్మి చెబితే ఇన్‌ఫ్యూయ‌న్స‌ర్లు పూర్తి బాధ్యత వహించాలి.
ప్ర‌త్యేక స‌ర్టిఫికేష‌న్ త‌ప్ప‌నిస‌రి: ఆరోగ్యం (Health/Nutrition) మరియు ఆర్థిక (Finance) రంగాలకు సంబంధించిన సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు (Finfluencers) తప్పనిసరిగా SEBI లేదా సంబంధిత ప్రభుత్వ సంస్థల గుర్తింపు/సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.


ఎలా కంప్లైంట్ చేయవచ్చు?
ఈ నిబంధనలను పర్యవేక్షించడంలో ప్రభుత్వ సంస్థ అయిన CCPA తో పాటు ASCI (Advertising Standards Council of India) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వినియోగదారులు ఎవరైనా ఇలాంటి తప్పుడు రివ్యూల వల్ల మోసపోతే ఎక్క‌డ ఫిర్యాదు చేయొచ్చంటే..
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH): మీరు 1915 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (CCPA) కి ఫిర్యాదు పంపవచ్చు.
ASCI కి కంప్లైంట్: ASCI ఆఫీషియల్ వెబ్‌సైట్ లోని 'Complaints' సెక్షన్‌కు వెళ్లి సదరు సోషల్ మీడియా పోస్ట్/వీడియో లింక్ మరియు స్క్రీన్‌షాట్‌లతో సులభంగా ఆన్‌లైన్ కంప్లైంట్ నమోదు చేయవచ్చు.

 

influencers review paid influencers influencer influencer legal guide influencer marketing influencer accountability legal action taken influencers Instagram influencers law against paid influencers reviews legal actions paid review ASCI Rules Consumer Protection Act