గుడ్ న్యూస్.. జియో మరియు ఫేస్బుక్ రోజుకు 25 జీబీ చొప్పున 6 నెలలపాటు ఫ్రీగా డేటా ఇవ్వబోతున్నాయి అనే మెసేజ్ గానీ మీ మొబైల్కు వచ్చిందా? అయితే సంబరపడకండి. ఎందుకంటే ఇదంతా ట్రాష్. కొత్త రకం సైబర్ క్రైమ్ చేయడానికి కొంతమంది దీన్ని మీ మొబైల్కు పంపొచ్చు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ నిపుణులు.
జియోలో కొంత వాటాను ఫేస్బుక్ 43వేల కోట్ల రూపాయలకు కొన్నది. దీని ద్వారా ఫేస్బుక్ అనుబంధ యాప్ అయిన వాట్సాప్ ను ఉపయోగించి జియో మార్ట్లో సరుకులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ డీల్ను అడ్డం పెట్టుకుని కొంతమంది మోసగాళ్లు జియో, ఫేస్బుక్ కలిసి మీకు రోజుకు 25 జీబీ చొప్పున 6 నెలలు ఫ్రీ డేటా ఇస్తాయని మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్ను మీరు నమ్మడానికి వాళ్లు లాక్డౌన్ కాబట్టి ఈ డేటా ఫ్రీ ఆఫర్ను ఇస్తున్నట్లు వాళ్లు నమ్మించాలని చూస్తున్నారు.
మేం అలాంటి ఆఫర్ పెట్టలేదు
మేం ఇలా ఫ్రీ డేటా ఇచ్చే ఆఫర్ ఏమీ ఇవ్వడం లేదని జియో ప్రకటించింది. ఇలాంటి మెసేజ్లు వస్తుంటాయని, వాటిని చూసి మోసపోవద్దని మా కస్టమర్లకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా హెచ్చరిస్తున్నాం అని చెప్పింది. ఈ ఆఫర్ ఉత్త అబద్ధం. వాటిని చూసి మోసపోవద్దని కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది.
యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు
ఈ జియో ఫ్రీ డేటా ఆఫర్ అనే మెసేజ్ ఒక ఇండియన్ మొబైల్ నెంబర్ నుంచే మీకు వస్తోంది. ఈ ఆఫర్ పొందాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని కూడా ఆమెసేజ్లో ఉంటోంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని అదేంటో చూద్దామనుకున్నవారికి ఆయాప్ పని చేయడం లేదు. అది క్రాష్ అయినట్లుగా చూపిస్తోంది. ఇదొక మాల్వేర్ యాప్ అని, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ అకౌంట్లన్నీ బ్లాక్ చేసి ఎంతోకొంత డబ్బిస్తేనే అకౌంట్లు మళ్లీ రిలీజ్ చేస్తామనే స్కామ్ దాగుంది కాబట్టి బీకేర్ఫుల్. ఒకవేళ వాళ్లు డబ్బులు అడగకపోయినా మీ ఫేస్బుక్, జియోల్లో ఉన్న పర్సనల్ డేటా, పాస్వర్డ్ ల వంటివి దొంగిలించే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ మెసేజ్ వస్తే రెస్పాండ్ కావద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
jio facebook 25gb data jio 25gb data jio 25gb data message fraud scam cybercrime malware attack jio premium fraud  జియో ఫేసà±â€Œà°¬à±à°•ౠపేరిట à°¸à±à°•ామà±â€Œ జియో ఫేసà±â€Œà°¬à±à°•à± à°«à±à°°à±€ డేటా ఆఫ‌రౠసà±à°•ామà±â€Œ సైబ‌రౠకà±à°°à±ˆà°®à±â€Œ