ఫేక్ ఆరోగ్య‌సేతు యాప్‌తో భార‌తీయుల ఫోన్లు హ్యాక్ చేయ‌బోతున్న పాకిస్థాన్‌.. త‌స్మాత్ జాగ్రత్త

క‌రోనా రోగులు మ‌న ప‌రిస‌రాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా రూపొందించిన ఆరోగ్య‌ సేతు యాప్‌కు కొత్త చిక్కొచ్చి ప‌డింది. పొరుగుదేశం పాకిస్తాన్ ఆరోగ్యసేతు యాప్‌ పేరుతో నకిలీ యాప్ త‌యారుచేసింది. ఆ దేశంలోనికొన్ని ఏజెన్సీలు ఈ నకిలీ యాప్‌తో మ‌నోళ్ల స్మార్ట్‌ఫోన్ల‌ను హ్యాక్ చేసేందుకు కుట్ర‌లు చేస్తున్నారని ప్ర‌భుత్వం గుర్తించింది. ముఖ్యంగా సైన్యం, పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు ఈ న‌కిలీ ఆరోగ్య‌సేతు యాప్‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఉన్న‌తాధికారులు హెచ్చ‌రించారు.  

ఆర్మీ వాట్సాప్ గ్రూప్‌లే టార్గెట్ 
శతృదేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు Aarogya Setu.apk పేరుతో ప్రమాదకరమైన యాప్‌ను రూపొందించాయి. వాటిని పాకిస్తానీ ఇంటలెజెన్స్ ఏజెన్సీలు మ‌న సైనికుల వాట్సప్ గ్రూప్స్‌లోకి పంపించేందుకు కుట్రలు పన్నుతున్నాయి.  త‌ద్వారా ర‌హ‌స్యాల‌ను చేధించే ప‌నిలో ప‌డ్డాయ‌ని, కాబ‌ట్టి ఇలాంటి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయొద్దని భారత ఆర్మీ సైనికుల్ని హెచ్చరించింది. 

వాట్సాప్‌లో వ‌చ్చే లింక్స్‌తో డౌన్‌లోడ్ చేయొద్దు 
ఆరోగ్య‌సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండంటూ మీకు వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు వ‌స్తే స్పందించ‌వద్దు. బ్రిట‌న్ కేంద్రంగా ఈ న‌కిలీ యాప్ లింక్స్‌ను వాట్సాప్ ద్వారా ఇండియ‌న్స్‌కు షేర్ చేస్తున్నార‌ని కేంద్ర‌ప్ర‌భుత్వ ఉన్నతాధికారులు గుర్తించారు. 

* ఈ న‌కిలీ యాప్ మీ ఇంట‌ర్నెట్ వినియోగానికి ప‌ర్మిష‌న్లు అడుగుతుంది. అలాగే దీనితోపాటు ఇత‌ర యాప్స్ డౌన్‌లోడ్ చేయ‌డానికి  అనుమ‌తి కోరుతుంది. అలా వ‌స్తే క‌నుక అది క‌చ్చితంగా ఫేక్ యాపే.

* అందుకే వాట్సప్‌లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే Aarogya Setu.apk ఫైల్‌ను ఎట్టిపరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేయొద్దు.

* మీరు ఇలా వాట్సాప్‌లో ఆరోగ్య‌సేతు యాప్ డౌన్‌లోడ్ లింక్ వ‌స్తే క్లిక్ చేయ‌వ‌ద్దు. అలా చేస్తే ఆ యాప్
face.apk, imo.apk, normal.apk, trueC.apk, snap.apk లాంటి మాల్వేర్‌ల‌ను మీ ఫోన్ల‌లోకి పంపించే ప్ర‌మాద‌ముంది. దాని ద్వారా మీ సెన్సిటివ్ డేటాను, కాంటాక్ట్స్‌ను, అకౌంట్ల ఇన్ఫ‌ర్మేష‌న్‌ను హ్యాక్ చేస్తారు. అని సైన్యాన్ని, పారా మిల‌ట‌రీ ఫోర్సెస్‌ను హెచ్చ‌రించారు.

* ఇది సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే భార‌తీయ‌లంద‌రికీ ఈ న‌కిలీ ఆరోగ్య‌సేతు యాప్‌తో ముప్పు పొంచి ఉంది.


వీటి నుంచే డౌన్‌లోడ్ చేయాలి
ఆరోగ్య సేతు యాప్‌ను భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ mygov.in నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి
లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాపిల్ ప్లే స్టోర్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేయాలని భారత ఆర్మీ సూచిస్తోంది. 

fake Arogya sethu app Aarogya Setu.apk న‌కిలీ ఆరోగ్య‌సేతు యాప్‌ ఆరోగ్య‌సేతు యాప్‌తో మాల్వేర్‌ Â