షియోమి యూజ‌ర్ల డేటాను చైనాకు త‌ర‌లించేస్తోంద‌న్న క‌థ‌నాల్లో నిజ‌మెంత‌? 

షియోమి యూజ‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌పెట్టే వార్త ఇది.  త‌మ  రెడ్‌మీ ఫోన్లు వాడుతున్న యూజర్ల నుంచి ఈ చైనా కంపెనీ డేటాను కొట్టేసి చైనాకు త‌ర‌లించేస్తోంద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇవేమీ అల్లాట‌ప్పా ఆరోప‌ణ‌లు కాదు.  ఫోర్బ్స్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డంతో యూజ‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

ప్రైవేట్ బ్రౌజ‌ర్ల‌లో సెర్చ్ చేసినా 
షియోమి త‌న రెడ్‌మీ నోట్ 8లో ఎంఐ బ్రౌజర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిలో సెర్చ్ చేసినవి చైనాకు వెళ్లిపోతున్నాయని సైబ‌ర్‌సెక్యూరిటీ రీసెర్చ‌ర్ గాబీ కిర్లిగ్ చెప్పారు. 

యూజ‌ర్ గూగుల్‌లో ఏ వెబ్‌సైట్‌లు చూశారు, ఏం సెర్చ్ చేశారో ఈ బ్రౌజ‌ర్ క‌లెక్ట్ చేస్తుంద‌ని చెప్పారు. 

ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేసినా డేటాను గ్ర‌హిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 

డ‌క్‌డ‌క్ గో లాంటి పూర్తి ప్రైవేట్ బ్రౌజ‌ర్‌లో సెర్చ్ చేసిన అంశాల‌ను కూడా కలెక్ట్ చేసి యూజ‌ర్ సెర్చ్ ట్రెండ్స్‌ను చైనాలోని స‌ర్వ‌ర్ల‌కు పంపుతుంద‌న్న‌ది ఆయ‌న ఆరోప‌ణ. 

మ‌రో సైబ‌ర్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్ ఆండ్రూ టియ‌ర్నీ గూగుల్ ప్లే స్టోర్‌లో దాదాపు కోటిన్న‌ర మంది డౌన్లోడ్ చేసుకున్న ఎంఐ బ్రౌజ‌ర్ ప్రో, మింట్ బ్రౌజ‌ర్లు కూడా ఈ డేటాను సేక‌రిస్తున్నాయ‌ని చెప్పారు.  

అవన్నీ అవాస్త‌వాల‌న్న షియోమి
ఈ వార్తలను షియోమి ఇండియా కొట్టిపారేసింది.  డేటా ప్రైవ‌సీ, సెక్యూరిటీకి తాము చాలా ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. యూజ‌ర్ల స్పష్టమైన అనుమతి లేకుండా డేటాను తాము సేకరించడం లేదని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్ ట్వీట్ చేశారు. ఇండియా డేటా ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. షావోమి తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్‌ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని ఆయన కొట్టిపారేశారు. ఇన్‌కాగ్నిటో మోడ్ (రహస్య మోడ్‌)లో బ్రౌజ్ చేసిన వాటిని ఎంఐ బ్రౌజర్‌ ఎప్పటికీ గుర్తించలేదు.  ఎంఐ బ్రౌజర్‌తో సహా షియోమి స్మార్ట్‌ఫోన్లు, డీఫాల్ట్‌ యాప్‌లు.. సెక్యూరిటీ, సీక్ర‌సీ పరంగా సేఫ్ అని ఫేమ‌స్ అంతర్జాతీయ థర్డ్‌ పార్టీ కంపెనీలు ట్రస్ట్ఆర్క్, బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూషన్ (బిఎస్ఐ) స‌ర్టిఫై చేశాయ‌ని మనుకుమార్‌ జైన్ చెప్పారు.

Xiaomi Xiaomi sending private data to china xiaomi privacy Xiaomi browsing data Redmi Note 8 Xiaomi data privacy షియోమి యూజ‌ర్ల డేటా చోరీ మింట్ బ్రౌజ‌ర్ ఎంఐ బ్రౌజ‌ర్‌ ఎంఐ బ్రౌజర్ ప్రో సైబ‌ర్ క్రైమ్‌