లాక్డౌన్ వేళ ఆన్లైన్లో క్లాస్లు చెప్పడానికి, కంపెనీలు ఉద్యోగులతో మీటింగ్లు పెట్టుకోవడానికి బాగా ఉపయోగించిన యాప్ జూమ్. లక్షల కొద్దీ కొత్త డౌన్లోడ్స్తో జూమ్ యాప్ యమా ట్రెండింగ్లోకి వచ్చేసింది. పైసా ఖర్చు లేకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ వాడుకుంటన్నామని యూజర్లు కూడా సంబరపడ్డారు. అయితే ఇప్పుడు జూమ్ యాప్ యూజర్ల డేటా నడిబజార్లలో పది పైసలకు కూడా అమ్ముతున్నారని తెలియగానే యూజర్లలో కంగారు పుడుతోంది.
యాప్ వాడొద్దంటున్న కేంద్రం
జూమ్ యాప్ ఎంతగా పాపులరయిందంటే లాక్డౌన్ టైమ్లో కేంద్ర మంత్రులు కూడా దీన్ని వాడుతున్నారు. తమ శాఖలోని అధికారులతో ఎక్కడి నుంచైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వాళ్లు జూమ్నే వాడుతుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గాల్లోనూ కలకలం మొదలైంది. ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 5 లక్షల మంది జూమ్ యాప్ యూజర్ల వివరాలను హ్యాకర్లు డార్క్వెబ్లో అమ్మకానికి పెట్టారు. కొంత డేటాను 5 రూపాయలు, 10 రూపాయలకు అమ్మారని... పెద్దగా యూజ్ లేదనుకున్నవి 15 పైసలకు కొన్నింటిని ఫ్రీగా కూడా హ్యాకర్లు ఇచ్చేశారని తెలిసింది. ఇందులో కేంద్ర మంత్రుల మీటింగ్ల సమాచారంకూడా ఉంటే చాలా ప్రమాదమని కేంద్ర ప్రభుత్వం కంగారు పడుతోంది. అందుకే మంత్రులు ఎవరూ జూమ్ యాప్ వాడొద్దంటూ స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇచ్చేసింది.
ఈ డేటాతో జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు జూమ్ యాప్లో ఉన్న లొసుగులను పట్టేశారని, కంపెనీలు, ఉద్యోగుల సెన్సిటివ్ డేటాను, పర్సనల్ ఇన్ఫోను కొట్టేసే ప్రమాదం ఉందని భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్-ఇన్ తాజాగా హెచ్చరించింది.
* ఎంప్లాయి ఇన్ఫర్మేషన్, కంపెనీల ఉత్పత్తుల గురించిన ప్లాన్స్,
* కొత్తగా తయారుచేయబోతున్న ప్రొడక్ట్ డిటైల్స్, ఇతర రహస్యాలపై హ్యాకర్లు దృష్టి పెట్టే ప్రమాదం ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.
సెక్యూరిటీ లేదని చెప్పినా వింటేగా
జూమ్ యాప్లో సెక్యూరిటీ ఫీచర్లు బాగాలేదని సైబర్ నిపుణులు ముందు నుంచీ మొత్తుకుంటూనే ఉన్నారు. ఈ యాప్లో సెక్యూరిటీ ఫ్లా వల్ల మీ నుంచి ఆహ్వానం (మీటింగ్ ఐడీ) లేకుండానే హ్యాకర్లు మీతోపాటు కాన్ఫరెన్స్లోకి వచ్చేస్తారు. వాళ్లొచ్చిన సంగతి మీకు తెలియదు.
* ఇదే అదనుగా కాన్ఫరెన్స్లో ఉన్నవారి సెల్ ఫోన్లు, ల్యాపీలు, పీసీల్లోకి మాల్వేర్/రాన్సమ్వేర్ను జొప్పించే ప్రమాదం ఉంది. ఇలాచేస్తే మీ డివైస్లన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయినట్లే.
* అంతేకాదు మీకు తెలియకుండానే కాన్ఫరెన్స్లో ఉంటారు కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయమూ ప్రతి మాటా వారికి తెలిసిపోతుంది. ఇది మరింత ప్రమాదం.
Zoom App Zoom Users data Cyber Crime జూమౠయాపà±â€Œ జూమౠయూజ‌రà±à°¸à± డేటా చోరీ సైబ‌రౠకà±à°°à±ˆà°®à±â€Œ