ఇండియాలో టాప్-50 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే!


ఐఐటీ, ట్రిపుల్ ఐటీ- అనేవి విద్యార్థులు క‌ల‌లుగ‌నే ఉన్న‌త విద్య‌లు. అత్యున్న‌త స్థాయిలో జీవితాన్ని తీర్చి దిద్దుకునేం దుకు చాలా మంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటారు. ఇక‌, వీటిలో ప్ర‌వేశాల‌కు సంబంధించి జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌కు ల‌క్ష‌ల సంఖ్యలో విద్యార్థులు హాజ‌ర‌వుతారు. ఈ ప‌రీక్ష‌లో క‌టాఫ్ మార్కు దాటి.. ఉత్తీర్ణులైన వారు జీవితంలో ఒక మెట్టును ఎక్కి నట్టే ఫీల‌వుతారు. క‌టాఫ్ మార్కును దాటి.. ఐఐటీల్లో చోటు ద‌క్కించుకుంటున్న వారి ప‌రిస్థితి ఓకే. అలా కాకుండా  ఈ ప‌రీక్ష కోసం నిద్రాహారాలు మానుకుని క‌ష్ట‌ప‌డి చ‌దివినా కూడా ల‌క్ క‌లిసి రాక.. క‌టాఫ్‌ను చేరుకోని అభ్య‌ర్థుల ప‌రిస్థితి ఏంటి? 

ఇక‌, వారి క‌లలు కొర‌గాకుండా పోవాల్సిందేనా?  జీవితంలో ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌నే వారి ఆశ‌ల‌కు అక్క‌డితోనే బ్రేకులు ప‌డిన‌ట్టా?! అంటే.. కాద‌ని అంటున్నారు విద్యారంగంలోని నిపుణులు. ఇలాంటి వారికోసం దేశంలో అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో నాన్ ఐఐటీ ఇంజ‌నీరింగ్ విద్య‌ను అందిస్తున్న‌ టాప్‌-50 క‌ళాశాల‌లు ఉన్నాయ‌ని వారు వివ‌రిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలోని ఉన్న‌త విద్యామండ‌లి ప‌ర్య‌వేక్షణ‌లో ఇంజ‌నీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మ‌సీ వంటి కోర్సుల‌ను ఈ కాలేజీలు అందిస్తున్నా యి. ఇక‌, ప్ర‌తి ఏటా.. ఈ కాలేజీల్లో బోధ‌న‌, ప్ర‌మాణాల‌ను బేరీజు వేస్తున్న కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ ఆయా కాలేజీల‌కు నేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్‌ను ఇస్తోంది. ఇలా ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్న 50 అత్యున్నత నాన్ ఐఐటీ క‌ళాశాల‌ల జాబితాను ఒక్క‌సారి ప‌రిశీంచి, మీకు న‌చ్చిన కాలేజీని ఎంచుకుని, నిర్దేశించుకున్న ల‌క్ష్యం దిశ‌గా దూసుకుపోండి. 

1/50
అన్నా యూనివ‌ర్సిటీ : త‌మిళ‌నాడులోని ముఖ్య‌మైన విశ్వవిద్యాల‌యాల్లో ఇది ఒక‌టి. ఐఐటీ యేత‌ర ఇంజ‌నీరింగ్ విద్య‌కు దేశంలోనే ప్ర‌ముఖంగా పేరు తెచ్చుకుంది. చెన్నైలో ఉన్న ఈ వ‌ర్సిటీలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.4.2 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు. 

2/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ:  త‌మిళ‌నాడులోని మ‌రో కీల‌క‌మైన విద్యా సంస్థ‌. తిరుచిరాప‌ల్లిలో ఉన్న ఈ ఇనిస్టిట్యూట్‌లో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

3/50
ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ: మ‌హారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఈ సంస్థ‌కు దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది.  ఈ ఇనిస్టిట్యూట్‌లో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.75 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5.3 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

4/50
జాద‌వ్‌పూర్ యూనివ‌ర్సిటీ: ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో ఉన్న ఈ వ‌ర్సిటీ ఉత్త‌మ ఐఐటీయేత‌ర కాలేజీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.3 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.4.32 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

5/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(రూర్కెలా): ఒడిశాలోని పేరెన్నిక‌గ‌న్న విద్యా సంస్థ. జాతీయ ర్యాంకుల్లో ఐదో స్తానంలో నిలిచిన ఈ విద్యా సంస్థ‌లో ఐఐటీయేత‌ర విద్య‌ను అభ్య‌శించేందుకు విద్యార్థులు పోటెత్తుతూ ఉంటారు. నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.98 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

6/50
వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ: త‌మిళ‌నాడులోని వెల్లూరు ప్రాంతంలో ఉండ‌డంతో ఈ సంస్థ‌కు ఈ పేరును పెట్ట‌డం విశేషం. దేశంలోని అత్యుత్త‌మ కాలేజీల్లో ఆరోస్థానంలో ఉన్న దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.2 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5.2 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

7/50
ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ సైన్స్‌ అండ్ టెక్నాల‌జీ(శిబ్‌పూర్‌): ప‌శ్చిమ బెంగాల్‌లోని కీల‌క న‌గ‌రం హౌరాకు స‌మీపంలో ఉన్న శిబ్‌పూర్‌లో ఉన్న ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ సైన్స్‌ అండ్ టెక్నాల‌జీ సంస్థ‌కు దేశంలో మంచి పేరుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.2 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6.25 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

8/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(క‌ర్ణాట‌క‌): క‌ర్ణాట‌క‌లోని సుర‌త్కళ్ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ కూడా దేశంలోనే అత్యుత్త‌మ ఐఐటీయేత‌ర ఇంజ‌నీరింగ్‌ను అందించ‌డంలో పేరు తెచ్చుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7.1 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.7 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

9/50
థాప‌ర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ(డీమ్డ్ యూనివ‌ర్సిటీ పాటియాల): ప‌ంజాబ్‌లోని పాటియాలలో ఉన్న ఈ ఇనిస్టిట్యూట్ దేశంలోని ఉత్త‌మ వ‌ర్సిటీల్లో ఒక‌టిగా నిలిచింది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.2 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

10/50
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్(బిట్స్‌-పిలానీ): ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్‌లోని కీల‌క‌మైన న‌గ‌రం పిలానీ. ఇక్క‌డ ఏర్పాటు చేసిన ప్ర‌ఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్. దీనినే బిట్స్ పిలానీగా కూడా పిలుస్తారు. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.11 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.11.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

11/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(వ‌రంగ‌ల్‌):  తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉన్న నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంస్థ కూడా ర్యాంకింగ్ ప‌రంగా ఉత్త‌మ‌స్థానంలో ఉంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8.37 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.7.45 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

12/50
జామియా మిల్లియా ఇస్లామియా(ఢిల్లీ):  దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా కూడా ప్ర‌ముఖ వ‌ర్సిటీల్లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7.75 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6.12 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

13/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(కాలిక‌ట్‌):  దేవ‌భూమిగా పేరుగాంచిన కేర‌ళ‌లోని ప్ర‌ముఖ న‌గ‌రం కాలిక‌ట్‌. ఇక్క‌డ ఉన్న నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఉన్న‌త విద్య‌లో ప్ర‌ముఖ పేరు తెచ్చుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7.2 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.7.8 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

14/50
ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ(తిరువ‌నంత‌పురం):  కేర‌ళ‌లో రాజ‌ధాని తిరువ‌నంత‌పురం లో ఉన్న ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీకి ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా మంచి పేరుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8.82 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.8 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

15/50
విశ్వేశ్వ‌రాయ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(నాగ‌పూర్): మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌లో ఉన్న ఈ సంస్థ‌కు కూడా దేశ‌వ్యాప్తంగా మంచి పేరుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5.4 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

16/50
శిక్ష‌`0` అనుసంధాన్‌(భువ‌నేశ్వ‌ర్‌): ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో ఉన్న ఈ సంస్థ కూడా దేశంలోనే పేరు తెచ్చుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.25 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.   

17/50
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(రాంచీ):  జార్ఖండ్‌లోని కీల‌క‌మైన యూనివ‌ర్సిటీ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.6 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

18/50 
ఢిల్లీ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ(ఢిల్లీ):  దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ కూడా ఐఐటీయేత‌ర ఇంజ‌నీరింగ్ విద్య‌కు పెట్టింది పేరు. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.10 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.  

19/50
అమైటీ యూనివ‌ర్సిటీ(గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్‌): ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ వ‌ర్సిటీల్లో అమైటీ యూనివ‌ర్సిటీ ఒక‌టి. ఇది గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్‌లో ఉండ‌డంతో ఆ నగ‌రం పేరుతోనే ప్ర‌సిద్ధి చెందింది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

20/50
ఎస్ ఆర్ ఎమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ(చెన్నై): త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఉన్న ఎస్ ఆర్ ఎమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ జాతీయ ర్యాంకుల్లో 20వ స్థానంలో నిలిచింది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.6 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.4.25 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

21/50
శ్రీ శివ‌సుబ‌ర‌మ‌ణ్య నాడార్‌ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌(కాంచీపురం) : త‌మిళ‌నాడులోని ప్ర‌ఖ్యాత కాలేజీల్లో ఇది కూడా ఒక‌టి. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక న‌గ‌రం కాంచీపురంలో ఉన్న శ్రీ శివ‌సుబ‌ర‌మ‌ణ్య నాడార్‌ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ జాతీయ ర్యాంకుల్లో 21వ స్థానంలో నిలిచింది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.4 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.4.14 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

22/50
ష‌ణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాల‌జీ అండ్ రిసెర్చ్ అకాడమీ(తంజావూరు): త‌మిళ‌నాడులోని ప్ర‌ఖ్యాత కాలేజీల్లో ఇది ఒక‌టి. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు. 

23/50
ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ హైద‌రాబాద్‌:  తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ఈ సంస్థ కూడా దేశంలో మంచి పేరు తెచ్చుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.20.35 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.20.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

24/50
అలీగ‌ఢ్ ముస్లి యూనివ‌ర్సిటీ(అలీగ‌ఢ్‌): ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ వ‌ర్సిటీల్లో ఇది కూడా ఒక‌టి.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.4.78 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5.25 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

25/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(కురుక్షేత్ర‌): హ‌ర్యానా రాష్ట్రంలోని ముఖ్య‌మైన విద్యా సంస్థ‌ల్లో ఇది ప్ర‌ధ‌మ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో 25వ ర్యాంకును సొంతం చేసుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

26/50
మోతీలాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(అల‌హాబాద్‌): ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ వ‌ర్సిటీల్లో ఇది కూడా ఒక‌టి.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7.95 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

27/50
మ‌ణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(మ‌ణిపాల్‌): క‌ర్ణాట‌క‌లోని ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

28/30
పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాల‌జీ(కోయంబ‌త్తూరు): త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఉన్న పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాల‌జీ కూడా ఐఐటీయేత‌ర కోర్సుల‌ను అందిస్తోంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.53 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

29/50
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ హైద‌రాబాద్‌:  తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ఈ యూనివ‌ర్సిటీ కూడా జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.4.98 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

30/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ దుర్గాపూర్: ప‌శ్చిమ బెంగాల్‌లోని ముఖ్య‌మైన న‌గ‌రం దుర్గాపూర్‌. ఇక్క‌డ స్థాపించిన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీకి ఈ న‌గ‌రం పేరునే ఉంచ‌డం విశేషం. జాతీయ ర్యాంకుల్లో 30వ స్థానంలో ఉన్న ఈ ఇనిస్టిట్యూట్‌లో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.1 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

31/50
స‌త్య భామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ చెన్నై: త‌మిళ‌నాడులోని కీల‌క‌మైన విద్యాసంస్థ‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.11 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5.15 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

32/50
క‌ళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీ(భ‌వ‌నేశ్వ‌ర్‌): ఒడిశాలోని ముఖ్య‌మైన విద్యా సంస్థ‌ల్లో ఇది ప్ర‌ముఖ‌మైంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.8 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

33/50
కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ పూణే: మ‌హారాష్ట్ర‌లోని పూణే న‌గ‌రంలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ ఐఐటీ యేత‌ర ఇంజ‌నీరింగ్‌కు ప్ర‌సిద్ధి. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.7 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

34/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సిల్చార్‌(అస్సాం): ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని కీల‌క విద్యా సంస్థ‌. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.7 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.36 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

35/50
కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌(వ‌డ్డేశ్వ‌రం): ఏపీ రాజ‌ధాని ప్రాంతం గుంటూరు జిల్లాలోని వ‌డ్డేశ్వ‌రంలో ఉన్న కోనేరు ల‌క్ష్మ‌య్య కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ కూడా దేశ‌వ్యాప్తంగా మంచి పొజిష‌న్‌లో ఉంది.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.2 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

36/50
మాల్వియా నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(జైపూర్‌):  ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లోని కీల‌క‌మైన విద్యా సంస్థ‌. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ సంస్త‌కు మంచి పేరుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.25 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

37/50
పంజాబ్ యూనివ‌ర్సిటీ చండీగ‌ఢ్‌: ప‌ంజాబ్ రాష్ట్రంలోని ముఖ్య‌మైన విశ్వ‌విద్యాల‌యం. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.25 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

38/50
ఇంద్ర‌ప్ర‌స్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(న్యూఢిల్లీ):  దేశ రాజ‌ధాని ఢిల్లీలోని కీల‌క‌మైన విద్యా సంస్థ‌. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.12 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.12.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

39/50
త్యాగ‌రాజ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌(మ‌దురై): త‌మిళ‌నాడులోని మ‌దురైలో ఉన్న ఈ విద్యా సంస్థ‌కు దేశ‌వ్యాప్తంగా మంచి పేరుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.6 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

40/50
డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ: మ‌హారాష్ట్రలోని పూణేలో ఉన్న ఈ సంస్థ‌కు దేశంలోనే మంచి డిమాండ్ ఉంది. దీనిలో కేవ‌లం రెండేళ్ల పోస్ట్ గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. దీనికి గాను రూ.8.5 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. 

41/50
స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(సూర‌త్‌):  గుజ‌రాత్‌లోని ఈ సంస్థ సువిశాల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6.67 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5.34 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

42/50
కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ విశాఖ‌ప‌ట్నం: ఏపీలోని ఐటీ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ఈ సంస్థ‌కు దేశ‌వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.4 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6.55 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

43/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ హ‌మీర్‌పూర్‌:  శీత‌ల రాష్ట్రంగా పేరున్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కీల‌క‌మైన విద్యా సంస్థ‌. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5.55 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.4.65 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

44/50
క‌ల‌శ‌లింగం అకాడ‌మీ ఆఫ్ రిసెర్చ్ అండ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్‌: త‌మిళ‌నాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న క‌ల‌శ‌లింగం అకాడ‌మీ ఆఫ్ రిసెర్చ్ అండ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్‌కు దేశంలోనే మంచి సంస్థ‌గా పేరుంది. జాతీయ ర్యాంకుల్లో 44వ స్థానం సంపాయించుకుంది. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.3.6 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.6 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

45/50
మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(భోపాల్‌): మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లో ఉన్న ఈ సంస్థ‌కు కూడా దేశంలో మంచి పేరుంది.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.6 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.6.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

46/50
ఆర్వీ కాలేజ్ ఆఫ్ బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఉన్న ఈ కాలేజీకి ప్ర‌ముఖ స్థానం ఉంది.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.7 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

47/50
ఎం.ఎస్ రామ‌య్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఉన్న ఈ సంస్థ‌కు దేశం న‌లుమూల‌ల నుంచి డిమాండ్ ఉంది. అనేక మంది విద్యార్థులకు ఈ సంస్థ దిశానిర్దేశం చేస్తోంది.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.4.7 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.4.5 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

48/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని ఈ సంస్థ‌కు కూడా మంచి డిమాండ్ ఉంది.  దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.13 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.13 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

49/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజ‌నీరింగ్ ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ప్ర‌ముఖ సంస్థ‌.  దీనిలో కేవ‌లం రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్ మాత్ర‌మే ఉంది. దీనికి రూ.15.05 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.

50/50
నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మేఘాల‌య‌: ఈశాన్య రాష్ట్రం మేఘాల‌య‌లోని షిల్లాంగ్‌లో ఉన్న ప్ర‌ముఖ విద్యా సంస్థ‌. దీనిలో నాలుగేళ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5 ల‌క్ష‌లు, రెండేళ్ల పోస్టు గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు రూ.3.25 ల‌క్ష‌లు నిర్ణ‌యించారు.
 

india top 50 engeneering colleges