ఈ 5 ప‌నుల‌తో మీ ఐటీ ఉద్యోగం కాపాడుకోండి

ఐటీ కంపెనీల్లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎక్కువ‌గా వినిపించే మాట‌ AI. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా అప్డేట్ అవ్వ‌క.. ఉద్యోగం ఉంటుందో లేదో అనే భ‌యం చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఉంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో వారి ముందు ఎలాంటి అవ‌కాశాలు ఉన్నాయి.. వీటిపై నిపుణులు ఏమంటున్నారు అనే విష‌యాలు తెలుసుకుందాం. 

అప్‌స్కిల్లింగ్ (Up Skilling)

సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే టెకీలకు 'అప్‌స్కిల్లింగ్' (కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం) ఒక్కటే ఏకైక మార్గం.
మార్పులను గమనించడం: పరిశ్రమలో వస్తున్న తాజా మార్పులను గమనిస్తూ, వాటికి తగిన కోర్సులను నేర్చుకోవడం ముఖ్యం.
AI టూల్స్ వాడకం: ప్రస్తుతం అన్ని కంపెనీల్లో AI వినియోగం పెరిగినందున.. 
Chat GPT
Copilot
GitHub వంటి టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో తప్పనిసరిగా నేర్చుకోవాలి.
డిమాండ్ ఉన్న టెక్నాలజీలు:
Cloud Technologies (AWS, Azure, Google Cloud)
Data Science 
Data Analytics
Cyber Security
Devops
Machiene Learning వంటి వాటికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.


Value పెంచుకోవ‌డం

ప్రస్తుత మార్కెట్లో కేవలం ఒకే ఒక్క స్కిల్‌తో స‌ర్వైవ్‌ అవ‌డం కష్టం కాబట్టి, అన్ని రంగాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి (Jack of all trades).
ఫుల్‌స్టాక్ కెరీర్: ఒక‌వేళ మీరు డెవ‌ల‌ప‌ర్ అయితే , ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాలి. 
మల్టిపుల్ రోల్స్: ప్రాజెక్ట్‌లో అవసరాన్ని బట్టి వేర్వేరు బాధ్యతలను (Multiple roles) స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.
సమస్యల పరిష్కారం: ప్రాజెక్టులలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే చొరవ ప్రదర్శించాలి.


బలమైన నెట్‌వర్క్

పరిశ్రమలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను నిరంతరం బలోపేతం చేసుకోవాలి.
కమ్యూనిటీ పార్టిసిపేషన్: టెక్ కమ్యూనిటీలు, మీటప్‌లు (Meetups) మరియు హాకథాన్స్‌లో (Hackathons) చురుగ్గా పాల్గొనడం ద్వారా కొత్త అవకాశాలను ముందే గుర్తించవచ్చు.
అప్‌టేడ్‌ ప్రొఫైల్: కెరీర్ గ్రోత్ కోసం మరియు కొత్త నెట్‌వర్కింగ్ అవకాశాల కోసం లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రొఫైల్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోవాలి.


బీ రెడీ టు అడాప్ట్‌

టెక్నాలజీలు మరియు కొత్త ప్రాజెక్టులు మారినప్పుడు, వీలైనంత త్వరగా వాటికి అలవాటు పడే మానసిక స్థితిని కలిగి ఉండాలి.
కమ్యూనికేషన్ ముఖ్యం: ఐటీ రంగంలో వెర్బల్ (మాటల ద్వారా) మరియు మెయిల్ (Mail) కమ్యూనికేషన్ చాలా కీలకం.
క్లయింట్ మేనేజ్‌మెంట్: విదేశీ క్లయింట్స్‌తో మాట్లాడేటప్పుడు మన అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు స్పష్టంగా చెప్పగలగాలి.


ఆర్థిక భ‌రోసా ముఖ్యం
Due to ongoing market shifts and strategic restructuring, we must reduce our overall workforce to align with our current business needs. It is with deep regret that we inform you your position is affected - ఇలాంటి మెయిల్స్‌ టెకీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముందస్తు ప్రణాళిక: అనుకోని ప‌రిస్థితుల్లో ఉద్యోగం పోతే.. ఏం చేయాలనే దానిపై ముందే ఒక ప్లాన్ ఉండాలి.
ఎమర్జెన్సీ ఫండ్: అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా కనీసం 6 నుండి 12 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి సిద్ధం చేసుకోవాలి. 


టెక్ నిపుణుల సూచ‌న‌లేంటంటే.. 

సాఫ్ట్‌వేర్ రంగంలో ఒడిదుడుకులు, లేఆఫ్స్ మరియు మార్కెట్ అస్థిరతలు అనేవి సహజమైన ప్రక్రియలు. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఉండ‌టానికి కెరీర్ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. 
మానసిక దృఢత్వం: లేఆఫ్స్ అనేవి మార్కెట్ పరిస్థితుల వల్ల జరిగేవే తప్ప, మీ వ్యక్తిగత లోపం కాదని గ్రహించాలి. 
గ్లోబల్ ప్రొఫైల్: అంతర్జాతీయ రిమోట్ ఉద్యోగాలు మరియు ఫ్రీలాన్స్ అవకాశాలకు సరిపోయేలా మీ ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకోవాలి.
ప్రత్యామ్నాయ ఆదాయం: కేవ‌లం కంపెనీలో వ‌చ్చే జీతం పైనే కాకుండా సెకండ్ ఇన్‌క‌మ్ గురించి ఆలోచించాలి. వీటిలో ముఖ్యంగా
Technical Consulting
Part time Teaching
Open source ద్వారా అదనపు ఆదాయ వనరులను సృష్టించుకోవాలి.

software #ITJOB #keeplearing #Upskilling #saveyouritjob