కేంద్ర ప్ర‌భుత్వ ఉచిత ఏఐ, ఎంఎల్ స‌ర్టిఫికేష‌న్లు మీకోసం

ప్ర‌పంచం అంతా ఇప్పుడు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వైపు పరుగులు పెడుతోంది. వేగంగా మారుతున్న సాంకేతికత‌కు అనుగుణంగా విద్యార్థుల‌కు, యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌నే ఉద్దేశంతో కేంద్ర‌ప్ర‌భుత్వం డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఉచితంగా ఏఐ, ఎంఎల్ (AI & ML) సర్టిఫికేషన్లు అందిస్తోంది. వీటి కోసం ప్రత్యేక వెబ్‌సైట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు, యువ‌త‌, గృహిణులు.. ఇలా అన్ని రంగాల వారు, ఎటువంటి కోడింగ్ ప‌రిజ్ఙానం లేని వారు కూడా సులువుగా ఇందులో రిజిస్ట‌ర్ అయ్యి ఏఐ, ఎంఎల్ కోర్సుల‌ను పూర్తిచేసి ఉచితంగా స‌ర్టిఫికేష‌న్ పూర్తి చేయ‌వ‌చ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న టాప్ ఉచిత ఏఐ, ఎంఎల్ సర్టిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.

YUVA AI for ALL (IndiaAI Mission - MeitY) - ప్రతి భారతీయుడికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ప్రాథ‌మిక అంశాలపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలో ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత ప్రోగ్రామ్ ఇది.
- ఫీజు (Free or Paid): 100% Free. కోర్స్ నేర్చుకోవడం మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారిక సర్టిఫికేట్ పొందడం పూర్తిగా ఉచితం.
- ఎవరికి ఉపయోగపడుతుంది: స్కూల్, కాలేజీ విద్యార్థులు, నాన్-టెక్ ప్రొఫెషనల్స్, గృహిణులు, అసలు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేని వారందరికీ ఇది మంచి ఛాయిస్‌.
- ఎలా ఉపయోగపడుతుంది: ఇది కేవలం 4.5 గంటల సెల్ఫ్-పేస్డ్ కోర్స్. ఇందులో చాట్‌జీపీటీ వంటి AI టూల్స్ ఉప‌యోగించ‌డం (Prompt Engineering), నిత్యజీవితంలో AI అప్లికేషన్స్, బాధ్యతాయుతమైన AI వాడకం (Responsible AI) నేర్పుతారు. దీనిని Skill India Digital Hub లేదా FutureSkills Prime లో రిజిస్టర్ చేసుకోవచ్చు.


IIT Madras – Introduction to Machine Learning (SWAYAM / NPTEL) - కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) కి చెందిన Swayam Central NPTEL Portal ద్వారా ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే అత్యంత ప్రామాణికమైన కోర్స్.
- ఫీజు (Free or Paid): కోర్స్ పూర్తిగా ఫ్రీ. లెక్చర్స్ వినడానికి, అసైన్‌మెంట్స్ రాయడానికి ఎలాంటి ఫీజు లేదు.
- సర్టిఫికేట్ కావాలనుకుంటే: ఐఐటీ మద్రాస్ నుండి అధికారిక సర్టిఫికేట్ కావాలనుకుంటే మాత్రం ₹1,000 ఎగ్జామ్ ఫీజు కట్టి ఇన్-పర్సన్ సెంటర్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- ఎవరికి ఉపయోగపడుతుంది:  బీటెక్‌, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్ విద్యార్థులు, అడ్వాన్స్‌డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కోడింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
- ఎలా ఉపయోగపడుతుంది: ఇది 12 వారాల ఐఐటీ స్థాయి సిలబస్. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబులిటీ, న్యూరల్ నెట్‌వర్క్స్, మరియు క్లస్టరింగ్ వంటి కోర్ మ్యాథ్స్ & అల్గారిథమ్స్ నేర్పుతారు. ఈ ఐఐటీ సర్టిఫికేట్ మీ రెజ్యూమేలో ఉంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలలో భారీ వెయిటేజీ లభిస్తుంది.


AI for India 2.0 (Skill Development & MSDE) - మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ (MSDE) మరియు ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ సంస్థ GUVI సంయుక్తంగా అందిస్తున్న ఉచిత ప్రోగ్రామ్.
- ఫీజు (Free or Paid): 100% Free. నేర్చుకోవడంతో పాటు NCVET గుర్తింపు ఉన్న సర్టిఫికేషన్ ఉచితంగా లభిస్తుంది.
- ఎవరికి ఉపయోగపడుతుంది: గ్రామీణ ప్రాంత విద్యార్థులు మరియు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడే యువత కోసం ఇది 9 భారతీయ భాషల్లో (తెలుగుతో సహా) అందుబాటులో ఉంది.
- ఎలా ఉపయోగపడుతుంది: పైథాన్ (Python) ప్రోగ్రామింగ్ బేసిక్స్ నుండి మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వరకు మాతృభాషలోనే హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్‌తో నేర్పిస్తారు.


ISRO Free AI/ML & Deep Learning Courses (IIRS) - భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన అనుబంధ సంస్థ ఐఐఆర్‌ఎస్ (IIRS) ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అప్లైడ్ ఏఐ కోర్సులు అందిస్తోంది.
- ఫీజు (Free or Paid): 100% Free. ఇస్రో అందించే క్లాసులు వినడం మరియు ఆన్‌లైన్ క్విజ్ పాసయ్యాక ఇస్రో అధికారిక సర్టిఫికేట్ పొందడం పూర్తిగా ఉచితం.
- ఎవరికి ఉపయోగపడుతుంది: డేటా సైంటిస్టులు, రీసెర్చర్లు, స్పేస్ టెక్నాలజీ, అగ్రికల్చర్, రిమోట్ సెన్సింగ్ (ఉపగ్రహ డేటా) రంగాలలో ఏఐని ఎలా వాడాలో తెలుసుకోవాలనుకునే వారికి ఉప‌యోగం.
- ఎలా ఉపయోగపడుతుంది: సాధారణ కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాకుండా, స్పేస్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS) లలో ఏఐ, ఎంఎల్‌ ప్రాక్టికల్ అప్లికేషన్స్ నేర్పుతారు. ఇస్రో పేరున్న సర్టిఫికేట్ రెజ్యూమే యూనిక్‌గా కనిపించేలా చేస్తుంది.


NIELIT Generative AI Introduction Course (MeitY) - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) అందిస్తున్న షార్ట్-టర్మ్ డిజిటల్ కోర్స్.
- ఫీజు (Free or Paid): 100% Free. సెల్ఫ్-పేస్డ్ ఆన్‌లైన్ లెర్నింగ్ మరియు డిజిటల్ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితం.
- ఎవరికి ఉపయోగపడుతుంది: రోజువారీ పనులలో జనరేటివ్ AI (Generative AI) టూల్స్ వాడి ప్రొడక్టివిటీ పెంచుకోవాలనుకునే ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ.
- ఎలా ఉపయోగపడుతుంది: ఇది కేవలం 2 గంటల చిన్న కోర్స్. జనరేటివ్ AI టెక్నాలజీ బ్యాకెండ్‌లో ఎలా పనిచేస్తుంది. వివిధ ప‌నుల‌ను ఆటోమేట్ చేయడానికి AI ప్రాంప్ట్స్ ఎలా రాయాలి అనే ప్రాథమిక నాలెడ్జ్ ఇస్తుంది.

free ai course by government free ai certification artificial intelligence government free course free certifications government certification ai ml certification ai government free course