ఈ గూగుల్ క్లౌడ్ స‌ర్టిఫికేష‌న్స్ మీకు తెలుసా?

క్లౌడ్ టెక్నాల‌జీ అన‌గానే వెంట‌నే గుర్తొచ్చే పేర్లు - అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్‌ (Azure). కానీ వీటితో పాటు ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చెందిన క్లౌడ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం (Google Cloud Platform) కూడా ఉంద‌ని త‌క్కువ మందికి తెలుసు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ టెక్‌ కంపెనీలు డేటా అనలిటిక్స్ మరియు ఏఐ ప్రాజెక్టుల కోసం గూగుల్ క్లౌడ్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాయి. దీనివల్ల గూగుల్ క్లౌడ్‌లో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. బిగ్ డేటా (BigQuery) మరియు మెషిన్ లెర్నింగ్ రంగంలో గూగుల్ క్లౌడ్‌కు తిరుగులేదు. కాబట్టి డేటా సైన్స్ వైపు వెళ్లాలనుకునే వారికి GCP స‌రైన‌ ఛాయిస్‌గా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం గూగుల్ అందించే కోర్సుల‌తో పాటు స‌ర్టిఫికేష‌న్ల‌కూ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఈ గూగుల్ క్లౌడ్‌ సర్టిఫికేషన్ల పూర్తి వివరాలు, వాటి ఫీజులు, కెరీర్ లాభాల గురించి తెలుసుకుందాం. గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్లు మూడు స్థాయిలుగా (3 Levels) ఉంటాయి.

Foundational Level (ప్రారంభ స్థాయి): ఐటీ లేదా క్లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ లేని వారు క్లౌడ్ పరిభాషను, గూగుల్ క్లౌడ్ బిజినెస్ మోడల్‌ను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
- ముఖ్యమైన ఎగ్జామ్స్: క్లౌడ్ డిజిట‌ల్ లీడ‌ర్‌ (Cloud Digital Leader), జ‌న‌రేటివ్ ఏఐ లీడ‌ర్‌ (Generative AI Leader).
- ఫీజు: 99 డాల‌ర్లు. ఈ ఎగ్జామ్ ఫీజును డాలర్లలోనే వసూలు చేస్తారు. దీనికి అదనంగా టాక్స్ లు వర్తిస్తాయి.
- ఉచిత‌ మార్గం: గూగుల్ క్లౌడ్ అధికారికంగా Google Cloud Skills Boost పోర్టల్ ద్వారా ఉచిత మరియు పెయిడ్ ల్యాబ్స్ అందిస్తుంది.
- ఎవరి కోసం: క్లౌడ్ రంగంలోకి ఇప్పుడే అడుగుపెడుతున్న ఫ్రెషర్స్, మేనేజర్లు, లేదా సేల్స్ టీమ్స్ కోసం.
- ఏం నేర్చుకుంటారు: గూగుల్ క్లౌడ్ యొక్క ప్రాథమిక సేవలు (Basic Services), ప్రయోజనాలు మరియు బిల్లింగ్ గురించి అవగాహన.

Associate Level - Intermediate (మధ్యంతర స్థాయి) - ఇది గూగుల్ క్లౌడ్ లో అత్యంత పాపులర్ మరియు డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్.
- ఎగ్జామ్: అసోసియేట్ క్లౌడ్ ఇంజ‌నీర్ (ACE).
- ఫీజు: 125 డాల‌ర్లు. ఈ ఎగ్జామ్ ఫీజును డాలర్లలోనే వసూలు చేస్తారు. దీనికి అదనంగా టాక్స్ లు వర్తిస్తాయి.
- ఉచిత‌ మార్గం: గూగుల్ క్లౌడ్ అధికారికంగా Google Cloud Skills Boost పోర్టల్ ద్వారా ఉచిత మరియు పెయిడ్ ల్యాబ్స్ అందిస్తుంది.
- ఎవరి కోసం: కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు గూగుల్ క్లౌడ్‌లో ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారి కోసం.
- ఏం నేర్చుకుంటారు: క్లౌడ్ అప్లికేషన్లను డిప్లాయ్ చేయడం, మానిటర్ చేయడం మరియు నెట్‌వర్క్/స్టోరేజ్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేయడం.

Professional Level - Advanced - నిర్దిష్టమైన ఒక టెక్నాలజీ రోల్‌లో నిపుణుడు అవ్వడానికి ఇవి రూపొందించారు. గూగుల్‌లో కనీసం మూడేళ్ల‌ ఐటీ అనుభవం, ఏడాది గూగుల్ క్లౌడ్‌ హ్యాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనిని పొంద‌చ్చు.
- ఫీజు: అన్ని ప్రొఫెషనల్ ఎగ్జామ్స్‌కు 200 డాల‌ర్లు. ఈ ఎగ్జామ్ ఫీజును డాలర్లలోనే వసూలు చేస్తారు. దీనికి అదనంగా టాక్స్ లు వర్తిస్తాయి.
- ఉచిత‌మార్గం: గూగుల్ క్లౌడ్ అధికారికంగా Google Cloud Skills Boost పోర్టల్ ద్వారా ఉచిత మరియు పెయిడ్ ల్యాబ్స్ అందిస్తుంది.
- ఎవరి కోసం: 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ క్లౌడ్ అనుభవం ఉండి, నిర్దిష్ట విభాగంలో నిపుణులు (Experts) అవ్వాలనుకునే వారికి మంచివి.

Professional Cloud Architect: క్లౌడ్ సిస్టమ్స్ డిజైన్ మరియు సెక్యూరిటీ స్ట్రాటజీ ప్లాన్ చేసే సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం. (మార్కెట్లో దీనికి అత్యధిక ప్యాకేజీలు ఉంటాయి).
Professional Cloud DevOps Engineer: ఆటోమేషన్, CI/CD పైప్‌లైన్స్, సైట్ రిలయబిలిటీ (SRE) చూసే ఇంజనీర్ల కోసం.
Professional Data Engineer: బిగ్ డేటా, BigQuery, డేటా పైప్‌లైన్స్ బిల్డ్ చేసే డేటా ప్రొఫెషనల్స్ కోసం.
Professional Machine Learning Engineer: AI/ML మోడ‌ల్స్‌, ప్రొడక్షన్ పైప్‌లైన్స్ క్రియేట్ చేసే నిపుణుల కోసం
Professional Cloud Security Engineer: క్లౌడ్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ ప్రొటెక్షన్ చూసేవారి కోసం.

- సర్టిఫికేట్ గడువు (Validity): ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ల వ్యాలిడిటీ రెండేళ్లు మాత్రమే. తర్వాత ఫీజు కట్టి ఎగ్జామ్ రాయాల్సిందే.

#it #cloud #googlecloud #gcp #cloudcertifications #gcpcertifications #learning #cloudprofessional