కరోనా లాక్డౌన్ ఆంక్షల నుంచి ఐటీ కంపెనీలకు ప్రభుత్వం సడలిస్తోంది. 33% ఎంప్లాయిస్తో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. రద్దీ లేకుండా చిన్నగా ఆపరేషన్స్ ప్రారంభించుకోమని చెప్పారు. అయితే కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోం చేయించడానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. కారణమేంటి?
అన్ని రూల్స్ పాటించడం కష్టమే
* మూడు షిఫ్ట్లుగా ఒక్కోసారి 33% ఎంప్లాయిస్తోనే పని చేయించుకోవాలి.. ఆఫీసుల్లో ఉద్యోగులు లాగిన్ ఉదయం 7 గంటలకు, 10 గంటలకు అయితే, సాయంత్రం 3 గంటలు, 6 గంటల కల్లా లాగౌట్ కావాలని సూచించారు. ఇది కాస్త ఓకే. కంపెనీల యాజమాన్యానికి ఇబ్బంది లేదు.
* రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. 6 గంటలకు లాగవుట్ అయినవాళ్లు ఇంటికెళ్లేలోపు ఎక్కడన్నా లేటయితే పోలీసులతో ఇబ్బందని కంపెనీలు భావిస్తున్నాయి.
* ఉద్యోగులకు, క్యాబ్లకు ఇచ్చే అథరైజేషన్ లెటర్లను కేవలం ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి మాత్రమే వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఎంప్లాయీ కంపెనీ ఐడీ కార్డుతో పాటు అథారిటీ లెటర్ను కూడా క్యారీ చేయాలని చెప్పారు. రోడ్లపై వాహనాలను తగ్గించడానికి కంపెనీలు మ్యాక్సిమమ్ బస్సులనే వాడాలన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనల ప్రకారం క్యాబ్ల్లో డ్రైవర్తో పాటు ఇద్దరు ప్యాసెంజర్లే ఉండాలి. టూవీలర్స్ కు అనుమతించడం లేదు. కంపెనీ బస్సులు కూడా 50 శాతం అక్యుపెన్సీతోనే నడవాలి.
ఇలా చేస్తే కంపెనీలకు ట్రాన్స్పోర్టు బిల్లు భారీగా అవుతుంది.
* ఉద్యోగుల సీటింగ్ అరేంజ్మెంట్ల మధ్య కూడా ఆరు అడుగుల దూరం ఉండాలి. ఇది చేయదగినదే కాబట్టి ఇబ్బంది లేదు.
* ఐటీ పార్క్ లు, క్యాంపస్ల బయట ఉద్యోగులు మీటింగ్లు పెట్టడానికి వీలు లేదు.
* ఆఫీసుల్లో కెఫేటేరియా నడపకూడదు. ఐటీ కంపెనీల్లో, ఐటీ పార్క్ ల్లో కూడా సోషల్ గేదరింగ్లు ఉండకూడదు. ఈ నిబంధనలన్నింటిన్నీ హైదరాబాద్ ఐటీ కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.
వర్క్ ఫ్రం హోమే బెటరేమో?
హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలోని 1500 కంపెనీల్లో ఆరు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే బేసికల్గా ఐటీ పీపుల్ అంత రెస్ట్రిక్షన్స్ భరించరు. ఈజీ గోయింగ్ ఆలోచనలతో ఉండే వారిని ఆఫీస్కు పిలిపించి ఈ రూల్స్ అన్నీ పెట్టడం కంటే కరోనా ఉద్ధృతి తగ్గేవరకు వర్క్ ఫ్రం హోం చేయిస్తే మంచిదని ఎక్కువ కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల కంపెనీకి ఆర్థికంగానూ భారం తగ్గుతుంది.. వర్క్ విషయంలోనూ డిస్ట్రబెన్స్ ఉండదని భావిస్తున్నాయి. అలాగే క్యాంటీన్లు, కెఫెటేరియాలు తెరవకూడదనే నిబంధన కూడా వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే బయటా హోటల్స్ లేక, క్యాంటీన్లు తెరవకపోతే అత్యధిక శాతం బ్యాచిలర్లే ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడ్జస్ట్ అవడం కష్టమే అనే ఆలోచన వస్తోంది. అందుకే వర్క్ ఫ్రం హోం ఇస్తే వాళ్ల బాధలేవో వాళ్లే పడతారు. పిలిచి ఈ రూల్సన్నీ పాటించేలా చూడటం మనవల్ల ఎక్కడవుతుందని కంపెనీలు ఆలోచిస్తున్నాయట. సో ఈ లెక్కన చూస్తే ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం కల్చర్ ఇంకొంత కాలం ఇలాగే నడిచేలా ఉంది.
à°à°Ÿà±€ కంపెనీలౠవ‌రà±à°•à± à°«à±à°°à°‚ హోం క‌రోనా ఆంకà±à°·â€Œà°²à± IT companies Work from home Â