కెరీర్‌కు సెక్యూరిటీ ఇచ్చే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్లు మీకోసం

కోడింగ్‌తో ప‌నిలేకుండా.. ఏఐతో ఉద్యోగాలు పోతాయ‌నే భ‌యం లేకుండా.. మీకూ, కంపెనీకి సెక్యూరిటీ ఇచ్చే ఒక మంచి కెరీర్‌లో అడుగు పెట్టాల‌ని చూస్తున్నారా అయితే మీకు సైబ‌ర్ సెక్యూరిటీకి మించిన ఆప్ష‌న్ మ‌రొక‌టి లేదు. స‌రికొత్త సైబ‌ర్ ఎటాక్‌లు చేస్తూ టెక్ కంపెనీల‌కు స‌వాలు విసురుతున్నారు హ్యాక‌ర్లు. దీంతో సైబ‌ర్ సెక్యూరిటీ ప్రొఫెష‌న‌ల్స్‌కు డిమాండ్ విప‌రీతంగా పెరుగుతోంది. అధిక వేత‌నంతో పాటు కెరీర్‌కు, కంపెనీకి సెక్యూరిటీ క‌ల్పించే ఈ అవ‌కాశం జారిపోకుండా ఉండాలంటే సైబ‌ర్ సెక్యూరిటీ స‌ర్టిఫికేష‌న్లపై ఒక లుక్కేయాల్సిందే. 

Google Cybersecurity Professional Certificate: ఇది Coursera ప్లాట్‌ఫారమ్ ద్వారా గూగుల్ సంస్థ అందిస్తున్న ఒక పాపులర్ మరియు ఎంట్రీ-లెవెల్ ఆన్‌లైన్ కోర్స్.
- ఫీజు: Coursera సబ్‌స్క్రిప్షన్ మోడల్ పై ఆధార‌ప‌డి ఉంటుంది. నెలవారీ ఫీజు సుమారు ₹1,200 నుంచి ₹3,200 రూపాయ‌లు.
- ఉచిత మార్గం: ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు Coursera లో Financial Aid (ఉచితంగా చదువుకునే సదుపాయం) కి అప్లై చేసుకోవచ్చు.
- ఎవరికి మంచిది: సైబర్ సెక్యూరిటీలో సున్నా నుంచి మొద‌లుపెట్టాల‌నే వారి కోసం ఇది డిజైన్ చేశారు.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: నెట్‌వర్క్ సెక్యూరిటీ, లైనక్స్, పైథాన్, సైబర్ దాడుల నుండి డేటాను ఎలా రక్షించాలో తెలుసుకోవ‌చ్చు. దీనిని పూర్తి చేయడం ద్వారా జూనియ‌ర్ సైబ‌ర్ సెక్యూరిటీ అన‌లిస్ట్‌, SOC Analyst, ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ స్పెష‌లిస్ట్‌ వంటి ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


CompTIA Security+: సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్లోబల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్.
- ఫీజు: సుమారు 404 డాల‌ర్లు
- ఉచిత మార్గం: Google Cybersecurity Professional Certificate పూర్తి చేస్తే, ఈ ఎగ్జామ్ ఫీజుపై 30% డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది.
- ఎవరికి మంచిది: సైబర్ సెక్యూరిటీ రంగంలోకి ఇప్పుడే అడుగుపెట్టే ఫ్రెషర్స్ లేదా వేరే ఐటీ డొమైన్ నుండి మారాలనుకునే వారి కోసం ఇవి బెస్ట్ చాయిస్.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: నెట్‌వర్క్ సెక్యూరిటీ, థ్రెట్స్ (Threats), మరియు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో బేసిక్స్ నేర్పుతుంది. గ్లోబల్ గా దీనికి చాలా మంచి గుర్తింపు ఉంది. 


CEH (Certified Ethical Hacker): సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్లోబల్ లెవెల్లో అత్యంత పాపులర్ ఈ స‌ర్టిఫికేట్‌.
- ఫీజు: సుమారు 1,199 డాల‌ర్లు
- ఎవరికి మంచిది: కనీసం 2-3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు లేదా తమ నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వారికి మంచిది.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: దీనిని EC-Council సంస్థ అందిస్తుంది. కంపెనీ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసే ప‌ద్ధ‌తిని లీగల్ గా (Ethical గా) చేయించి.. దాన్ని ఎలా డిఫెండ్ చేయాలో (Ethical Hacking) నేర్పుతారు.


CySA+ (CompTIA Cybersecurity Analyst): నెట్‌వర్క్‌పై జరిగే దాడులను అనలైజ్ చేయడం, మాల్వేర్ ట్రాక్ చేయడం మరియు ఇన్సిడెంట్ రెస్పాన్స్ (Incident Response) మేనేజ్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
- ఫీజు: సుమారు 404 డాల‌ర్లు.
- ఉచిత మార్గం: కంపెనీలు తమ ఉద్యోగుల అప్‌స్కిల్లింగ్ కోసం ఈ ఫీజును స్పాన్సర్ (Reimburse) చేసే అవకాశం ఉంటుంది.
- ఎవరికి మంచిది: కనీసం 3-4 సంవత్సరాల ఐటీ లేదా నెట్‌వర్కింగ్ అనుభవంతో పాటు CompTIA Network+ లేదా Security+ పూర్తి చేసిన వారికి మంచిది.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: నెట్‌వర్క్‌లో దాగి ఉన్న అడ్వాన్స్‌డ్ మాల్వేర్ మరియు సైబర్ దాడులను ముందే గుర్తించే నైపుణ్యం లభిస్తుంది.


GIAC Security Essentials (GSEC): సైబర్ సెక్యూరిటీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు ప్రీమియం ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్ కోర్సు ఇది.
- ఫీజు: సుమారు 979 డాల‌ర్లు. 

- ఉచిత మార్గం: MNC కంపెనీలు తమ ఉద్యోగుల నైపుణ్యం కోసం స్పాన్సర్ (Corporate Sponsored) చేస్తాయి. 
- ఎవరికి మంచిది: ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (InfoSec) రంగంలో కనీసం 1-2 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి, సెక్యూరిటీ మేనేజర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, మరియు ఫోరెన్సిక్ అనలిస్టులకు మంచిది. 
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: మిలిటరీ/డిఫెన్స్ ప్రాజెక్ట్‌లలో ఈ సర్టిఫికేషన్ ఉన్నవారికి భారీ ప్రాధాన్యం ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్, క్రిప్టోగ్రఫీ, క్లౌడ్ సెక్యూరిటీ, మరియు నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌ను ఎలా డిజైన్ చేయాలో తెలుస్తుంది.

CISSP (Certified Information Systems Security Professional): సైబర్ సెక్యూరిటీ రంగంలో దీనిని "గోల్డ్ స్టాండర్డ్" గా భావిస్తారు.
- ఫీజు: సుమారు 749 డాల‌ర్లు. సర్టిఫికేట్ యాక్టివ్ గా ఉండటానికి ఏటా $125 డాల‌ర్లు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు కట్టాలి.
- ఉచిత మార్గం: చాలా కంపెనీలు తమ సీనియర్ ఎంప్లాయ్స్ కెరీర్ గ్రోత్ కోసం ఫీజును స్పాన్సర్ లేదా రీఇంబర్స్ చేస్తుంటాయి.
- ఎవరికి మంచిది: సైబర్ సెక్యూరిటీ విభాగంలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉన్న సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్‌కి, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్ మరియు గవర్నెన్స్‌పై పూర్తి పట్టు ఉన్నవారికి మంచిది.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: కంపెనీ మొత్తం రిస్క్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ గవర్నెన్స్, మరియు లీగల్ కాంప్లయన్స్ వంటి 8 కీలక డొమైన్లపై పట్టు వస్తుంది. US, UK, మరియు యూరప్ దేశాలలో టాప్ కంపెనీల మేనేజ్మెంట్ పొజిషన్స్ కి దీనిని ఒక బెంచ్ మార్క్‌గా చూస్తారు.


CISM (Certified Information Security Manager): సైబర్ సెక్యూరిటీ రంగంలో మేనేజ్‌మెంట్ మరియు గవర్నెన్స్ స్థాయికి వెళ్లాలనుకునే వారి కోసం రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సర్టిఫికేషన్.
- ఫీజు: దీనిని ISACA అనే సంస్థ నిర్వహిస్తుంది. ISACA మెంబర్‌షిప్‌పై ఫీజు ఆధార‌ప‌డి ఉంటుంది. ISACA మెంబ‌ర్స్‌కి సుమారు ఎగ్జామ్ ఫీజు 575 డాల‌ర్లు, నాన్-మెంబర్స్‌కి 760 డాల‌ర్లు.
- ఉచిత మార్గం: ఎగ్జామ్ ఫీజుతో పాటు స్టడీ మెటీరియల్స్ కూడా కొనుగోలు చేయాలి. చాలా MNC కంపెనీలు తమ సీనియర్ ఉద్యోగుల కోసం ఈ ఖర్చును భరిస్తాయి.
- ఎవరికి మంచిది: ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: కంపెనీ సెక్యూరిటీ పాలసీలను ఎలా డిజైన్ చేయాలో తెలుస్తుంది. ఇన్ప‌ర్మేష‌న్ సెక్యూరిటీ మేనేజ‌ర్‌, సెక్యూరిటీ డైరెక్ట‌ర్‌, రిస్క్ మేనేజ‌ర్‌, CISO (Chief Information Security Officer) పొజిషన్స్‌లోకి వెళ్ల‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.


OSCP (Offensive Security Certified Professional): ఎథికల్ హ్యాకింగ్ మరియు పెనెట్రేషన్ టెస్టింగ్ (Penetration Testing) విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన ప్రాక్టికల్ సర్టిఫికేషన్.
- ఫీజు: కోర్స్ + ఎగ్జామ్ బండిల్ (PEN-200 Course + 90 Days Labs + 1 Exam Attempt): అధికారికంగా దీని ధర 1,749 డాల‌ర్లు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయితే, మళ్లీ ఎగ్జామ్ రాయడానికి 249 డాల‌ర్లు కట్టాలి.
- ఎవరికి మంచిది: ఇది 100% ప్రాక్టికల్ ఎగ్జామ్. 24 గంటల పాటు లైవ్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. పెనెట్రేషన్ టెస్టర్ (Penetration Tester) అవ్వాలనుకునే వారికి ఇది అత్యుత్తమ సర్టిఫికేట్.
- ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది: ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ ద్వారా టూల్స్ వాడకం (Kali Linux), బఫర్ ఓవర్‌ఫ్లో, ప్రివిలేజ్ ఎస్కలేషన్, మరియు నెట్‌వర్క్ పివోటింగ్ వంటి అడ్వాన్స్‌డ్ హ్యాకింగ్ మెథడాలజీలపై పూర్తి స్థాయి పట్టు వస్తుంది.

#cybersecuritycertifications #bestcybersecuritycertifications #cybersecuritycertifications2026 #cybersecurity #cybersecuritycertificationsroadmap #it #upskilling