ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తూ కెరీర్ మారాలనుకుంటున్న వారికైనా.. ఈ రంగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకైనా ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక్క సేఫ్ అండ్ బెటర్ ఆప్షన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్. ఫిజికల్ డేటా సెంటర్ల నుంచి అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీకి మారుతున్నాయి. దీంతో క్లౌడ్ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన AWSకి డిమాండ్ పెరిగింది. దీని గురించి ప్రాథమిక అవగాహనతో పాటు AWS సర్టిఫికేషన్ కలిగి ఉంటే.. మీ ప్రొఫైల్ లేదా రెజ్యూమ్ సులువుగా రిక్రూటర్ల దృష్టిలో పడుతుందనడంలో సందేహం లేదు. మరి ఆ సర్టిఫికేషన్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
AWS Certified Cloud Practitioner (CLF-C02): క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏమిటి, క్లౌడ్‌లో ఒక సర్వర్‌ని ఎలా బిల్డ్ చేయాలి.. వంటి ప్రాథమికాంశాలపై (Fundamentals) అవగాహన కల్పిస్తుంది.
- ఫీజు (Paid): 100 డాలర్లు.
- ఉచితంగా పొందాలంటే (Free): AWS Skill Builder ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ కోర్సు, వీడియో ట్రైనింగ్ పూర్తిగా ఉచితం. మీరు పనిచేసే కంపెనీ AWS కి అధికారిక పార్ట్‌నర్ అయి ఉంటే, వారికి ప్రత్యేక కార్పొరేట్ వోచర్లు వస్తాయి. వీటితో 100% ఫీజు ఉచితం.
- ఎవరికి మంచిది: కాలేజ్ పూర్తి చేసుకుని సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగు పెట్టాలనే ప్రెషర్స్, గ్రాడ్యుయేడ్స్‌కి మంచిది.
- ఎలా ఉపయోగం: క్లౌడ్ బేసిక్స్‌పై మీకు పూర్తి అవగాహన ఉంది అని రిక్రూటర్స్‌కి తెలియజేస్తుంది.
AWS Certified Solutions Architect – Associate (SAA-C03): AWSలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన అప్లికేషన్లను ఎలా డిజైన్ చేయాలో ఇందులో నేర్చుకోవచ్చు. ఐటీలో స్థిరమైన ఉద్యోగానికి ఇది మంచి కోర్సు.
- ఫీజు (Paid): 150 డాలర్లు.
- ఉచిత మార్గం (Free): కోర్సు మెటీరియల్స్ AWS లో ఉచితంగా లభిస్తాయి. మీరు పనిచేసే కంపెనీ AWS కి అధికారిక పార్ట్‌నర్ అయి ఉంటే, వారికి ప్రత్యేక కార్పొరేట్ వోచర్లు వస్తాయి. వీటితో 100% ఫీజు ఉచితం.
- ఎవరికి మంచిది: AWSలో కనీసం రెండేళ్లు పనిచేసిన వారికి మంచి ఆప్షన్.
- ఎలా ఉపయోగం: క్లౌడ్ ఇంజనీర్ నుంచి ఆర్కిటెక్ట్ స్థాయికి ఎదిగేందుకు, క్లౌడ్‌లో అప్లికేషన్ డెప్లాయ్‌మెంట్, సెక్యూరిటీ గురించి తెలుసుకుకోవడానికి మంచిది.
Solutions Architect Pro / DevOps Pro / Security Specialty: ఇది అడ్వాన్స్‌డ్ స్థాయి కోర్సు. AWS అందించే అత్యున్నత స్థాయి (Advanced Level) ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు ఇవి.
- ఫీజు (Paid): 300 డాలర్లు.
- ఉచిత మార్గం (Free): కోర్సు మెటీరియల్స్ AWS లో ఉచితంగా లభిస్తాయి. మీరు పనిచేసే కంపెనీ AWS కి అధికారిక పార్ట్‌నర్ అయి ఉంటే, వారికి ప్రత్యేక కార్పొరేట్ వోచర్లు వస్తాయి. వీటితో 100% ఫీజు ఉచితం.
- ఎవరికి మంచిది: AWSలో కనీసం 3 నుండి ఐదేళ్ల అనుభవం ఉన్న క్లౌడ్ ఆర్కిటెక్ట్లు, టెక్ లీడ్స్, మరియు సిస్టమ్ డిజైనర్స్ వంటి వారికి ఇది ఉపయోగం.
- ఎలా మంచిది: వందలాది AWS అకౌంట్లను ఒకేసారి డిజైన్ చేసి మేనేజ్ చేయడానికి, క్లౌడ్‌కి ఫిజికల్ డేటా సెంటర్ మైగ్రేషన్ చేయడానికి ఉపయోగం.
#software #aws #cloud #certifications #cloudcertifications #awscertifications