ఒకప్పుడు ఎంతో బాగా ఉన్న ఫోటోగ్రఫీ పరిశ్రమ స్మార్ట్ ఫోన్ ల రాకతో కొంచెం నెమ్మదించింది అనే చెప్పాలి. చాలామంది ఫోటోగ్రాఫర్ లు ఆ వృత్తిని వదిలివేసి వేరే పనులూ, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఫోటోగ్రఫీ పట్ల ప్యాషన్, అంకితభావం కలిగిఉండి మారుతున్న టెక్నాలజీ ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న ఫోటోగ్రాఫర్ లు ఈ రంగం లో ఇంకా రాణిస్తూనే ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే ప్రస్తుతం వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కి విపరీతమైన డిమాండ్ ఉన్నది. గత సంవత్సరం అమెరికా లో వెడ్డింగ్ పరిశ్రమ యొక్క విస్తృతి 72 బిలియన్ డాలర్ లకు చేరుకుంది అంటే దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెడ్డింగ్ ప్లానింగ్ లో ఫోటోగ్రఫీ కూడా ఒక భాగం కాబట్టి ఇందులో కూడా మంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఒక్క అమెరికా అని మాత్రమే కాదు గానీ మన దేశం లో కూడా ఈ పరిశ్రమ లో బాగానే సంపాదించుకోవచ్చు. మీకు ఫోటోగ్రఫీ పై తక్కువ అవగాహన ఉన్నాసరే కొన్ని మంచి ఎక్విప్ మెంట్ లను చక్కగా వినియోగించడం ద్వారా ఈ రంగం లో విశేషంగా రాణించవచ్చు. అ వివరాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మంచి కెమెరా
మీరు ఇప్పటికే ఫోటో గ్రాఫర్ అయినట్లయితే మీ దగ్గర ఒక కెమెరా ఉండే ఉంటుంది కదా! ఒక మంచి కెమెరా ను కలిగి ఇండడం అనేది ఇందులో ప్రాథమిక అంశం గా చెప్పుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్ కెమెరా వాడుతున్నారు అనేది అంత ముఖ్యం కాదు గానీ ఏ మోడల్ వాడుతున్నరనేదే ముఖ్యమైన అంశం. మీ కెమెరా ఖచ్చితంగా అప్ గ్రేడ్ అవ్వాల్సిందే. నికాన్ D850 మరియు కానన్ EOS రెబెల్ T7i కెమెరా లు 2018 వ సంవత్సరం లో అత్యుత్తమ కెమెరా లుగా చెప్పుకోవచ్చు.
బిజినెస్ లైసెన్స్
మీ దగ్గర వ్యాపార లైసెన్స్ ఉండడం ఎందుకైనా మంచిది. మన దేశం లో చాలావరకూ ఫోటోగ్రాఫర్ లకు లైసెన్స్ అనేది అవసరం లేకుండానే పని జరుగుతుంది. అయితే లైసెన్స్ ను కలిగి ఉండడం వలన మీరు చేసే పనిని లీగల్ గా చేసినవారు అవుతారు. మరియు ఈ రంగం లో ఉన్న అసోసియేషన్ ల మద్దతు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది.
వెబ్ సైట్
ఏ రంగం లోనైనా మౌత్ పబ్లిసిటీ అనేది ఒక పవర్ ఫుల్ మార్కెటింగ్ మాధ్యమం. ప్రత్యేకించి ఫోటోగ్రఫీ పరిశ్రమ లోనైతే దాదాపు అన్ని కాంట్రాక్టు లూ ఇలాగే జరుగుతాయి. అయితే మీ వ్యాపారానికి సంబంధించి ఒక వెబ్ సైట్ ను కలిగి ఉండడం ద్వారా కూడా మేరు చేసే పని లో నాణ్యత ను క్లయింట్ లకు చూపించవచ్చు. తద్వారా కూడా మీకు మరింత ఎక్కువమంది కస్టమర్ లు వచ్చే అవకాశం ఉంటుంది.
ఫోటో షాప్ , లైట్ రూమ్ మరియు ఎడిటింగ్ సాఫ్ట్ వేర్
కొన్ని షాట్ లు సహజంగానే చాలా అందంగా వస్తాయి. కానీ కొన్నింటికి మాత్రమే ఎడిటింగ్ అవసరం అవుతుంది. కలర్ మరియు లైటింగ్ అడ్జస్ట్ మెంట్ లు చేయడం ద్వారా కొన్ని ఫోటో లకు మరింత అదనపు అందాన్ని తీసుకురావచ్చు. దీనికోసం ప్రత్యేకమైన ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ అవసరం అవుతుంది. అలాగే ఫోటో షాప్ మరియు లైటింగ్ రూమ్ ఉండడం వలన కూడా మీరు తీసే ఫోటో లకు మరింత అందాన్ని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ట్రిపోడ్
దీని అవసరo వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో చాలా తక్కువగా ఉంటుంది. అయితే గ్రూప్ ఫోటో లు, లాంగ్ ఎక్స్ పోజర్ లు, ఇండోర్ ఫోటో గ్రాఫ్ ల విషయం లో ఇది ఉపయోగపడుతుంది. వీటిలో అనేకరకాలు ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్లు సరైన ట్రిపోడ్ ను ఎంచుకోవాలి.
మల్టిపుల్ లెన్స్
మీరు చేస్తున్న ప్రోగ్రాం మొత్తం ఒకే లెన్స్ తో షూట్ చేయడం సాధ్యం అవుతుంది కానీ దీనివలన మీ సామర్థ్యానికి పరిమితి ఏర్పడుతుంది. అనుకున్నంత ఎఫెక్టివ్ గా రాకపోవచ్చు. అందువలన మల్టిపుల్ లెన్స్ ను కలిగిఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. వీటివలన వివిధ రకాల యాంగిల్ లలో ఫోటోలు తీయడం వీలు అవుతుంది.
మల్టిపుల్ హై కెపాసిటీ మెమరీ కార్డ్స్
రోజుకి మీరు కొన్ని వందల సంఖ్య లో ఫోటోలను తీస్తారు. దీనివలన మీ మెమరీ కార్డ్స్ చాలా తొందరగా పూర్తి అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ప్రోగ్రాం మధ్య లో మెమరీ కార్డు నిండి పోతే తిరిగి వేరే దానిని మార్చే లోపు మంచి ఫోటో లు మిస్ అవ్వవచ్చు. లేదా మెమరీ కోసం కొన్ని ఫోటో లను డిలీట్ చేసే అవకాశం రావచ్చు. అసలు హై కెపాసిటీ మెమరీ కార్డు లను వాడడం వలన ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు.
wwedding photography camera lens photoshop editing software lighting room multiple lens