జీమెయిల్ రైట్ క్లిక్ చేస్తే సరికొత్త ఆప్సన్లు, పూర్తి వివరాలు మీకోసం


టెక్ గెయింట్ గూగుల్ రోజు రోజుకు సరికొత్త అప్ డేట్లను అందిస్తూ వస్తోంది. నిన్న గూగుల్ మ్యాప్ లో కొన్ని కొత్త ఆప్సన్లను జోడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా గూగుల్ జీమెయిల్ ో పలు ఆప్షన్లను జోడించింది. ఇంతకు ముందు జీ మెయిల్ లో  ఏదైనా మెయిల్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆర్కైవ్, మార్క్ యాజ్ రీడ్, డిలిట్ ఆప్షన్స్ కనిపించేవి. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ ఆప్షన్లు మారబోతున్నాయి. సరికొత్త ఫీచర్లు యాడ్ కానున్నాయి

మెయిల్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆర్కైవ్, మార్క్ యాజ్ రీడ్, డిలిట్ ఆప్షన్లతో పాటు లేబుల్ యాడింగ్, మూవింగ్, మ్యూటింగ్, స్నూజ్ లాంటి కొత్త ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.ఈ మేరకు జీమెయిల్‌లో మార్పులు చేసింది గూగుల్. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. మెయిల్‌ను కొత్త విండోలో ఓపెన్ చేయాలన్నా చివర్లో Open in new window ఆప్షన్ ఉంటుంది. అంతేకాదు రిప్లై, రిప్లై ఆల్, ఫార్వర్డ్ ఆప్షన్లు కూడా టాప్‌లో కనిపిస్తాయి. యూజర్లకు జీ సూట్ అప్‌డేట్స్ అన్నీ ఫిబ్రవరి 22న అందుబాటులోకి వస్తాయి.

న్యూస్ టెక్నాలజీ గూగుల్ జీమెయిల్ సోషల్ మీడియా