ప్రస్తుతం మొబైల్ రంగంలో 4జీ యుగం నడుస్తుండగానే.. కొన్ని కంపెనీలు 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. క్వాల్‌కామ్, హువాయి వంటి కంపెనీలు ఇప్పటికే 5జీ మోడెమ్‌లను లాంచ్ చేసేశాయి. అత్యధిక వేగంతో నెట్ యాక్సెస్‌తో పాటు అనేక అత్యాధునిక ఫీచర్లు గల ఈ 5జీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయో మీకు తెలియదా? అయితే మీలాంటి వారి కోసమే ఈ 5జీ ఫోన్ల జాబితా..
మోటో జడ్3 + 5జీ మోటో మాడ్
మోటో మాడ్(సూపర్ జూమ్ కెమెరాతో పాటు బూమ్ బాక్స్, ప్రొజెక్టర్) ఫీచర్లతో 2018లో మోటో జడ్3 మోడల్‌ని లాంచ్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 5జీ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసుకునేందుకు 5జీ మోటో మాడ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజాన్.. ఈ 5జీ సర్వీసులను అందిస్తోంది. క్వాల్‌కామ్ 845 మొబైల్ ఫ్లాట్‌ఫాంతో పనిచేస్తుంది. 5జీ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేసేందుకు 6హెడ్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మోటో మాడ్‌లో 2వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాటరీ ఉంటుంది. టైప్-సీ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 7.1 మిల్లీమీటర్ల మందం గల ఈ మోటో మాడ్.. 127 గ్రాముల బరువు ఉంటుంది. మోటో జెడ్3 ఫోన్.. 6.75 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. రానున్న రోజుల్లో 30 నగరాల్లో 5జీ అల్ట్రా వైడ్ బ్యాండ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను వెరిజాన్ అందించబోతోంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 5జీ
గెలాక్సీ ఎస్10, ఎస్ 10 ప్లస్‌తో పాటుగా గెలాక్సీ ఎస్ 10 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తున్నట్లు దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ ప్రకటించింది. కొద్ది రోజులకు తొలి 5జీ స్మార్ట్ ఫోన్‌ను దక్షిణ కొరియాలో లాంచ్ చేసింది. ప్రపంచంలో తొలి కమర్షియల్ 5జీ స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఇది మే 16 నుంచి అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. మోటో జెడ్3 యూజర్లలానే గెలాక్సీ ఎస్ 10 యూజర్లకు కూడా 5జీ సర్వీసులను వెరిజాన్ ఉచితంగా అందిస్తోంది. 6.7 అంగుళాల AMOLED డిస్ల్పే గల ఈ స్మార్ట్‌ఫోన్ క్వార్డ్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. 7ఎన్ఎం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 మొబైల్ ప్లాట్‌ఫాంతో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ గల స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. 25డబ్యూ ఫాస్ట్ చార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. రెండు సిమ్‌లతో పాటు మెమొరీ కార్డు సదుపాయం కూడా ఉంది. ఎస్ 10 ప్లస్‌లో మాదిరిగానే.. వెనుక మూడు కెమెరాలు, ముందు భాగంలో డ్యుయెల్ కెమెరాలు ఉంటాయి. అంతేగాక ముందు, వెనుక భాగంలో ToF 3D sensor అమర్చారు. అమెరికాలో వెరిజాన్ వెబ్‌సైట్‌లో 1300 అమెరికన్ డాలర్లకు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అంటే సుమారు 93 వేల రూపాయలన్నమాట.
హువాయి మేట్ ఎక్స్ 5జీ
ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఎండబ్ల్యూసీ-2019లో హువాయి ప్రకటించింది. దీనిని గత ఏడాది జూలైలో చైనాలో లాంచ్ చేసింది. అయితే దీని ధరను మాత్రం హువాయి
ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఇందులో HiSilicon Kirin 980 చిప్‌సెట్‌తో పాటు 7nm FinFET నాడ్‌తో పాటు Balong 5000 5G మోడెమ్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ ఉంటుంది. నానో మెమొరీ కార్డు సాయంతో స్టోరేజీని పెంచుకోవచ్చు. సాధారణంగా 8 అంగుళాలుండే ఈ భారీ ఓఎల్ఈడీ డిస్ల్పే గల ఫోన్.. ఫోల్డ్ చేసినప్పుడు ముందు 6.6, వెనుక 6.38 అంగుళాలు ఉంటుంది. వెనుక 40 ఎంపీ ప్రైమరీ, 16ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 8 అంగుళాల టెలీఫొటో కెమెరా ఉంటాయి. డిస్ల్పే మడిచిన సమయంలో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. 4,500 ఎంఏహెచ్ నాన్ రిమూవల్ బ్యాటరీ గల ఈ ఫోన్.. 55W ఫాస్ట్ సూపర్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఎల్‌జీ వి450 థిన్ క్యూ
ఎల్‌జీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటైన LG V50 ThinQ.. 5జీని సపోర్ట్ చేస్తుంది. దక్షిణ కొరియాలో దీనిని ఆవిష్కరిచాలని తొలుత ఎల్‌జీ భావించినా.. చివరి నిమిషంలో ఈ ప్రక్రియను వాయిదా వేసింది. మరింత మెరుగైన సర్వీసును అందించేందుకు స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 5జీ మోడెమ్, స్నాప్‌డ్రాగన్ 855 మొబైల్ ప్లాట్ ఫామ్‌పై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పేర్కొంది. అతి త్వరలోనే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 6.4 అంగుళాల AMOLED ఈ క్వార్డ్ హెచ్‌డీ డిస్ల్పేతో ఉండనుంది. అయితే ఫోన్‌లో సెకండరీ డిస్ల్పే కూడా ఉంటుందని ఎల్‌జీ తెలిపింది. ఇందులో 7nm Qualcomm Snapdragon 855 Mobile Platform, 6GB of LPDDR4x ర్యామ్, 28GB of UFS 2.1 ఫ్లాష్ స్టోరేజీ ఉంటుంది. మెమొరీకార్డు సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు. 12+16+12 ఎంపీ గల ట్రిపుల్ కెమెరాలు వెనుక భాగంలో, 8MP + 5MP డ్యుయెల్ కెమెరాలు ముందు భాగంలో ఉంటాయి.
ఒప్పో రెనో 5జీ
దిగ్గజ టెలీకాం కంపెనీలతో పోటీపడుతున్న ఒప్పో కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ స్మార్ట్‌ఫోన్‌కి అదనంగా 5జీ మోడెమ్‌ను జత చేసి.. ఒప్పో రెనో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.6 అంగుళాలు గల ఈ ఫోన్‌లో నాచ్ డస్ల్పేతో పాటు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉండనుంది. పాప్ అప్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. Qualcomm Snapdragon 855 Mobile Platformతో పాటు Kryo 485 CPU ఉండనుంది, Adreno 640 GPU, Snapdragon X50 5G modem ఉండే ఈ ఫోన్.. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ 9.0 పైతో పాటు కలర్స్ ఓఎస్ 6.0 మీద రన్ అవుతుంది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. f/1.7 aperture గల 48ఎంపీ సోనీ IMX586 కెమెరా ప్రధానమైనది. ముందు భాగంలో f/2.0 apertureతో 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4,065 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ప్రస్తుతం చైనా, స్విట్జర్లాండ్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధర.. 899 యూరోలు.. అంటే మన కరెన్సీలో రూ.70,400.
షామీ ఎంఐ మిక్స్3
ఎండబ్ల్యూసీ-2019లో ఈ 5జీ ఫోన్‌ను షామీ లాంచ్ చేసింది. ఇది గత ఏడాది విడుదల చేసిన `మి మిక్స్3` తరహాలోనే ఉన్నా.. తర్వాత స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్‌ని అదనంగా జోడించి ఎంఐ మిక్స్3 5జీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూరప్‌లో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈ ఫోన్ ధర 599 యూరోలు.. అంటే 47,800 రూపాయలు. 6.39 అంగుళాల పొడవు గల ఫుల్ హెచ్‌డీ డిస్ల్పే గల ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 855 మొబైల్ ప్లాట్‌ఫాంపై రన్ అవుతుంది. ఇందులో 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10డబ్ల్యూ క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. 6జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ లేదా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఎంఐయూఐ కొత్త వెర్షన్ 10 తో పాటు ఆండ్రాయిడ్ `పై` మీద పనిచేస్తుంది. వెనుక భాగంలో 12 ఎంపీ డ్యుయెల్ కెమెరా ఉంటుంది. స్లో మోషన్ వీడియోలు కూడా తీసుకోవచ్చు. ముందు భాగంలో 24 ఎంపీ+2ఎంపీ డ్యుయెల్ కెమెరా ఉంది.
హువాయి మేట్ 20 ఎక్స్
హువాయి నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. తొలి 5జీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఖరీదు దాదాపు 2వేల డాలర్లు. దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండే మరో ఫోన్‌ను హువాయి మార్కెట్‌లోకి విడుదల చేసింది. గత ఏడాది విడుదల చేసిన మేట్ 20 ఎక్స్ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేసి.. మేట్ 20 ఎక్స్ 5జీగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో Balong 5000 multi-mode 5G చిప్‌సెట్‌ను అమర్చారు. 7.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ల్పే గల ఈ ఫోన్.. వాటర్ డ్రాప్ నాచ్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 5వేల ఎంఏహెచ్ గల భారీ బ్యాటరీని అమర్చారు. ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. వెనుక ట్రిపుల్ కెమెరా(40 ఎంపీ, 20 ఎంపీ, 8 ఎంపీ); ముందు భాగంలో 24 ఎంపీ కెమెరా ఉండనుంది.
Moto Z3 + 5G Moto Mod LG V50 ThinQ Huawei Mate X 5G Samsung Galaxy S10 5G OPPO Reno 5G Huawei Mate 20 X 5g mobiles