ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గూగుల్ కొత్త వెర్షన్ విడుదల చేసినప్పుడల్లా తిను బండారమో, తీపి పదార్థం పేరో పెడుతూ ఉంటుంది. అయితే ఈ సంప్రదాయానికి ఆండ్రాయిడ్ ఈసారి ముగింపు పలికింది. ఇకపై అలాంటి పదాలను కాకుండా కొత్తగా పెట్టే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా కొత్త వెర్షన్ పేరును మార్చివేసింది. ఇప్పటివరకూ వస్తున్న వెర్షన్ల క్రమం ప్రకారం దీని కొత్త వెర్షన్ క్యూ అక్షరంతో ప్రారంభం కావాలి. అయితే దీనికి ముగింపు పలుకుతూ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే కొత్త ఎడిషన్‌ను ఆండ్రాయిడ్ 10గా నామకరణం చేసింది.
నిజానికి ఈ వెర్షన్ 17వది అయినప్పటికీ అందరికీ సులభంగా తెలిసేలా దీనికి ఆండ్రాయిడ్ 10 అని పేరు పెట్టింది. అయితే లెటర్స్ తో వచ్చే పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అర్థం కావడం లేదని మాకు గత కొన్నేళ్లుగా ఫీడ్ బ్యాక్ వస్తోందని అందుకే కొత్తగా మార్చివేసామని గూగుల్ చెబుతోంది. ఇదిలా ఉంటే కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌కు పేరు పెట్టేందుకు గూగుల్ ఒక ఒపీనియన్ పోల్ కూడా నిర్వహించింది. అందులో అది 'క్యూ' అక్షరంతో వచ్చే కొన్ని పేర్లు ఇచ్చి, వాటిలో ఒకటి ఎంపిక చేయమంది. అయితే దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆండ్రాయిడ్ 10 అని పేరు ఫిక్స్ చేసింది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± à°•à±à°¯à±‚ ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± 10 ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± ఆపరేటింగౠసిసà±à°Ÿà°‚