స్మార్ట్ఫోన్లలో మనకు కచ్చితంగా బ్రౌజర్ ఉండాల్సిందే. లేకపోతే ఇంటర్నెట్ను ఆపరేట్ చేసే అవకాశం ఉండదు. ఇందుకు చాలా బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంఐ ఫోన్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన బ్రౌజర్‌ను తయారు చేసింది. దీనిలో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
వేగంగా స్క్రోలింగ్
మనం ఫోన్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి పట్టేసినట్లు అవుతుంది. దీనికి కారణంగా బ్రౌజర్ సరిగా లేకపోవడమే. కానీ ఎంఐ బ్రౌజర్లో ఈ ఇబ్బంది లేదు. మీకు స్క్రోలింగ్ చాలా వేగంగా అయిపోతుంది. మీరు ఒక వెబ్ పేజీని ఓపెన్ చేసిప్పుడు కింద భాగంలో ఉన్న మేటర్ని చూడాలనుకుంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. స్క్రీన్ హోల్డ్ చేసి స్క్రోల్ చేస్తే చాలు. చాలా వేగంగా స్క్రోలింగ్ అవుతుంది. దీని వల్ల మనకు పని కూడా వేగంగా జరుగుతుంది. సమయం కూడా వృథా కాదు.
హోమ్ స్క్రీన్ నుంచి సెర్చ్ ఇంజన్ ఛేంజ్ చేయడం
ఎంఐ బ్రౌజర్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే హోమ్ స్క్రీన్ నుంచే సెర్చ్ ఇంజన్ని మార్చడం. గూగుల్, బింగ్, యాహూ లాంటి సెర్చ్ ఇంజన్లను మనం ఎంఐ బ్రౌజర్ నుంచి చేరుకోవచ్చు. ఇందుకోసం ఎంఐ బ్రౌజర్ హోమ్ స్క్రీన్ మీద ఉన్నగ్లోబ్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చిన సెర్చ్ ఇంజన్ని ఎంపిక చేసుకోవాలి.
టర్న్ ఆఫ్ ఫీడ్
ఎంఐ బ్రౌజర్లో లేదా హోమ్ స్క్రీన్‌లో డేటా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డేటాను మనం నేరుగా ఆఫ్ చేయడం కుదరదు. అయితే స్టార్ట్ పేజీని ఛేంజ్ చేయడం ద్వారా ఈ డేటాను డిజేబుల్ చేయచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి త్రి బార్ ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ సెట్ స్టార్ట్ పేజీ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన వెబ్ పేజీని ఎంపిక చేసుకోవాలి.
ఛేంజ్ డౌన్లోడ్ లొకేషన్
ఎంఐ బ్రౌజకర్లో మీకు డౌన్లోడ్ లొకేషన్ ఛేంజ్ చేయడం చాలా సులభం. దీని కోసం ఎంఐ సెట్టింగ్స్‌లోకి వెళ్లి త్రి బార్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ లొకేషన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఒక ఫోల్డర్ పెట్టకుని ప్రత్యేకంగా లొకేషన్ ఛేంజ్ చేసుకోవచ్చు.
Mi Browser Tips Tricks google