చీప్ అండ్ బెస్ట్ సూత్రంతో ఇండియన్ మార్కెట్లో గట్టిపట్టు సంపాదించింది షియోమి. చైనా బ్రాండ్ అయినా ఇండియన్ యూజర్లను గట్టిగా ఆకట్టుకుంది. శాంసంగ్ లాంటి లెజెండ్స్ను తలదన్ని ఒకానొక దశలో నెంబర్ వన్ పొజిషన్లో కూర్చుంది. అలాంటి షియోమి పేరుతో ఇప్పుడు బోల్డన్ని ఫేక్ వెబ్సైట్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా అవి మీ జేబుకు చిల్లు పెట్టడం ఖాయం. షియోమి ఒరిజినల్ వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్ల మధ్య తేడా ఏమిటో గుర్తించేందుకు ఈ టిప్స్ పాటించండి.
10 కోట్ల షియోమి ఫోన్లు
ఇండియాలో 10 కోట్ల షియోమి ఫోన్లు అమ్మామని గత ఏడాది సెప్టెంబర్లోనే ఆ సంస్థ ప్రకటించింది. ఇండియాలో 40 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఇండియాలో ప్రతి నాలుగు స్మార్ట్ఫోన్లలో ఒకటి షియోమీదేనన్నమాట. సహజంగానే ఇన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నప్పుడు వాళ్లను బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు కూడా రెడీగా ఉంటారు. అందుకే షియోమి లేదా ఎంఐ పేరిట ఇప్పుడుఎన్నో నకిలీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి.
ఎలా గుర్తుపట్టాలి?
* నకిలీ షియోమి వెబ్సైట్లు https://www.mi-home.in/. తో ప్రారంభమవుతాయి. అయితే ఇండియాలో షియోమి ఒరిజిలన్ వెబ్సైట్ mi.com అని ఉంటుంది. https://www.mi-home.in/. అని ఉంటే అది ఫేక్ వెబ్సైట్
* నకిలీ షియోమి వెబ్సైట్ రెడ్మీ నోట్ 9 ప్రో, పోకో ఎక్స్2 వరకు లేటెస్ట్గా లాంచ్ అయిన అన్ని షియోమి, పోకో ఫోన్లన్నింటినీ వెబ్సైట్లో చూపిస్తుంది. కానీ పోకో ఇప్పుడు షియోమి సబ్ బ్రాండ్ కాదు. కాబట్టి ఒరిజినల్ వెబ్సైట్లో పోకో ఫోన్లు ఉండవు. కాబట్టి పోకో ఫోన్లను చూపిస్తే అది నకిలీ షియోమి వెబ్సైటే.
* ఒరిజినల్ సైట్తో పోల్చితే నకిలీ షియోమి వెబ్సైట్ చాలా గందరగోళంగా ఉంటుంది. సైట్ అలైన్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కార్ట్ను చూస్తే నకిలీ సైట్లలో అది ఎప్పుడూ లోడవుతూనే ఉంటుంది.
* ఫేక్ వెబ్సైట్లలో గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. కొద్దిగా నిశితంగా పరిశీలించగలిగితే మీరు దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు.
* వెబ్సైట్ కింద భాగంలో డెవలపర్ వివరాల కోసం చెక్ చేయండి.
* కంపెనీ అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్ఫాంకి వెళితే మీరు ఒరిజినల్ వెబ్సైట్ను ఈజీగా గుర్తించవచ్చు
Fake Xiaomi websites fake wbesites Xiaomi websites cyber crime న‌కిలీ షియోమీ వెబà±â€Œà°¸à±ˆà°Ÿà±â€Œ సైబ‌రౠకà±à°°à±ˆà°®à±â€Œ సైబ‌రౠనేరాలౠఫేకౠషియోమీ వెబà±â€Œà°¸à±ˆà°Ÿà±à°¸à±â€Œ