ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్ ప్లాన్ల వివ‌రాలు మీకోసం..

ఎయిర్‌టెల్ త‌న యూజ‌ర్ల‌కు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఏడాది పాటు ఫ్రీగా అందించ‌బోతోంది. అయితే సెలెక్టివ్ ప్లాన్ల మీదే ఈ ఆఫ‌ర్ ఉంటుంది. కొన్ని ప్రీపెయిడ్‌, మ‌రికొన్ని పోస్ట్‌పెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ఫ్లాన్ల మీద అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది.  పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఫ్రీగా అందిస్తుంది.  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలంటే నెల‌కు 129 రూపాయ‌లు లేదా ఏడాదికి 999 రూపాయ‌లు చెల్లించాలి. అయితే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి దీన్ని ఫ్రీగా అందిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ బెనిఫిట్స్‌
* అమెజాన్ వెబ్‌సైట్‌లో  ఏదైనా వ‌స్తువు కొంటే ఎలాంటి అద‌న‌పు చార్జీ లేకుండా ఒక‌టి, రెండు రోజుల్లోనే వ‌స్తువు  డెలివ‌రీ అవుతుంది.
* అమెజాన్‌లో సేల్ ఆఫ‌ర్లు పెట్టిన‌ప్పుడు మిగిలిన‌వారికంటే ఒక‌టి రెండు రోజుల ముందే ప్రైమ్ మెంబర్ల‌కు అవ‌కాశం ఇస్తుంది.
* అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు ఫ్రీగా చూడొచ్చు.
* అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఫ్రీగా విన‌వ‌చ్చు.
* అమెజాన్ ప్రైమ్‌లో ఈ బుక్స్ ఫ్రీగా చ‌దువుకోవ‌చ్చు. 
 
అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవిగో 
 1) ఎయిర్‌టెల్ 349 ప్రీ‌పెయిడ్ ప్లాన్
* అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా ఇస్తున్న ఏకైక ప్రీపెయిడ్ ప్లాన్ ఇది
 * వ్యాలిడిటీ 28 రోజులు. 
* అన్‌లిమిటెడ్ కాల్స్ 
*  రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 
* ఈ వ్యాలిడిటీతోపాటు అమెజాన్ ప్రైమ్ ఫ్రీ మెంబ‌ర్‌షిప్ కూడా అయిపోతోంది. మీరు రీఛార్జి చేయించుకోగానే మ‌ళ్లీ ఫ్రీ మెంబ‌ర్‌షిప్ వ‌స్తుంది.  

2) ఎయిర్‌టెల్ 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
* ఈ ప్లాన్‌లో నెల‌కు 75 జీబీ డేటా ఇస్తుంది. 
* రోజుకు 100 ఎస్ఎంస్‌లు వ‌స్తాయి.
* అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ

3) ఎయిర్‌టెల్  749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
* ఈ ప్లాన్‌లో నెల‌కు 125 జీబీ డేటా ఇస్తుంది. 
* డేటా మిగిలిపోతే త‌ర్వాత నెల‌కు క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు.
* 100 ఎస్ఎంస్‌లు వ‌స్తాయి.
* అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్  

4) ఎయిర్‌టెల్ 999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
5) ఎయిర్‌టెల్ 1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు కూడా ఈ అమెజాన్ ప్రైమ్ ఫ్రీ మెంబ‌ర్ షిప్ ఆఫ‌ర్ వ‌స్తుంది. 

ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ ఫ్రీ ఆఫ‌ర్‌ అమెజాన్ ప్రైమ్ ఫ్రీ మెంబ‌ర్‌షిప్‌ Amazon Prime Free Subscription Amazon Prime Free  Airtel  Amazon free offer