జియోలో ఫేస్బుక్ పెట్టుబడి తర్వాత వొడాఫోన్ లో గూగుల్ పెట్టుబడి

టెలికం రంగంలో జియో సంచల‌నాల‌కు మారుపేరుగా నిలిచింది.  ఎప్పుడైతే జియో ఫేస్‌బుక్‌తో టై అప్ అయిందో అప్ప‌టి నుంచి అంత‌ర్జాతీయ స్థాయి సంస్థ‌ల క‌ళ్ల‌న్నీ ఇండియ‌న్ టెలికం సెక్ట‌ర్ మీద ప‌డ్డాయి.  ఫేస్‌బుక్ జియోల వాటా కొన్న నెల రోజుల్లోనే నాలుగు అంత‌ర్జాతీయ కంపెనీలు జియో వెంట ప‌డి మ‌రీ వాటాలు కొనేశాయి. ఇప్పుడు ఇక వొడాఫోన్ ఐడియా వంతు వ‌చ్చింది. అదీ అలాంటి ఇలాంటి కంపెనీ కాదు ఏకంగా టెక్ దిగ్గ‌జం గూగుల్ వొడాఫోన్ ఐడియాలో వాటా కొనడానికి సిద్ధ‌మ‌వుతోంది. 

5% వాటా కొంటుందా?
ఐఎన్ఏఎస్ అనే న్యూస్ ఏజెన్సీ క‌థ‌నం ప్ర‌కారం గూగుల్ వొడాఫోన్ ఐడియాలో 5% వాటా కొన‌బోతోంది.  ఆదిత్య‌బిర్లా కంపెనీకి చెందిన ఐడియా, వొడాఫోన్ గ‌తేడాది ఒక్క‌ట‌య్యాయి. ఈ కంపెనీలో వాటా కోసం గూగుల్ సంప్రదిస్తున్న‌ట్లు స‌మాచారం. 

జియోలో కొందామ‌ని ట్రై చేసి..
వాస్త‌వానికి గూగుల్ మాతృసంస్థ‌, మ‌న స‌త్యా నాదెళ్ల సీఈవోగా ప‌ని చేస్తున్న ఆల్ఫాబెట్.. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే అదే స‌మ‌యానికి ఫేస్‌బుక్ వ‌చ్చి దాదాపు 43వేల కోట్ల రూపాయ‌లు చెల్లించి 9.99% వాటాను కొనేసింది. దీంతో గూగుల్ ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గింది. 

జియోకు పోటీగానేనా? 
గూగుల్‌కు టెక్నాల‌జీలో స‌వాల్ విసురుతున్న ఫేస్‌బుక్ జియోలో వాటా కొనేస‌రికి త‌మ‌కు కూడా ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీలో భాగం ఉండాల‌ని గూగుల్ భావించింద‌ని, అందుకే వొడాఫోన్ ఐడియాలో క‌నీసం 5% షేర్ కొనాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం 

ఊపిరి పీల్చుకోనున్న వొడాఫోన్‌
గూగుల్ లెక్క‌ల్ని కాసేపు పక్క‌న‌పెడితే.. ఈ డీల్ వ‌ర్క‌వుట్ అయితే వొడాఫోన్ ఐడియా నెత్తిన పాలు పోసిన‌ట్లే.   ఎందుకంటే వొడాఫోన్ ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉంది.  కేంద్ర ప్ర‌భుత్వానికి ఏజీఆర్ బ‌కాయిలే రూ.53వేలు క‌ట్టాలి.  ఇప్ప‌టికిప్పుడ రిలీఫ్ కావాల‌న్నా అర్జెంట్‌గా 6,854 కోట్లు కావాలి.  ఈ ప‌రిస్థితుల్లో గూగుల్ వాటా కొంటే వొడాఫోన్ ఐడియా తాత్కాలికంగా క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కినట్టే.  

వొడాఫోన్ ఐడియా వొడాఫోన్ ఐడియా గూగుల్ డీల్‌ Vodafone idea Vodafone Idea google deal Â