వొడాఫోన్ డబుల్ డేటా ప్యాక్స్‌.. అదుర్స్

కరోనా  లాక్‌డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇల్లు క‌దిలే పరిస్థితి లేదు. అందుకే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని ఎంప్లాయిస్‌ను ఆదేశించాయి. అయితే ఇక్క‌డో చిక్కొచ్చిప‌డింది. రెగ్యుల‌ర్‌గా వ‌ర్క్ ఫ్రం హోం చేసే కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, హైలీ ప్రొఫెష‌న‌ల్స్ త‌ప్ప మిగిలిన‌వాళ్లు బ్రాడ్‌బ్యాండ్ వాడటం లేదు. దీనికి కార‌ణం జియో వచ్చాక అన్ని కంపెనీలు డేటా స్పీడ్ పెంచడం. ఎక్కువమంది ల్యాప్‌టాప్‌లు , ట్యాబ్‌ల‌ను కూడా మొబైల్ డేటాతోనే నడిపిస్తున్నారు. అనుకోకుండా వచ్చిన లాక్‌డౌన్‌తో ఎక్కువమందికి వర్క్ చేయడానికి ఉన్న డేటా సరిపోవడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన వోడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకోవడానికి డబల్ డేటా ఆఫర్లను మళ్లీ తీసుకొచ్చింది.

2జీబీ డైలీ డేటా ప్లాన్స్
వొడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్ల‌లో రోజుకు 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను వాడేవారికి డ‌బుల్ డేటా ఆఫర్ ఇస్తోంది. వొడాఫోన్  299 ప్లాన్
వొడాఫోన్ 399 ప్లాన్
వొడాఫోన్  499 ప్లాన్
వొడాఫోన్  599 ప్లాన్
వొడాఫోన్  699 ప్లాన్
పై ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నింటికీ డ‌బుల్ డేటా ఆఫ‌ర్  వర్తిస్తుంది. ఈ ప్లాన్స్‌లో ఇప్పటివరకు రోజుకు 2 జీబీ డేటా వచ్చేది. ఇకపై దానికి డబుల్ అంటే రోజుకు 4 జీబీ డేటా ఇస్తుంది.

1.5 జీబీ డేటా ప్లాన్స్
రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చే 399 రూపాయలు రీఛార్జ్ ప్లాన్‌కు కూడా  ఈ ఆఫర్ వర్తిస్తుంది. 56 రోజుల పాటు రోజుకు మూడు జీబీ డేటా వస్తుంది.  అలాగే 5 99 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్‌తో 84 రోజులపాటు రోజుకు 3 జీబీ డేటా ఇస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలమే ఉండబోతుంది. ముఖ్యంగా లాక్ డౌన్ కొనసాగినంత కాలం ఈ ఆఫర్ ఉంటుందని కంపెనీ వర్గాల సమాచారం.

9 సర్కిల్స్‌కే ఆఫ‌ర్
 గతంలో డ‌బుల్ డేటా ఆఫర్ల‌ను వొడాఫోన్ దేశ‌వ్యాప్తంగా ఉన్న త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లంద‌రికీ అందించింది. అయితే  ఈసారి  దాన్ని 9 సర్కిళ్ల కి పరిమితం చేయడం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం. మీ టెలికం స‌ర్కిల్‌లో ఈ ఆఫ‌ర్ ఉందో లేదో చూడాలంటే ఆన్‌లైన్ రీఛార్జి పోర్ట‌ల్‌లో ప్ర‌య‌త్నించండి. 

Vodafone idea Double data packs Vodafone idea prepaid packs lock down offers mobile data వొడాఫోన్ డ‌బుల్ డేటా ఆఫ‌ర్స్‌ వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్‌ లాక్‌డౌన్ ఆఫ‌ర్స్‌ మొబైల్ డేటా