కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. శతాబ్దాలుగా ఎవరూ చూడని భయానక పరిస్థితులు ప్రపంచమంతటా నెలకొన్నాయి. పక్కవాడు తుమ్మితే భయం. ఎవరైనా దగ్గితే వణుకు.. ఇదీ ప్రస్తుత పరిస్ధితి.
ప్రత్యేకించి ఇండియా సమాచారం కోసం..
ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో కరోనా గురించిన సమస్త సమాచారాన్ని ఒకేచోట తెలుసుకునేందుకు ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. Covidout.in పేరుతో ఈ వెబ్సైట్ ను కిప్రోష్ అనే సంస్థ రూపొందించింది. కరోనా వైరస్ గురించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో సహా పలు మంత్రిత్వ శాఖల ద్వారా డేటా తీసుకుని ఈ సైట్ నడుపుతున్నారు
సమస్త సమాచారం ఒకేచోట
* కోవిడ్అవుట్. ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఓ డాష్బోర్డు కనిపిస్తుంది.
* ఇండియాలో మొత్తం కేసులు, హాస్పిటలైజ్డ్ కేసులు,ఐసీయూలో ఉన్నవారు, రికవర్ అయినవారు, మృతుల వివరాలు డాష్ బోర్డులో ఉంటాయి
* కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను చూపే ఇండియా మ్యాప్, రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు అన్నీ గ్రాఫికల్ గా ఈ సైట్ లో ఉన్నాయి.
* ఏ రోజు ఎన్ని కేసులు నమోదయ్యాయో డేట్ వైజ్ గ్రాఫిక్ ఉంది.
* రాష్ట్రాల వారీగా హెల్ప్ లైన్ నంబర్స్ వివరాలు ఇచ్చారు.
* కరోనా పరీక్షా కేంద్రాలు ఏ రాష్ట్రంలో ఏ ఊరిలో ఉన్నాయో కూడా కొవిడ్ అవుట్. ఇన్ వెబ్సైట్లో చూడొచ్చు.
ఇండియాలో క‌రోనా స‌మాచారం కోవిడà±à°…à°µà±à°Ÿà±.ఇనà±â€Œ Covidout.in carona information website Carona dashboard in india ఇండియాలో కరోనా à°µà±à°¯à°¾à°ªà±à°¤à°¿ à°—à±à°°à°¿à°‚à°šà°¿à°¨ సమసà±à°¤ సమాచారం à°’à°•à±à°•చోట కోవిడà±à°…à°µà±à°Ÿà±â€Œ.ఇనà±â€Œà°²à±‹ Carona info of india.. Covidout.in