ఇన్‌స్టాగ్రామ్ వీడియోనోట్‌.. వీడియోలోని మాట‌లే ఇక లైవ్‌క్యాప్ష‌న్స్‌‌

ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్‌గా తెచ్చిన థ్రెడ్ యాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను యాడ్ చేయ‌బోతోంది. దీని పేరు వీడియో  నోట్‌. దీనిలో విశేష‌మేమిటంటే వీడియోలోని మాట‌ల్నే ఇది లైవ్‌క్యాప్ష‌న్స్‌‌గా మార్చేస్తుంది. సో స‌బ్ టైటిల్స్ వేసే ఇబ్బంది త‌ప్పుతుంది. ఈ ఫీచ‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ త‌న థ్రెడ్ యాప్‌లో అతి త్వ‌ర‌లోనే యాడ్ చేయ‌బోతుంద‌ని స‌మాచారం. 

అస‌లేమిటి థ్రెడ్ యాప్‌
ఇన్‌స్టాలో మీ క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవ‌డానికి వీలుగా థ్రెడ్ యాప్‌ను 2019లో లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు సెండ్ చేసే వీడియోలు, ఫోటోలు వేరే ఎవ‌రూ చూడ‌కుండా నేరుగా మీ ఫ్రెండ్స్ మాత్ర‌మే చూసేందుకు వీలుగా ఈ థ్రెడ్ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసింది. 

వీడియో నోట్‌తో ప‌నేంటి?
ఇన్‌స్టా త‌న థ్రెడ్ యాప్‌లో వీడియో నోట్ ఫీచ‌ర్ తీసుకురావ‌డానికి ఓ ముఖ్య‌మైన కార‌ణం ఉంది. అది బ‌ధిరులు అంటే వినికిడి లోపం ఉన్నవారికి ఉప‌యోగ‌ప‌డాల‌నే ఉద్దేశంతో తీసుకొస్తోంది. వీడియోలో సౌండ్ విన‌లేక‌పోయినా వాటిని లైవ్‌క్యాప్ష‌న్స్‌లో చ‌దువుకుని అర్థం చేసుకుంటార‌న్న‌ది ఈ ఫీచ‌ర్ ఉద్దేశం. 

ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్ వీడియో నోట్ ఫీచ‌ర్ Insta Thread Instagram Video noteÂ