కోవిద్ రోగులను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే మిత్రా రోబోట్

 

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఎంత‌గా కుదిపేస్తుందో క‌ళ్లారా చూస్తున్నాం. త‌ల్లికి బిడ్డ‌ను, భ‌ర్త‌ను భార్య‌ను కాకుండా చేస్తున్న మాయ‌రోగం ఇది. ఎక్క‌డ ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతుందోన‌న్న భ‌యంతో దూర‌దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. అందుకే క‌రోనా రోగి హాస్పిట‌ల్‌లో ఉన్నా కుటుంబ‌స‌భ్యులు ఎవ‌రూ ద‌గ్గ‌ర ఉండ‌లేని ప‌రిస్థితి. చాలా హాస్పిట‌ల్‌లో ఫోన్లు కూడా అనుమ‌తించ‌ట్లేదు. ఇలాంటి స‌మ‌యంలో రోగికి ధైర్యం చెప్ప‌లేక‌పోయామ‌ని బంధువులు, త‌మ‌వారితో మాట్లాడ‌లేక‌పోతున్నామ‌ని రోగులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ బాధ తీర్చ‌డానికి ఓ రోబో ముందుకొచ్చింది.  కొవిడ్ రోగుల‌ను వారి బంధువుల‌తో మాట్లాడిస్తోంది.


మిత్రా రోబో
బెంగ‌ళూర‌లోని ఇన్వెంటో రోబోటిక్స్ అనే స్టార్ట‌ప్ కంపెనీ ఈ మిత్రా రోబోను మూడేళ్ల కింద‌టే త‌యారుచేసింది. 2017లో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో ప్ర‌‌ధాని మోడీతో  ఈ రోబో మాట్లాడ‌టం అప్ప‌ట్లో బాగా వార్త‌ల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆ రోబోనే కొవిడ్ రోగుల సేవ‌లో ఉప‌యోగిస్తున్నారు. దీని ఖ‌రీదు దాదాపు 10 ల‌క్ష‌లు.  ఢిల్లీలోని కొన్ని ప్రైవేట్ కార్పోరేట్ హాస్పిటల్స్‌లో దీన్ని ఇప్ప‌టికే ఉప‌యోగిస్తున్నారు. 

ఏం సేవ‌లు చేస్తుంది?
* కొవిడ్ రోగుల‌కు మందులు, మాస్క్‌లు లాంటివ‌న్నీ తీసుకెళ్లి అందిస్తుంది. దీన్ని రిమోట్‌తో ప‌ని చేయించవ‌చ్చు.
* డాక్ట‌ర్ల‌కు రోగి నుంచి ఇన్‌ఫెక్ష‌న్ రాకుండా టెలిమెడిసిన్ ప‌ద్థ‌తిలో వైద్యం చేసేలా వారిని పేపంట్‌తో క‌లుపుతుంది.
* పేషంట్లు వారి కుటుంబం లేదా ఫ్రెండ్స్తో మాట్లాడ‌టానికి వీడియో కాల్స్ అరేంజ్ చేస్తుంది.

క‌రోనా రోగుల‌కు రోబో మిత్రా రోబో Mitra Robot Mitra robo covid patients కొవిడ్ రోగుల‌ను వారి కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడించే మిత్రా రోబో Mitra the robot helps Covid patients in India speak to loved ones