గూగుల్ క‌రోనా వైర‌స్ స్క్రీనింగ్ వెబ్‌సైట్ ఇప్పుడు లైవ్‌..

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వారి అనుబంధ సంస్థ అయిన వెరిలీ క‌రోనా వైర‌స్ టెస్టింగ్ ప్ర‌క్రియ‌ను లైవ్‌లో చూపిస్తామంటూ మ‌న ముందుకొచ్చింది.  ప్రపంచాన్ని క‌మ్ముకొస్తున్న మ‌హ‌మ్మారి కొవిడ్ -19 (క‌రోనా) వైర‌స్ మ‌న‌కు సోకిందో లేదో నిరూపించే ఈ ప‌రీక్ష‌ను లైవ్‌లో చూపించ‌డంలో వెరిలీ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతోందో ఓ లుక్కేద్దామా

స్క్రీనింగ్ లైవ్‌లో 
క‌రోనాతో బాగా ప్ర‌భావిత‌మైన అమెరికాలో ప‌రిస్థితి చాలా తీవ్రంగా ఉంది. 3200 మందికి క‌రోనా సోకితే 61 మంది చ‌నిపోయారు. అనుమానిత రోగుల‌కు అస‌లు క‌రోనా ప‌రీక్ష అవ‌స‌ర‌మా లేదా తేల్చేందుకు ఓ వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. గూగుల్ అనుబంధ సంస్థ అయిన వెరిలీ లైఫ్‌సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ సంస్థ‌.  అమెరికాలో కోవిడ్‌-19 అనుమానిత కేసుల‌ను స్క్రీనింగ్ చేసి వారికి ప్రాథ‌మిక ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అస‌లు ప‌రీక్ష చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ ప్ర‌క్రియ‌ను లైవ్‌లో చేపించేందుకు వెరిలీ వెబ్‌సైట్‌లో ఏర్పాట్లు చేశారు. అయితే  ఇది అమెరికాలోని శాంటా క్లారా, శాన్ మాటియో కౌంటీస్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది.

త్వ‌ర‌లో విస్త‌రిస్తామ‌న్న పిచాయ్ 
కోవిడ్‌-19 టెస్టింగ్ కోసం మేం ఓ టూల్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నాం.  ప్ర‌స్తుతం వెరిలీ  కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్క్రీనింగ్‌ను లైవ్‌లో అందుబాటులోకి తెచ్చింది. మేం దీన్ని మ‌రింత విస్త‌రిస్తాం అని గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ప్ర‌క‌టించారు.  మ‌రోవైపు క‌రోనా వైర‌స్ గురించి అవ‌గాహ‌న‌, క‌రోనా వ్యాపించ‌కుండా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు, వైర‌స్ వ్యాప్తి గురించి అప్ టు డేట్ స‌మాచారంతో మ‌రో వెబ్‌సైట్‌ను కూడా గూగుల్ లాంచ్ చేయ‌బోతోంద‌ని పిచాయ్ చెప్పారు. 

ఇంత‌కీ ఎలా ప‌నిచేస్తుంది?
* https://www.projectbaseline.com/study/covid-19/match/ అని బ్రౌజ‌ర్‌లో టైప్ చేసి క్లిక్ చేయాలి.

* వెరిలీ కొవిడ్‌-19 వైర‌స్ స్క్రీనింగ్ వెబ్‌సైట్ హోం పేజీ ఓపెన్ అవుతుంది.

* గెట్ స్టార్టెడ్ అనే బ‌ట‌న్ నొక్కితే మీకు ఈ లక్ష‌ణాలున్నాయా అని ప్రశ్న‌లు అడుగుతుంది. ఎస్ లేదా నో స‌మాధానాన్ని క్లిక్ చేయాలి.

* మీ స‌మాధానాల‌ను బ‌ట్టి మీకు అస‌లు టెస్ట్ అవ‌స‌ర‌మా లేదా చూపిస్తుంది. 

క‌రోనా వైర‌స్‌ క‌రోనా వైర‌స్ స్క్రీనింగ్‌ కోవిడ్‌-19 కోవిడ్‌-19 స్క్రీనింగ్ లైవ్‌ వెరిలీ వెబ్‌సైట్‌ Corona Virus Corona Virus Screening Corona Virus Screening live Corona Virus screening in verily website