టెక్నాల‌జీ విద్యార్థులు అన్ని పుస్త‌కాల‌ను ఉచితంగా చ‌దువుకోవ‌డానికి బెస్ట్ ఆప్ష‌న్ ఇదే

టెక్నాల‌జీ విద్యార్థులు ఎన్నో పుస్త‌కాలు చ‌ద‌వాల్సి ఉంటుంది. అయితే వీటి విలువ చాలా ఎక్కువ‌గా కూడా ఉంటుంది.  అన్ని పుస్త‌కాలూ అందుబాటులో కూడా ఉండ‌వు. అయితే ఇలాంటి వాళ్ల‌కు ఉచితంగా పుస్త‌కాలు చ‌దువుకునే ఆప్ష‌న్ ఉంటే బాగుంటుంది క‌దా! ఈ అవ‌కాశాన్నే అందిస్తోంది ఫ్రీటెక్‌బుక్స్ వెబ్‌సైట్‌. మ‌రి ఈ సైట్‌ని ఎలా ఉప‌యోగించుకోవాలో తెలుసుకుందామా...

చాలా సుల‌భం
ఫ్రీటెక్‌బుక్స్ వెబ్‌సైట్‌ను యూజ్ చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీని ద్వారా కంప్యూట‌ర్ సైన్స్‌, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, మాథ‌మెటిక్స్ లాంటి స‌బ్జెక్టుల‌కు సంబంధించిన ఇ-బుక్స్‌, టెక్ట్‌, డాక్యుమెంట్స్‌, నోట్స్‌, మోనోగ్రామ్‌ల‌ను ఈజీగా యూజ్ చేసుకోవ‌చ్చు. ఈ సైట్లో కేట‌గిరీ, ఆథ‌ర్, లైసెన్స్‌, ప‌బ్లిష‌ర్ లాంటి ఎన్నో వివ‌రాలు చాలా వివ‌రంగా ఉంటాయి. దీని వ‌ల్ల మీకు కావాల్సిన బుక్‌ను వెంట‌నే వెతుక్కునే అవ‌కాశం ఉంటుంది.  అంతేకాక ఉచితంగా ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ లు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇందుకోసం మీకు కావాల్సిన బుక్ పేరును సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే ఆ పుస్త‌కం.. దానికి సంబంధించిన పీడీఎఫ్ కూడా వ‌స్తుంది. అయితే అన్ని పుస్త‌కాల‌కు పీడీఎఫ్‌లు ఉండ‌క‌పోవ‌చ్చు.

ఎలా ఉప‌యోగించాలి
ఫ్రీటెక్‌బుక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి  కంప్యూట‌ర్ సైన్స్‌, ఇంజనీరింగ్‌, ప్రొగ్రామింగ్ పుస్త‌కాల‌ను చ‌దువుకోవ‌చ్చు. ఈ సైట్‌లోకి వెళ్లిన‌ప్పుడు మీకు రీసెంట్‌గా చ‌దివిన పుస్త‌కాల జాబితా కూడా క‌నిపిస్తుంది. మీరు ఎక్క‌డ ఆ పుస్త‌కాన్ని చ‌ద‌వ‌డం ఆపారో అక్క‌డ నుంచి మ‌ళ్లీ కొన‌సాగించొచ్చు. లేదా మ‌ళ్లీ ఆరంభం నుంచి చ‌దువుకోవ‌చ్చు. ఇందుకోసం బ్రౌజ్ ఆల్ పోస్ట్స్ అండ్ బుక్స్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఒక ప్ర‌త్యేక‌మైన టాపిక్ మీద కూడా బుక్స్ ఉంటాయి. వాటిని సెర్చ్‌లో వెత‌క‌డం ద్వారా మీరు క‌నుగొనచ్చు. అలాగే ర‌చ‌యిత‌, ప‌బ్లిష‌ర్, కేట‌గిరీని బ‌ట్టి ఫిల్ట‌రింగ్ చేసుకుంటూ మీకు కావాల్సిన పుస్త‌కాల‌ను వెతుక్కోవ‌చ్చు. 

READ ONLINE COMPUTER SCIENCE ENGINEERING PROGRAMMING BOOKS FREE