ప్రివ్యూ - కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

కరోనా వైరస్ రోగి నుంచి ఆరోగ్యవంతుడికి సోకడానికి ప్రధాన మార్గం ముఖ భాగమే. అందుకే కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ముక్కు కలిసే టీ జంక్షన్ను వట్టి చేతులతో తాకొద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. చేతులను శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్‌తో కడుక్కునే వరకు అనవసరంగా ముఖాన్ని టచ్ చేయొద్దని కూడా సూచిస్తున్నారు. అయితే మనం పీసీ  లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చుని పని చేస్తుంటే చేతులు కాసేపటి తర్వాత ఆటోమాటిగ్గా కళ్ళ మీదకు వెళ్లిపోతాయి. ముక్కును వేళ్ళు గోకుతాయి. కంప్యూటర్ మీద పని చేసేవాళ్ళందరికి ఇది  అనుభవమే. మాములుగా అయితే దీనితో పెద్ద సమస్య లేదు. కరోనా కంగారు పెడుతున్న పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి పనులు చేస్తే ప్రమాదమే. ఐతే మన టెక్నాలజీ దీనికి కూడా ఒక ట్రిక్ కనిపెట్టింది.

డు నాట్ ట‌చ్ యువ‌ర్ ఫేస్ వెబ్‌సైట్‌
Do Not Touch Your Face అనే ఒక ఫ్రీ  వెబ్ సైట్ మీకు ఈ సేవను అందిస్తుంది. ఐతే మీరు ఈ సర్వీస్ పొందాలంటే మీ పీసీ లేదా ల్యాపీకి వెబ్ కెమెరా ఉండాలి. వెబ్ సైట్ ఓపెన్ చేసి మీరు పీసీలో పని చేసుకుంటుంటే పొరపాటున మీ చెయ్యి ముఖం మీదకి వెళ్లిన వెంటనే వెబ్ సైట్ మిమ్మల్ని డు నాట్ టచ్ యువర్ ఫేస్ అని హెచ్చరిస్తుంది.

మెషీన్ లెర్నింగ్ సాయం చేస్తుంది.
మీకు అల‌ర్ట్ రావాలంటే ముందుగా మీరు వెబ్ కెమెరాను మెషిన్ లెర్నింగ్ కి తగ్గట్లు ట్రైన్ చేయాలి.

* వెబ్ కెమెరా ఆన్ చేసి ముందుగా మీరు మీ ముఖాన్ని టచ్ చేయకుండా కాసేపు రికార్డు చేయాలి.

* తరవాత మీరు ముఖాన్ని టచ్ చేస్తూ మరొకటి రికార్డు చేయండి.

* ఆ తరవాత మీరు పీసీ ముందు కూర్చుని ప‌ని చేస్తున్నప్పుడు పొరపాటున మీ చేయి ముఖం మీదకి వెళితే వెంటనే అలెర్ట్ చేస్తుంది

* డు నాట్ ట‌చ్ యువ‌ర్ వెబ్ సైట్ ని మీరు డెస్క్ టాప్ మీద మినిమైజ్ చేసిపెట్టినా కూడా అలర్ట్ రావ‌డం మ‌రో హైలెట్ అని చెప్పొచ్చు. 

ముఖాన్ని ట‌చ్ చేస్తే అల‌ర్ట్ చేసే వెబ్‌సైట్‌ డు నాట్ ట‌చ్ యువ‌ర్ ఫేస్‌ క‌రోనా వైర‌స్‌ క‌రోనా వ్యాప్తి Do Not Touch Your Face Carona precautions Carona alert