అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లకు కాలం చెల్లిపోయిందా? సరికొత్త స్ట్రీమింగ్ సర్వీసులు వీటిని డామినేట్ చేయబోతున్నాయా?సినిమాలు సీరియల్స్ చూడాలంటే థియేటర్లు, టీవీల మీద ఆధారపడే రోజులు పోయాయి. ఇప్పుడంతా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ లదే హవా. ఇకపై వాటికీ కాలం చెల్లిపోనుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మూవీస్, సీరియల్స్ దాటి ఇంకా మరింత కంటెంట్ కోరుకునే యూజర్స్ పెరుగుతున్నారు. దానికి తగ్గట్లే కొత్త కంటెంట్ ప్రొవైడర్స్ కూడా రంగంలోకి వస్తున్నారు. యాపిల్ టీవీ ప్లస్, డిస్నీ ప్లస్,హెచ్బీవో మ్యాక్స్, పీకాక్ ఇలా కొత్త కంటెంట్ ప్రొవైడర్స్ లిస్టు పెద్ద గానే ఉంది.
యాపిల్ టీవీ ప్లస్
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాపిల్ తొలిసారిగా యాపిల్ టీవీ ప్లస్తో స్ట్రీమింగ్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం యాపిల్ టీవీ ప్లస్ లాంచ్ అయింది. యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి యాపిల్ ప్రొడక్ట్స్ కొన్నవారికి ఏడాది పాటు యాపిల్ టీవీ ప్లస్ సర్వీస్ ఉచితం. మిగిలిన వారికి వారం పాటు ఉచితం. తర్వాత సబ్స్క్రిప్షన్ నెలకు 5 డాలర్లు. అంటే మన కరెన్సీలో 350 రూపాయలు. 9 ఒరిజినల్ షోస్, మూవీస్ తో యాపిల్ తన స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేసింది. ఇందులో జెన్నిఫర్ ఆనిస్టిన్ నటించిన కామెడీ షో ద మార్నింగ్ షో వంటివి ఉన్నాయి. మరిన్ని షోలు, మూవీస్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.
డిస్నీ ప్లస్
సుప్రసిద్ధ డిస్నీ సంస్థ నుంచి ఈ నెల 15న లాంచ్ కాబోతున్న స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్. డిస్నీ, పిక్సర్, మార్వెల్, స్టార్వార్్థతోపాటు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ లోని కంటెంట్ను మనం డిస్నీప్లస్లో చూడొ్చు. అలాద్దీన్, స్టార్వార్స్ ఇలాంటి పిల్లలకు నచ్చే కార్యక్రమాలు ఇందులో కోకొల్లలు. ఈ నెల 12న డిస్నీ దీన్ని లాంచ్ చేయబోతోంది. సబ్స్క్రిప్షన్ నెలకు 7 డాలర్లు (రూ.500) లేదా ఏడాదికి 70 డాలర్లు (దాదాపు 5వేల రూపాయలు). డిస్నీప్లస్తోపాటు ఈఎస్పీఎన్ ప్లస్, హులూ సబ్స్ర్కిప్షన్ కూడా కావాలంటే నెలకు 13 డాలర్లు (920 రూపాయలు). వారం రోజుల పాటు అందరికీ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. విదేశాల్లో వెరిజాన్ మొబైల్ అన్లిమిటెడ్ ప్లాన్ తీసుకున్నవారికి ఏడాది పాటు ఫ్రీ.
పీకాక్
కామ్కాస్ట్కు చెందిన ఎన్సీబీ యూనివర్సల్ ఈ స్ట్రీమింగ్ సర్వీస్ను లాంచ్ చేయబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇందులో 15 వేల గంటల వీడియో కంటెంట్ ఉంటుందని సంస్థ ప్రకటించింది. సబ్స్క్రిప్షన్ ఛార్జీలు ఎంతనేది ఇంకా నిర్ణయించలేదు.
హెచ్బీవో మ్యాక్స్
ఏటీ అండ్ టీస్ వార్నర్ మీడియా నుంచి ఈ స్ట్రీమింగ్ సర్వీస్ రాబోతోంది. వచ్చే ఏడాది మే నుంచి అందుబాటులోకి వస్తుంది. 10వేల గంటల వీడియో కంటెంట్తో సర్వీస్ను ప్రారంభించబోతున్నారు. నెలకు 15 డాలర్లు (1,060 రూపాయలు). దాదాపు కోటిమంది హెచ్బీవో సబ్స్క్రైబర్లకు ఉచిత సర్వీసు అందించనున్నారు.
à°¸à±à°Ÿà±à°°à±€à°®à°¿à°‚గౠస‌రà±à°µà±€à°¸à±â€Œ యాపిలౠటీవీ à°ªà±à°²â€Œà°¸à±â€Œ à°¡à°¿à°¸à±à°¨à±€ à°ªà±à°²â€Œà°¸à±â€Œ హెచà±â€Œà°¬à±€à°µà±‹ à°ªà±à°²â€Œà°¸à±â€Œ పీకాకà±â€Œ Streaming Services Amazon prime Apple Tv Plus HBO Plus Peacock Disney Plus Â