ప్రివ్యూ - ప్లీజ్‌.. కాస్త దూరం జ‌ర‌గండి అని హెచ్చరించే రోబో డాగ్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌గ‌తినే మార్చేసింది. లాక్‌డౌన్‌తో ప్ర‌పంచ‌దేశాల‌న్నీ ఇంట్లో కూర్చున్నాయి. అయితే టెక్నాల‌జీ కంపెనీలు మాత్రం ఈ సంక్షోభాన్నీ అవ‌కాశంగా మలుచుకుంటున్నాయి. క‌రోనా నివార‌ణ‌లో సోష‌ల్ డిస్టెన్సింగ్ అనేది అత్యంత కీల‌కం. మ‌నిషికీ మ‌నిషికీ మ‌ధ్య క‌నీసం మీట‌రు దూరం ఉండాలని వైద్యులు మొత్తుకుంటున్నారు. కానీ పార్క్‌లు లాంటి ప‌బ్లిక్ ప్లేస్‌ల్లో దీన్ని పాటించేదెవ‌రు?  దీనికి పరిష్కారంగా సింగపూర్ రోబోడాగ్‌ను తీసుకొచ్చింది. సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించ‌డ‌మే దీని ప‌ని. 

స్పాట్ పెట్టేస్తుంది
సింగ‌పూర్ ప్ర‌భుత్వం బోస్ట‌న్ డైన‌మిక్స్ అనే కంపెనీ త‌యారుచేసిన రోబోడాగ్‌ను పార్క్‌ల్లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. దీనికి స్పాట్ అని పేరు పెట్టారు.

* ఇది పార్క్‌లో తిరుగుతూ ద‌గ్గ‌ర‌గా కూర్చున్న విజిట‌ర్ల‌ను దూరం జ‌ర‌గ‌మ‌ని హెచ్చ‌రిస్తుంది.

* లెట్స్ కీప్ సింగ‌పూర్ హెల్తీ అని ఇంగ్లీష్‌లో రిక్వెస్ట్ చేస్తూ పార్క్‌లో తిరుగుతుంది.

* మీ సేఫ్టీ, మీ చుట్టుపక్క‌లున్న వారి సేఫ్టీ కోసం క‌నీసం మీట‌రు దూరం పాటించండి అని మృదువైన ఆడ‌గొంతుతో విజిట‌ర్లను రిక్వెస్ట్ చేస్తూ తిరుగుతుంది.  

* అంతేకాదు త‌న కెమెరాల‌తో పార్క్‌లో ఎంత మంది జ‌నం ఉన్నార‌నేది లెక్క‌గ‌డుతుంది. 

ఎందుకింత జాగ్ర‌త్త‌?
సింగ‌పూర్ జ‌నాభా 57 లక్ష‌లు. అంటే మ‌న హైద‌ర‌బాద్ జ‌నాబాలో దాదాపు స‌గం. కానీ అక్క‌డ 21వేల క‌రోనా పాజిటివ్ కేసులున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి అన్ని ర‌కాలుగా చ‌ర్యలు  తీసుకుంటుంది అక్క‌డి ప్ర‌భుత్వం. అందులో భాగంగానే ఈ రోబో డాగ్‌ను కూడా తీసుకొచ్చి ప‌బ్లిక్ ప్లేసెస్‌లో జ‌నం ఒక‌ద‌గ్గర గుమిగూడ‌కుండా రోబోతోనే చెప్పించాల‌ని ప్లాన్ చేసింది.  చూద్దాం మ‌నుషులు చెబితే చాలాచోట్ల జ‌నం సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించ‌డం లేదు. మ‌రి ఈ రోబోడాగ్ ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అవుతుందో

రోబోడాగ్‌ స్పాట్ రోబో సింగ‌పూర్ రోబో సోష‌ల్ డిస్టెన్సింగ్‌  robo dog spot robo dog Corona out break Â