ప్రివ్యూ - అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌

ఈకామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ అమెజాన్‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌తో క‌లిసి అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌ను ఆఫ‌ర్ చేస్తోంది. ఇది కూడా మిగ‌తా క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగానే ఉంటుంది.  అమెజాన్ మెంబ‌ర్లు (ప్రైమ్‌, నాన్ ప్రైమ్ మెంబ‌ర్లు) అంద‌రూ దీనికి అప్ల‌యి చేసుకోవ‌చ్చు. అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్ ఏమిటి?  రివార్డ్ పాయింట్లు, ఇత‌ర ఫీచ‌ర్లు ఏమిటో ఓ లుక్కేద్దాం రండి

లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డ్‌
అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌.. అమెజాన్ పే ప్రైవేట్ లిమిటెడ్‌, వీసాతో క‌లిపి అందిస్తుంది. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌.  ఎలాంటి యాన్యువ‌ల్ ఫీజు ఉండ‌దు. అలాగే  జాయినింగ్‌కు కూడా ఫీజ్ లేదు.

రివార్డ్ పాయింట్లు
అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌తో మీరు ఖ‌ర్చు పెట్టే సొమ్ముకు రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. అమెజాన్‌.ఇన్‌లో మీరు గ్రాస‌రీస్‌, మొబైల్స్‌, బ‌ట్ట‌లు  కొంటే 5% రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. అమెజాన్‌లో మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినా, ఫోన్ రీఛార్జి చేసినా, బిల్ క‌ట్టినా 100కు 2 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది.  ఇత‌ర ఫ్లాట్‌ఫామ్స్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఖ‌ర్చు పెట్టేవాటికి 1%  రివార్డ్ పాయింట్లు వ‌స్తాయి.

* అయితే వీటిని అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో అందిస్తుంది.  అంటే ప్ర‌తి నెలా పూర్త‌వ‌గానే మీ రివార్డ్ పాయింట్ల‌న్నీ అమెజాన్ పే బ్యాలెన్స్‌గా మీ అకౌంట్‌కు యాడ్ అవుతాయి.  వీటిని మీరు అమెజాన్‌లో ఏమైనా కొనుక్కోవ‌డానికి లేదా టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి, బిల్ పే చేయ‌డానికి దేనికైనా వాడుకోవ‌చ్చు. 

* ఈఎంఐల్లో ఏదైనా కొన్నా, బిల్ క‌ట్టినా రివార్డ్ పాయింట్లు రావు.

క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌
అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ లాంచింగ్ ఆఫ‌ర్ కింద కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. కార్డు తీసుకుంటే ప్రైమ్ మెంబ‌ర్ల‌కు 600 రూపాయ‌లు, నాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు 500 రూపాయ‌లు క్యాష్‌బ్యాక్‌గా ఇస్తుంది. అయితే మీరు ఇప్పుడు అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌కు అప్ల‌యి చేసుకుని ఈ నెల 31లోపు కార్డ్ అప్రూవ్ అయితే మీకు క్యాష్‌బ్యాక్ ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తుంది.

ఈఎంఐ ఆఫ‌ర్‌
అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌తో రూ.3వేలు, అంత‌కంటే ఎక్కువ ట్రాన్సాక్ష‌న్ చేస్తే ఆ అమౌంట్‌ను ఈఎంఐగా మార్చుకోవ‌చ్చు. 3 నుంచి 6 నెలల్లో దీన్ని తిరిగి క‌ట్టుకునే వెసులుబాటు ఉంది.

ఎలా అప్ల‌యి చేసుకోవాలి?
మీ ఫోన్ నెంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, త‌ల్లి పేరు, అడ్ర‌స్‌, పాన్ కార్డ్‌, ఆఫీస్ డిటెయిల్స్ వంటి వివ‌రాలన్నీ ఎంట‌ర్ చేయాలి.
* త‌ర్వాత పేజీలో కండిష‌న్స్ యాక్సెప్ట్ చేసి, జ‌న‌రేట్ కార్డ్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

ఎవ‌రు అప్ల‌యి చేసుకోవ‌చ్చు? 
హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, కోయంబ‌త్తూరు, ఢిల్లీ, క‌ల‌క‌త్తా, ఆగ్రా, అహ్మదాబాద్‌, ఔరంగాబాద్‌, బ‌రోడా, భోపాల్‌, చండీగ‌డ్‌, ఫ‌రీదాబాద్‌, గ‌జియాబాద్‌, గుర్‌గావ్‌, జైపూర్‌, కాన్పూర్‌, కోటా, ల‌క్నో, లుథియానా, ముంబ‌యి, మైసూర్‌, నాసిక్‌, న‌వీ ముంబ‌యి, నోయిడా, పాట్నా, పుణె, సూర‌త్‌, ఉద‌య్‌పూర్‌ల‌తో స‌హా మొత్తం 35 న‌గ‌రాల్లో నివ‌సించేవారికి తొలుత ఈ క్రెడిట్ కార్డ్‌ల‌ను ఐసీఐసీఐ ఆఫ‌ర్ చేస్తుంది.  త‌ర్వాత మిగిలిన ప్రాంతాల‌వారికీ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 

అమెజాన్ పే క్రెడిట్‌కార్డ్‌ అమెజాన్ పే రివార్డ్ పాయింట్స్‌ Amazon Pay Creditcard Credit cards