దేశ రాజధాని ఢిల్లీని ఏలబోయేది ఎవరో ప్రజలు నిర్ణయించే రోజు వచ్చేసింది. దిల్లీ అసెంబ్లీకి రేపే ఎన్నికలు. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఊడ్చిపారేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి మళ్లీ అదే ఊపు కొనసాగిస్తామని ఢంకా బజాయిస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాం, మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఢిల్లీలో 8 పార్లమెంట్ స్థానాల్లో క్లీన్స్వీప్ చేశాం కాబట్టి ఈసారి ఢిల్లీ అసెంబ్లీ పీఠం తమదేనని కమలం ధీమాగా ఉంది. రాజకీయాల సంగతి కాస్త పక్కనపెడితే ఈ ఎన్నికల్లో ఓటర్లను తోటి ఓటర్లు, అభ్యర్థులతో కలిపేందుకు ఓ యాప్ వచ్చింది. సింప్లీ లోకల్ పేరుతో వచ్చిన ఆ యాప్ ముచ్చట్లేమిటో చూద్దాం.
అభ్యర్థుల లిస్ట్తో సహా అన్నీ..
నిఖిల్ కే బాప్నా అనే ఢిల్లీ టెకీ సింప్లీ లోకల్ పేరుతో ఓ యాప్ తయారుచేశారు. ఈ యాప్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల లిస్ట్ ఉంటుంది.
* అభ్యర్థులు ఓటర్లతో చాట్ చేయడానికి చాట్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేశారు.
* జియో ఫెన్సింగ్ ఫీచర్తో ఓటర్లను తోటి ఓటర్లతో కలిపే ఏర్పాటు కూడా ఈ యాప్లో ఉంది. ఈ యాప్ మీరు లాగిన్ అవగానే మీ ప్రాంతంలో సింప్లీ యాప్ వాడుతున్న యూజర్లందరినీ చూపిస్తుంది. ఫేస్బుక్లో మన పరిసరాల్లో ఉన్న మన ఫ్రెండ్స్ గురించి ఎలా చూపిస్తుందో అలా అన్నమాట.
కమ్యూనిటీ యాప్ అంటున్న క్రియేటర్
సింప్లీ లోకల్ గురించి దీని సృష్టికర్త అయిన నిఖిల్ ఏం చెబుతున్నారంటే..
* ఇండియాలో తొలి డీసెంట్రలైజ్డ్ నైబర్హుడ్ సోషల్/ కమ్యూనిటీ నెట్వర్క్ యాప్.
* దీనిలో జియోఫెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాం. దీంతో ప్రతి కాలనీ లేదా బ్లాక్లో ఈ సింప్లీలోకల్ యాప్ వాడుతున్న వాళ్లందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ కావచ్చు.
* ఇది ప్రత్యేకంగా ఆ నెట్వర్క్కే పరిమితమవుతుంది. కాబట్టి బయటివారు ఎంటరయ్యే అవకాశం లేదు.
* స్థానిక ఎన్నికలు, నేరాలు జరిగినప్పుడు లేదా భద్రతాపరమైన సమస్యలు వచ్చినప్పుడు మనచుట్టుపక్కల ఉన్న వాళ్లతో కలిసి సమాచారాన్ని పంచుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పారు.
* ప్రైవసీ, సెక్యూరిటీకి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చామని చెప్పారు. కేవలం యూజర్ కాల్సైన్ ఒక్కటే అందరికీ కనిపిస్తుందని, ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తే ఆ యూజర్ను బ్లాక్ చేయవచ్చని నిఖిల్ బాప్నా తెలిపారు.
*ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లలో ఉచితంగా అందుబాటులో ఉంది.
Delhi election Delhi assembly election Delhi election 2020 Simply local app ఢిలà±à°²à±€ à°Žà°¨à±à°¨à°¿à°•‌లౠఢిలà±à°²à±€ à°Žà°¨à±à°¨à°¿à°•‌లౠ2020 సింపà±à°²à±€ లోకలౠయాపà±â€Œ క‌మà±à°¯à±‚నిటీ డీసెంటà±à°°â€Œà°²à±ˆà°œà±à°¡à± యాపà±â€Œ Â