ప్రివ్యూ - డిటిహెచ్ ల బాదుడు నుండి విముక్తికై వేంచేసిన ఛానల్ సెలెక్టర్ యాప్

డీటీహెచ్‌లో అవస‌రం లేని ఛాన‌ల్స్‌కు కూడా డబ్బులు క‌ట్టాల్సి వ‌స్తోంద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఇక‌పై చింత లేదు. డీటీహెచ్ కంపెనీల బాదుడు నుంచి యూజ‌ర్ల‌కు విముక్తి క‌లిగించేలా టెలికం రెగ్యులేట‌రీ అథార్టీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)  ఛాన‌ల్ సెలెక్ట‌ర్‌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీ డీటీహెచ్ ఆప‌రేట‌ర్ నుంచి న‌చ్చిన ఛాన‌ల్స్ మాత్రమే ఎంచుకుని మీరు చూసేవాటికే బిల్లు కట్టొచ్చు. 

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యాప్స్‌
ఛాన‌ల్ సెలెక్ట‌ర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్ ఐ స్టోర్‌ల్లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. కాబ‌ట్టి ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్లంద‌రూ దీన్ని వాడుకోవ‌చ్చు. ఈ యాప్‌లో టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిట‌ల్ టీవీ, హాత్‌వే డిజిటల్‌, సిటీ నెట్‌వ‌ర్క్‌, ఏషియ‌న్ నెట్ వంటి డీటీహెచ్ ఆప‌రేట‌ర్లంద‌రినీ చేర్చింది.

ఎలా వాడుకోవాలి?
* ముందుగా ఛాన‌ల్ సెలెక్ట‌ర్ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.

*  యాప్ ఓపెన్ చేసి మీ డీటహెచ్ ఆప‌రేట‌ర్‌ను సెలెక్ట్ చేసుకోండి. 

* త‌ర్వాత సెట్‌టాప్ బాక్స్ నెంబ‌ర్‌, స‌బ్‌స్క్రైబ‌ర్ ఐడీ, మీ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయండి. 

* ఇప్పుడు మీ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. అది ఎంట‌ర్ చేయ‌గానే మీ స‌బ్‌స్క్రిప్ష‌న్ వివ‌రాల‌న్నీ యాప్‌లో కనిపిస్తాయి. 

* ఇప్పుడు మీకు కావ‌ల్సిన‌ట్లుగా ఛాన‌ల్స్ ఎంపిక చేసుకోండి. అవసరం లేని వాటిని రిమూవ్ చేసుకోండి. ఏ ఛాన‌ల్ ధ‌ర ఎంత‌న్న‌ది కూడా అందులోనే క‌నిపిస్తుంది. 

* సో మీ సెలెక్ష‌న్ పూర్త‌య్యాక అందులో వ‌చ్చే అమౌంట్‌నే మీరు క‌డితే స‌రిపోతుంది. 

డీటీహెచ్ ఛాన‌ల్ సెలెక్ట‌ర్ యాప్‌ డీటీహెచ్ ఛాన‌ల్స్‌ DTH Channel Selector App