మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళుతుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటిలో ప్రయాణ ఖర్చు ఒకటి. ప్రయాణం అంటే ఫ్లయిట్స్, ట్రయిల్, బస్ ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. అంతేకాక ఫుడ్, లోకల్ ఎక్స్పెన్సెస్, హోటల్స్ ఖర్చులు కూడా లెక్కలోకి వస్తాయి. టూర్ అయ్యే సరికి ఆ లెక్కలన్నీ మనకు గందరగోళంగా అనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ఒక సైట్ ఉంది... అదే ట్రిప్ కాస్ట్ అదెలా పని చేస్తుందో చూద్దాం..
లెక్కలు కట్టేస్తుంది..
ట్రిప్ కాస్ట్ సైట్ ద్వారా ఉపయోగం ఏమిటంటే మన ప్రయాణానికి సంబంధించి అన్ని వివరాలకు ఒక్క క్లిక్ ద్వారా మనకు అందించడం! ప్రపంచంలో మీరు ఎక్కడ ప్రయాణించినా సరే ఖర్చుల వివరాలన్నీ ఇది లెక్కలేసి చెప్పేస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీరు ఏ సిటీకి వెళ్లబోతున్నారో ఆ సిటీ పేరు ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ సిటీకి సంబంధించిన కాస్ట్ ఆఫ్ లీవింగ్ బట్టి లెక్కలు వేసి చెబుతుంది. నైట్ లైఫ్, కామన్ టాక్సీ సర్వీస్, ఇంటర్నెట్ లాంటి వాటి వివరాలు కూడా అందిస్తుంది. ఈ వివరాలను బట్టి మీరు టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒక్క క్లిక్‌తో..
ట్రిప్ కాస్ట్ వేల సిటీల వివరాలను కవర్ చేస్తుంది. ఇందులో అన్ని రకాల డేటా ఉంటుంది. ఏ సిటీకి సంబంధించిన ట్రావెల్ బడ్జెట్ అయినా ఇది చిటికెలో లెక్కలేస్తుంది. ఈ సైట్లోకి వెళ్లి సిటీని ఎంపిక చేసుకున్న తర్వాత మీరు ప్రయాణించే టైమ్ పిరియడ్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎస్ట్మెట్ బటన్ మీద క్లిక్ చేయాలి. కాస్ట్ ఆఫ్ లీవింగ్, ఇంగ్లిష్ ప్రొఫెషియన్సీ, హెల్త్ కేర్, డే నైట్ సేఫ్టీ, ఇంటర్నెట్ స్పీడ్, కామన్ టాక్సీ ఫేర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లాంటి కీలక వివరాలను అందిస్తుంది.
ESTIMATE TRAVEL BUDGET CITY 1-CLICK FLIGHTS HOTELS FOOD LOCAL EXPENSES