టెక్నాలజీ దిగ్గజ సంస్థలన్నీ కరోనా మహమ్మారి నియంత్రణలో తలో చేయి వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం ఒక వెబ్సైట్ను సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఏ దేశంలో ఎంత మంది బాధితులు ఉన్నారు, మృతుల సంఖ్య వంటి వివరాలన్నీ ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. యాక్టివ్ కేసులు, ఎంతమందికి నయమయింది వంటి వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్లో రియల్టైమ్లో అప్డేట్ చేస్తుంటారు. వెబ్సైటు లో ఉంటాయి.
ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్
కరోనా ఉధృతితో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు దాదాపు అందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఇక ప్రజలంతా కరోనా వైరస్ తీవ్రతను తెలుసుకోవడానికి వీలుగా bing.com/covid అనే వెబ్సైట్ను మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సేకరించిన కరోనా వైరస్ వివరాలన్నీ ఇందులో చూడొచ్చు.
ఏఏ వివరాలు ఉంటాయంటే..
* ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని కరోనా కేసులు నమోదయిందీ ఈ వెబ్సైట్ డాష్బోర్డులో చూడొచ్చు.
* యాక్టివ్ కేసులు, కరోనా నుంచి కోలుకున్న (రికవరీ) కేసుల సంఖ్య కూడా కనిపిస్తుంది
* చివరగా మృతుల సంఖ్య కూడా దేశాలవారీగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది.
* కరోనాకు సంబంధించిన న్యూస్, వ్యాధి సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీడియోలు కూడా ఉంటాయి.
* కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ మ్యాప్లో చూపిస్తుంది.
మైకà±à°°à±‹à°¸à°¾à°«à±à°Ÿà± క‌రోనా à°Ÿà±à°°à°¾à°•ింగౠవెబà±â€Œà°¸à±ˆà°Ÿà±â€Œ క‌రోనా à°Ÿà±à°°à°¾à°•ింగౠవెబà±â€Œà°¸à±ˆà°Ÿà±â€Œ బింగà±â€Œ.కామà±â€Œ/కోవిడౠవెబà±â€Œà°¸à±ˆà°Ÿà±â€Œ Microsoft Carona tracking Website bing.com/covid web site Carona tracking website