చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్మీ గతంలోనే ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఈ స్మార్ట్టీవీలు లాంచ్ అయ్యాయి.
అందుబాటు ధరల్లో..
32 అంగుళాల రియల్మీ స్మార్ట్ టీవీ 12,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. 43 ఇంచెస్ స్మార్ట్టీవీ 21,999 రూపాయలకు దొరుకుతుంది. స్మార్ట్టీవీలు మార్కెట్లో చాలానే ఉన్నా అవన్నీ దాదాపు 30 వేల రూపాయలు కనీస ధరలో ఉన్నాయి. మరో చైనా కంపెనీ ఎంఐ తీసుకొచ్చిన టీవీలు కూడా 43 ఇంచెస్ టీవీ 25వేలు ఉంది. ఈ పరిస్థితుల్లో రియల్మీ తక్కువ ధరలతో ఇండియన్ టీవీ మార్కెట్లో సంచలనం సృష్టించబోతుందేమో చూడాలి.
ఇవీ ఫీచర్లు
* ఈ రెండు స్మార్ట్ టీవీలే. ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫామ్పై పని చేస్తాయి.
* మీడియాటెక్ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ రియల్మీ స్మార్ట్ టీవీలో ఉంది.
* డాల్బీ ఆడియో క్వాడ్ ఓ స్టీరియో స్పీకర్లు ఇన్బిల్ట్ గా ఉన్నాయి. మొత్తం నాలుగు స్పీకర్లు ఒక్కోటీ 24 వాట్స్ సౌండ్ను ఇస్తాయి.
* ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని రియల్మీ స్మార్ట్టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ యాప్స్ను ఫ్రీ ఇన్ స్టాల్ చేసింది. కాబట్టి నేరుగా ఈ సర్వీసులను రియల్మీ టీవీలో వీక్షించవచ్చు.
* యాప్స్ కోసం ఈ టీవీల్లో 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
జూన్ 2న అమ్మకాలు ప్రారంభం
వచ్చే నెల 2 నుంచి రియల్ మీ స్మార్ట్ టీవీలను అందరికీ అందుబాటులోకి తెస్తోంది. అయితే ప్రస్తుతం ఆన్లైన్లోనే అమ్మబోతుంది. రియల్ మీ.కాం, ఫ్లిప్కార్ట్ సైట్లలో జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్మీ స్మార్ట్ టీవీలను బుక్ చేసుకోవచ్చని రియల్మీ ప్రకటించింది.
రియ‌లà±â€Œà°®à±€ à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± టీవీ Realme Smart tv smart tv