ఆన్లైన్లో మీ డాక్యుమెంట్లను భద్రపరచడానికి చాలా సర్వీసులు మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సర్వీసులన్నీ సురక్షితమేనా! ఎందుకంటే మనం ఎన్నో విలువైన డాక్యుమెంట్లను కంప్యూటర్లో దాస్తుంటాం. మరి మూడో పార్టీకి చెందిన సైట్లలోనూ లేదా యాప్‌ల ద్వారో వాటిని దాస్తే.. సైబర్ దాడులు జరగవని గ్యారెంటీ ఉందా? ఇలాంటి ఇబ్బంది నుంచి తప్పించి మీ డాక్యుమెంట్‌ను సురక్షితంగా ఉంచడం కోసం బ్లాక్ డాక్ అనే సర్వీసు వచ్చింది. మరి ఏంటి బ్లాక్ డాక్ చూద్దాం..
ఏమిటీ బ్లాక్ డాక్?
ఆన్లైన్లో మన డాక్యుమెంట్లను సేఫ్ కీపింగ్ చేయడం కోసం ఉపయోగించే టూల్‌నే బ్లాక్ డాక్ అంటారు. ఇదో ఎన్క్రిప్టెడ్ డాక్యుమెంట్ మేనేజర్. మీరు ఈ సర్వీసుని ఉపయోగించుకోవాలంటే బ్లాక్ స్టాక్ ఐడీ కావాల్సి ఉంది. అందుకే మీరు బ్లాక్ డాక్‌ను ఉపయోగించే ముందు బ్లాక్ స్టాక్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ఐడీ క్రియేట్ చేసిన తర్వాత బ్లాక్ డాక్ సైట్ ఓపెన్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ మేనేజర్ దగ్గరకు వెళతారు. అక్కడే మీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకుని సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు.
ప్రైవేట్ షేరింగ్
మనం ఈ సైట్లో అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్లకు పేర్లు పెట్టుకోవచ్చు. అంతేకాదు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేయచ్చు, చూడొచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆప్షన్లలో మీకు షేరింగ్ లింక్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ డాక్యుమెంట్లను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ప్రైవేట్ షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దీని ద్వారా మీ డాక్యుమెంట్లను అవరమైన వాళ్లకు మాత్రమే పంపొచ్చు. ఇందుకోసం మీరు ఫైల్ పంపేవాళ్లకు కూడా ఒక బ్లాక్‌స్టాక్ ఐడీ కావాలి.
SHARE DOCUMENTS PRIVATELY BLOCKCHAIN DOCUMENT MANAGER